Share News

Viral : ఏడేళ్లుగా సహజీవనం! ఓ బిడ్డకు తల్లయ్యాక.. బాయ్‌ఫ్రెండ్ మోసం తెలిసి..

ABN , Publish Date - Jun 22 , 2024 | 06:11 PM

ఏడేళ్లుగా సహజీవనం చేస్తున్న బాయ్ ఫ్రెండ్ మోసం తట్టుకోలేక ఓ మహిళ సోషల్ మీడియా లైవ్ స్ట్రీమ్ లో కన్నీరుమున్నీరైంది. అయితే, కొందరు ఆమెపై విమర్శలు ఎక్కుపెట్టారు.

Viral : ఏడేళ్లుగా సహజీవనం! ఓ బిడ్డకు తల్లయ్యాక.. బాయ్‌ఫ్రెండ్ మోసం తెలిసి..

ఇంటర్నెట్ డెస్క్: ఏడేళ్ల పాటు బాయ్‌ఫ్రెండ్ తో సహజీవనం.. ఓ బిడ్డకు తల్లి కూడా అయ్యింది.. ఆ చిన్నారికి ఆటిజం కూడా ఉండటంతో ఆమె బాగోగులు జాగ్రత్తగా చూసుకుంటోంది. మరోసారి గర్భం దాల్చిన సమయంలో బాయ్‌ఫ్రెండ్ చేసిన మోసం తెలిసి దిమ్మెరపోయింది. తన బాధను నెట్టింట పంచుకోగా కొందరు మహిళనే తిట్టిపోస్తున్నారు. అమెరికాలో వెలుగు చూసిన ఈ ఘటన ప్రస్తుతం వైరల్‌గా (Viral) మారింది.

Viral: సముద్రంలో వేట.. గెద్ద పవర్ అంటే ఇదీ! ఒళ్లుగగుర్పొడిచే వీడియో!


బాయ్‌ఫ్రెండ్ చేసిన మోసం తట్టుకోలేక మాజీ రియాల్టీ స్టార్ క కెల్లీ సోషల్ మీడియా వేదికగా కన్నీరుమున్నీరైన వీడియో ట్రెండింగ్‌లో కనసాగుతోంది. తాను గర్భవతి అని తెలిసీ తన బాయ్‌ఫ్రెండ్ తన స్నేహితురాలితోనే సంబంధం కొనసాగిస్తున్నాడని ఆమె చెప్పుకొచ్చింది. ఆఫీసు పనిమీద మెక్సికోలో ఉన్నానని చెప్పిన అతడు తన స్నేహితురాలితో కలిసి టూర్‌పై వెళ్లాడని చెప్పింది. టూర్‌లో ఉండగా వారిద్దరికీ యాక్సిడెంట్ కావడంతో తన స్నేహితురాలి ఫ్యామిలీ ఆసుపత్రి ఖర్చుల కోసం గోఫండ్‌మీ పేజ్ ప్రారంభించిందని, అది అనుకోకుండా తన కంట పడటంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చిందంటూ కన్నీరుమున్నీరైంది (Former Reality TV Star Live Streams Meltdown Over boyfriend betraying her).


ఆమె పరిస్థితి అనేక మంది నెటిజన్లు చలించిపోయారు. బిడ్డల కోసమైన ఆమె దృఢంగా ఉండాలని, అలాంటి మోసగాణ్ణి తన జీవితం నుంచి తరిమేయాలని సూచించారు. కొందరు మాత్రం ఆమె తీరుపై మండిపడ్డారు. ఏడుస్తూ వీడియోలు లైవ్ స్ట్రీమ్ చేసే వారు విపరీతమసస్తత్వం గలవారని కొందరు కామెంట్ చేశారు. పట్టరాని బాధ వస్తే స్నేహితులు, బంధువుల సమక్షంలో కన్నీళ్లుపెట్టుకుంటే ఓ అర్థం ఉంటుంది కానీ సోషల్ మీడియాలో ఏడుపు వీడియోలు పెడితే ఏమొస్తుందని ప్రశ్నించారు. సోషల్ మీడియాను వదిలిపెట్టి గొప్ప వ్యక్తిత్వాన్ని నిర్మించుకుని కష్టాలను ఎదుర్కోవాలని సూచించారు.

Updated Date - Jun 22 , 2024 | 06:12 PM