Share News

Astro Tips: శుక్రవారం ఇలా చేస్తే ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయ్..!

ABN , Publish Date - Mar 01 , 2024 | 09:50 AM

Friday Astro Tips: లక్ష్మీ దేవి.. సిరిసంపదలు సిద్ధింపజేసే అమ్మవారు. అందుకే.. అమ్మవారిని ప్రజలు భక్తి శ్రద్ధలతో నిరంతరం పూజిస్తుంటారు. అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడానికి, లక్ష్మీదేవి(Goddess Laxmi) ఆశీస్సులు పొందేందుకు ప్రత్యేక పూజలు చేయడం, ఉపవాసాలు ఉండటం, ఇంట్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ప్రధానంగా శుక్రవారం రోజును లక్ష్మీదేవికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజుగా పేర్కొంటారు. అందుకే శుక్రవారం(Friday) నాడు

Astro Tips: శుక్రవారం ఇలా చేస్తే ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయ్..!
Friday Astro Tips

Friday Astro Tips: లక్ష్మీ దేవి.. సిరిసంపదలు సిద్ధింపజేసే అమ్మవారు. అందుకే.. అమ్మవారిని ప్రజలు భక్తి శ్రద్ధలతో నిరంతరం పూజిస్తుంటారు. అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడానికి, లక్ష్మీదేవి(Goddess Laxmi) ఆశీస్సులు పొందేందుకు ప్రత్యేక పూజలు చేయడం, ఉపవాసాలు ఉండటం, ఇంట్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ప్రధానంగా శుక్రవారం రోజును లక్ష్మీదేవికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజుగా పేర్కొంటారు. అందుకే శుక్రవారం(Friday) నాడు ప్రజలు భక్తి ప్రపత్తులతో అమ్మవారిని పూజిస్తారు.

అమ్మవారి ఆశీర్వాదం పొందిన వ్యక్తి సంతోషకరమైన జీవితాన్ని, సంపద, శ్రేయస్సును పొందుతాడని విశ్వాసం. అమ్మవారి ఆశీర్వాదంతో ఎలాంటి ఆర్థిక సంక్షోభం లేకుండా జీవిస్తారు. అయితే, ప్రజలు కొందరు ఆర్థిక సమస్యలతో సతమతం అవుతుంటారు. అలాంటి వారు శుక్రవారం రోజున లక్ష్మీదేవికి ప్రత్యేక పద్ధతిలో పూజలు చేయాలని వేద పండితులు, జ్యోతిష్య శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. ఇలా చేయడం వలన సమస్యలు తొలగిపోతాయని చెబుతున్నారు. అయితే, అమ్మవారిని పూజించడం ఎంత ముఖ్యమొ.. ఆ పూజలో ఎలాంటి పొరపాట్లు లేకుండా చూసుకోవడం కూడా అంతే ముఖ్యం అని సూచిస్తున్నారు. మరి శుక్రవారం ఏం చేయాలి? పూజ ఎలా చేయాలి? ఏ పొరపాట్లు చేయొద్దు? జ్యోతిష్య నిపుణులు చెబుతున్న కీలక వివరాలు మీకోసం..

శుక్రవారం సూర్యాస్తమయం తరువాత ఈ పనులు చేయొద్దు..

లక్ష్మీ పురాణం ప్రకారం.. సూర్యాస్తమయం అయిన తరువాత గోర్లు, జుట్టు కత్తిరించకూడదు. ఇలా చేయడం వల్ల ఇంట్లోంచి లక్ష్మీదేవి వెళ్లిపోతుంది. ఇలా చేయడం వల్ల ఇంట్లో నెగిటీవ్ ఎనర్జీ వచ్చి క్రమంగా అప్పులు పెరుగుతాయి. అందుకే.. పొరపాటున కూడా శుక్రవారం సాయంత్రం వేళల్లో ఈ తప్పు చేయొద్దు.

శుక్రవారం సూర్యాస్తమయం అయిన తరువాత ఇళ్లు ఊకొద్దు. సూర్యాస్తమయం అయిన తరువాత ఇళ్లు ఊడ్చడం వల్ల లక్ష్మీదేవికి ఆగ్రహం కలుగుతుందట. తద్వారా ఇంటిని విడిచి వెళ్తుందని, ఆర్థిక సమస్యలు మొదలవుతాయని చెబుతున్నారు. అందుకే.. సూర్యాస్తమయానికి ముందే ఇంటిని శుభ్రం చేసుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు.

సూర్యాస్తమయం తర్వాత అంటే సాయంత్రం వేళల్లో చెట్లను, మొక్కలను తాకకూడదు. మొక్కలను తొలగించడం, నీరు పోయడం కూడా చేయకూడదు. సూర్యాస్తమయం తర్వాత చెట్లు, మొక్కలు నిద్రపోతాయని చెబుతుంటారు. ఆ కారణంగా వాటిని ఇబ్బంది పెట్టడం శ్రేయస్కరం కాదని చెబుతున్నారు. ముఖ్యంగా తులసికి నీరు అస్సలు పొయవద్దని, అలా చేస్తే లక్ష్మీదేవికి ఆగ్రహం కలిగి సమస్యల బారిన పడతారని చెబుతున్నారు పండితులు.

ఇవి అస్సలు దానం చేయొద్దు..

శుక్రవారం రోజున వెండి, పంచదార దానం చేయవద్దని వేద పండితులు చెబుతున్నారు. శుక్రవారం వీటిని దానం చేయడం అశుభం అంటారు. వెండి, పంచదార లక్ష్మీదేవి ప్రీతికరమైన అంశాలు. వీటిని దానం చేయడం వల్ల శుక్ర గ్రహం బలహీనపడుతుంది. దీని కారణంగా జీవితంలో డబ్బు లేకపోవడంతో పాటు భౌతిక ఆనందం తగ్గుతుంది.

గమనిక: పైన పేర్కొన్న వివరాలు వేదపండితులు, జ్యోతిష్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు.

మరిన్ని ప్రత్యేకం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Updated Date - Mar 01 , 2024 | 09:50 AM