Share News

Viral Video: వధువు మెడలో దండ వేస్తుండగా షాకింగ్ సీన్.. వెనుక నుంచి వచ్చిన అమ్మాయి ఒక్క తన్ను తంతే..

ABN , Publish Date - Dec 29 , 2024 | 06:09 PM

బంధుమిత్రుల మధ్య ఉల్లాసంగా వధూవరులు పెళ్లి కార్యక్రమాలను పూర్తి చేస్తున్నారు.. వేదిక మీద నిల్చుని దండలు మార్చుకుంటున్నారు.. సరిగ్గా అదే సమయంలో ఓ అమ్మాయి ఎక్కడి నుంచి వచ్చిందో.. నేరుగా వేదిక మీదకు వచ్చి వధువు మెడలో దండ వేస్తున్న వరుడిని కాలితో ఒక్క తన్ను తన్నింది..

Viral Video: వధువు మెడలో దండ వేస్తుండగా షాకింగ్ సీన్.. వెనుక నుంచి వచ్చిన అమ్మాయి ఒక్క తన్ను తంతే..
girlfriend reached the stage and kicked the groom

అక్కడ పెళ్లి (Wedding) వేడుక అంగరంగ వైభవంగా జరుగుతోంది. బంధుమిత్రుల మధ్య ఉల్లాసంగా వధూవరులు పెళ్లి కార్యక్రమాలను పూర్తి చేస్తున్నారు.. వేదిక మీద నిల్చుని దండలు మార్చుకుంటున్నారు.. సరిగ్గా అదే సమయంలో ఓ అమ్మాయి ఎక్కడి నుంచి వచ్చిందో.. నేరుగా వేదిక మీదకు వచ్చి వధువు (Bride) మెడలో దండ వేస్తున్న వరుడి (Groom)ని కాలితో ఒక్క తన్ను తన్నింది.. దెబ్బకు ఆ వరుడు ఎగిరి పడ్డాడు.. ఆమె వేదిక మీద ఉన్న వారితో వాగ్వాదానికి దిగింది.. తర్వాత అసలు విషయం బయటపడింది.. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది (Viral Video).


sonukumargiri396 అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఓ వివాహ వేడుకలో వరుడు తన వధువుకు పూలమాల వేస్తుండగా ఒకమ్మాయి వెనుక నుంచి వచ్చి తన్నింది. ఆ హఠాత్పరిణామాన్ని చూసి పెళ్లికి వచ్చిన అతిథులు ఆశ్చర్యపోయారు. కింద పడిపోయిన వరుడిని కాపాడేందుకు ఓ మహిళ పరిగెత్తింది. ఆ యువతి మళ్లీ వరుణ్ని కొట్టడానికి ప్రయత్నించింది. ఆ సమయంలో ఆమెతో వధువు వాగ్వాదానికి దిగింది. ఆ యువతి ఆ వరుడి మాజీ ప్రియురాలు అని బయటపడింది. తనను మోసం చేసి పెళ్లి చేసుకుంటున్న విషయం తెలుసుకుని నేరుగా పెళ్లి వేదికపైనే బుద్ధి చెప్పింది.


పెళ్లికి హాజరైన అతిథులు ఆ ఘటన మొత్తాన్ని రికార్డు చేసి ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు 5 లక్షల కంటే ఎక్కువ మంది వీక్షించారు. దాదాపు 47 వేల మంది ఆ వీడియోను లైక్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో ఫన్నీ కామెంట్లు చేశారు. ``ఈ భయం వల్లే నేను పెళ్లి చేసుకోవడం లేదు``, ``మోసం చేసిన వాడికి సరైన బుద్ధి చెప్పింది`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Viral Video: హృదయ విదారకం.. కళ్ల ముందే చిన్నారి మాయం.. వరద నీటిలో ఎలా పడ్డాడో చూడండి..


Viral Video: వావ్.. పులులు కూడా ఇలా ప్రవర్తిస్తాయా? ఓ వ్యక్తి యాక్షన్‌కు పులి రియాక్షన్ చూస్తే..


Viral News: హవ్వా.. ఎంత దుర్మార్గం.. చపాతీలు రావడం ఆలస్యమైందని పెళ్లి క్యాన్సిల్.. విషయమేంటంటే..


Optical Illusion Test: మీకు లాలీపాప్ అంటే ఇష్టమా?.. ఈ ఐస్‌క్రీమ్‌ల మధ్య అదెక్కడుందో కనిపెట్టండి..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి

Updated Date - Dec 29 , 2024 | 06:09 PM