Share News

Viral Video: హృదయ విదారకం.. కళ్ల ముందే చిన్నారి మాయం.. వరద నీటిలో ఎలా పడ్డాడో చూడండి..

ABN , Publish Date - Dec 29 , 2024 | 04:05 PM

చిన్న పిల్లలను అనుక్షణం కనిపెట్టుకుని చూస్తుండాలి. లేకపోతే వారు ప్రమాదాలకు కారణమవుతుంటారు. ఇంటి దగ్గర కూడా వారిని ఓ కంట కనిపెడుతూ ఉండకపోతే ఊహించని ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోయే పరిస్థితి సంభవిస్తుంది. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో చూస్తే హృదయం ముక్కలవడం ఖాయం.

Viral Video: హృదయ విదారకం.. కళ్ల ముందే చిన్నారి మాయం.. వరద నీటిలో ఎలా పడ్డాడో చూడండి..
child drowned in flood water

చిన్న వయసు పిల్లలను (Children) ఎంతో జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. వారికి ఊహ తెలిసే వరకు అనుక్షణం కనిపెట్టుకుని చూస్తుండాలి. లేకపోతే వారు ప్రమాదాలకు (Accident) కారణమవుతుంటారు. ఇంటి దగ్గర కూడా వారిని ఓ కంట కనిపెడుతూ ఉండకపోతే ఊహించని ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోయే పరిస్థితి సంభవిస్తుంది. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో చూస్తే హృదయం ముక్కలవడం ఖాయం. ఆ వీడియోలో అభం శుభం తెలియని ఓ చిన్నారి కాలవలో పడిపోయి మాయం అయిపోయాడు. ఇంటి బయట అమర్చిన సీసీటీవీ కెమెరా చేసే వరకు ఆ చిన్నారి ఏమయ్యాడో ఎవరికీ తెలియలేదు (Viral Video).


tatak_sinta_cell అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఆ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. వర్షం తగ్గిన తర్వాత ఓ బాలిక, ఓ చిన్నారి బయటకు వచ్చారు. కాలువలో వేగంగా ప్రవహిస్తున్న నీటి వైపు ఆ బాలిక వెళ్లింది. వెనుకే వచ్చిన చిన్నారి ఆ కాలువ చివరకు వెళ్లిపోయి ఆ నీటిలో పడిపోయాడు. ఆ చిన్నారి తన వెనుకే వచ్చినట్టు ఆ బాలిక చూసుకోలేదు. అక్కడ ప్రమాదం జరిగిందనే విషయమే ఆ బాలికకు తెలియలేదు. మరో పిల్లవాడు వెనుక నుంచి ఏడుస్తూ వచ్చి ఆ బాలికకు విషయం అర్థమయ్యేలా చెప్పాడు. వెంటనే వారిద్దరూ పరిగెత్తుకుంటూ ఇంట్లోకి వెళ్లిపోయారు.


ఈ వీడియోను ఇండోనేసియాలో చిత్రీకరించినట్టు సమాచారం. ఈ నెల 24వ తేదీన ఈ ఘటన జరిగింది. కాలువలో పడిపోయిన చిన్నారి పరిస్థితి ఏమైందో ఇప్పటివరకు సమాచారం లేదు. ఆ ఘటన మొత్తం ఇంటి బయట అమర్చిన సీసీటీవీ కెమెరాలో రికార్డు అయింది. ఆ వైరల్ వీడియోను చూసిన జనాలు షాక్ అవుతున్నారు. ``ఆ చిన్నారి పరిస్థితి ఏమైంది``, ``చిన్న పిల్లలను అనుక్షణం జాగ్రత్తగా చూసుకోవాలి`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Viral Video: వావ్.. పులులు కూడా ఇలా ప్రవర్తిస్తాయా? ఓ వ్యక్తి యాక్షన్‌కు పులి రియాక్షన్ చూస్తే..


Viral News: హవ్వా.. ఎంత దుర్మార్గం.. చపాతీలు రావడం ఆలస్యమైందని పెళ్లి క్యాన్సిల్.. విషయమేంటంటే..


Optical Illusion Test: మీకు లాలీపాప్ అంటే ఇష్టమా?.. ఈ ఐస్‌క్రీమ్‌ల మధ్య అదెక్కడుందో కనిపెట్టండి..


Viral Video: ఐరన్ బాక్స్ లేకపోతేనేం.. తెలివి ఉంది కదా.. ఓ వ్యక్తి షర్ట్‌ను ఎలా ఇస్త్రీ చేస్తున్నాడో చూడండి..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి

Updated Date - Dec 29 , 2024 | 04:05 PM