Share News

Viral: ప్రపంచంలో తొలిసారిగా ‘డిజిటల్ కండోమ్‌’ను రూపొందించిన జర్మన్ కంపెనీ!

ABN , Publish Date - Oct 27 , 2024 | 04:29 PM

స్మార్ట్ ఫోన్లతో సీక్రెట్ రికార్డింగులకు అడ్డుకట్ట వేసేందుకు జర్మనీ హెల్త్ బ్రాండ్ బిల్లీ బాయ్‌ ఓ యాప్‌ను రూపొందించింది. డిజిటల్ కండోమ్‌గా పేరు పడ్డ ఈ యాప్ ప్రస్తుతం నెట్టింట చర్చనీయాంశంగా మారింది.

Viral: ప్రపంచంలో తొలిసారిగా ‘డిజిటల్ కండోమ్‌’ను రూపొందించిన జర్మన్ కంపెనీ!

ఇంటర్నెట్ డెస్క్: సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోతున్న కాలం ఇది. మనసుకు నచ్చిన వారితో సన్నిహితంగా ఉన్న దృశ్యాలు నెట్టింట చేరి తలవంపులకు దారి తీస్తున్న ఘటనలు అనేకం ఇప్పటికే వెలుగు చూశాయి. రివెంజ్ పార్న్ పేరిట కావాలనే కొందరు తమ ప్రేయసీ ప్రియులతో సన్నిహితంగా ఉన్న క్షణాలను రికార్డు చేసి బెదిరింపులకు దిగుతున్నారు. కొందరు సంభాషణలను గుట్టుచప్పుడు కాకుండా రికార్డు చేస్తున్నారు. ఇలాంటి నేరాలను అరికట్టేందుకు జర్మన్ హెల్త్ బ్రాండ్ బిల్లీ బాయ్ ఓ యాప్‌ను ఇటీవల మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ యాప్ వాడకం కండోమ్ వినియోగించినంత సులువని ఓ ట్యాగ్ కూడా ఉండటంతో జనాలు దీన్ని ‘డిజిటల్ కండోమ్’ అంటూ నెట్టింట వైరల్ (Viral) చేస్తున్నారు.

Viral: బాస్ తిట్టడంతో షాక్! చలనం లేకుండా బొమ్మలా మారిపోయిన యువతి!


వ్యక్తుల అనుమతి లేకుండా వారి సన్నిహిత క్షణాల తాలూకు వాయిస్, వీడియో రికార్డింగ్‌ను అరికట్టేందుకు దీన్ని రూపొందించినట్టు యాప్ డెవలపర్ ఫిలిపే ఆల్మీడా తెలిపారు. స్మార్ట్ ఫోన్ కూడా శరీరంలో ఓ భాగంలా మారిన నేపథ్యంలో ప్రజలు తమ వ్యక్తిగత వివరాలు అనేకం ఇందులో నిక్షిప్తం చేసుకుంటున్నట్టు తెలిపారు. కాబట్టి, ఈ యాప్ ఆవశ్యకమని తెలిపారు.

Viral: ఊహించని రీతిలో చిరుత సాహసం! ప్రాణాలకు తెగించి మరీ.. షాకింగ్ వీడియో


ఇదెలా పనిచేస్తుందంటే..

ఈ యాప్ బ్లూటూత్ ఆధారంగా పనిచేస్తుంది. ముందుగా యూజర్లు తమ ఫోన్లను ఒక దగ్గరకు చేర్చి పెట్టాలి. ఒకరికొకరు సన్నిహితం అయ్యేముందు యాప్‌ను స్వైప్ చేసి యాక్టివేట్ చేయాలి. దీంతో, కెమెరా, మైక్రోఫోన్ ఏ విషయాన్నీ రికార్డు చేయకుండా ఈ యాప్ అడ్డుకుంటుంది. దీన్ని తప్పించేందుకు గుట్టుచప్పుడు కాకుండా ఎవరైనా ప్రయత్నిస్తే వెంటనే అలర్ట్ సందేశం పంపిస్తుంది. అలారమ్ కూడా మోగుతుంది. అనుమతి లేకుండా రికార్డింగ్ ప్రయత్నాలు జరుగుతున్న విషయాన్ని సంబంధిత యూజర్లందరికీ తెలియజేస్తుంది. ఈ యాప్ ద్వారా పలు డివైజ్‌లను ఒకేసారి అడ్డుకోవచ్చని కూడా కంపెనీ తెలిపింది.

కాగా, ఈ యాప్‌ విడుదల కాగానే నెట్టింట రచ్చ రచ్చ జరిగింది. కొందరికి ఇదంతా నవ్వులాటగా అనిపిస్తే మరికొంందరు మాత్రం ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇలాంటి ఉత్పత్తులు అవసరం కూడా ఏర్పడటం ఆధునిక జీవితపు విషాదమని ఓ వ్యక్తి అభివర్ణించారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ యాప్ ట్రెండింగ్‌లో కొనసాగుతోంది.

Viral: దీపావళి రోజున ఇంట్లో ఒంటరిగా మహిళ! ఇంతలో ఊహించని విధంగా..

Read Latest and Travel News

Updated Date - Oct 27 , 2024 | 06:20 PM