Share News

Technology : అధిక కరెంటు బిల్లు వస్తోందా.. అదుపు చేసే మార్గాలివే..

ABN , Publish Date - Dec 21 , 2024 | 05:47 PM

మీకు అధిక కరెంటు బిల్లు వస్తోందా.. విద్యుత్ ఎక్కువగా వినియోగించకున్నా ఎప్పటికప్పుడు అమాంతం బిల్లు పెరిగిపోతూనే ఉందా.. ఇందుకు మీటర్‌లో సమస్యే కారణమని భావిస్తున్నారా.. అయితే ఈ కథనం మీకోసమే. కింది మార్గాలను అనుసరించి మీరు కరెంట్ మీటర్‌ను ఎవరి సహాయం లేకుండానే తనిఖీ చేసుకోవచ్చు. అందులో తలెత్తిన లోపాలను గుర్తించి స్వయంగా పరిష్కరించుకోవచ్చు. ఆ విధానాలేంటో తెలుసుకుందామా..

 Technology : అధిక కరెంటు బిల్లు వస్తోందా.. అదుపు చేసే మార్గాలివే..
Electric Meter

మీకు అధిక కరెంటు బిల్లు వస్తోందా.. విద్యుత్ ఎక్కువగా వినియోగించకున్నా ఎప్పటికప్పుడు అమాంతం బిల్లు పెరిగిపోతూనే ఉందా.. ఇందుకు మీటర్‌లో సమస్యే కారణమని భావిస్తున్నారా.. అయితే ఈ కథనం మీకోసమే. కింది మార్గాలను అనుసరించి మీరు కరెంట్ మీటర్‌ను ఎవరి సహాయం లేకుండానే తనిఖీ చేసుకోవచ్చు. అందులో తలెత్తిన లోపాలను గుర్తించి స్వయంగా పరిష్కరించుకోవచ్చు. ఆ విధానాలేంటో తెలుసుకుందామా..


కరెంట్ సదుపాయం లేని ఇళ్లు నేటికాలంలో అరుదు. పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా చాలామంది ఇళ్లల్లో లైట్లు, ఫ్యాన్లు, కూలర్, రిఫ్రిజిరేటర్, మోటర్ వంటివి ఉండటం కామన్. అయితే, ఎక్కువ కరెంట్ వాడకున్నా కొంతమంది అధిక బిల్లు సమస్య ఎదుర్కొంటూ ఉంటారు. కనీసంగా వినియోగించినా విద్యుత్ బిల్లు అనూహ్యంగా పెరిగిపోవడానికి కారణం తప్పుడు మీటర్ కావచ్చు. సాధారణం కంటే మీటర్ రీడింగ్ వేగంగా నడిస్తే, తక్కువ విద్యుత్ వినియోగం ఉన్నప్పటికీ బిల్లులు పెరిగేందుకు దోహదం చేస్తుంది.


అధిక కరెంటు బిల్లులకు కారణాలు ఏమిటి?

భారతదేశం అంతటా విద్యుత్ ధరలు మారుతూనే ఉంటాయి. ఆయా ప్రాంతాలను బట్టి యూనిట్‌ ధర రూ.7 నుంచి రూ.9 మధ్య ఉంటుంది. దీంతో వినియోగం పెరిగే కొద్దీ ఖర్చు కూడా పెరుగుతుంది. వినియోగాన్ని కచ్చితంగా లెక్కగట్టేందుకు ప్రతి ఇంటికి మీటర్లు ఏర్పాటు చేస్తుంది విద్యుత్‌శాఖ. చాలాసార్లు ఈ మీటర్లు సరైన రీడింగులను అందిస్తాయి. కొన్ని సందర్భాల్లోనే మీటర్లు అసాధారణంగా పనిచేసే అవకాశముంది.


మీ విద్యుత్ మీటర్ వేగంగా పని చేస్తుందో లేదో తనిఖీ చేయడం ఎలా?

మీ విద్యుత్ మీటర్ అధిక బిల్లులకు కారణమవుతుందని అనుమానించినట్లయితే,, మీరు ఇంట్లోనే దాని కచ్చితత్వాన్ని ఇలా ధృవీకరించవచ్చు:

1. ముందుగా మీ ఇంటిలోని అన్ని ఎలక్ట్రికల్ పరికరాలను స్విచ్ ఆఫ్ చేయండి.

2. మీటర్ ప్రస్తుత రీడింగ్‌ను రికార్డ్ చేయండి.

3. సరిగ్గా ఒక గంట పాటు హీటర్ లేదా 1,000-వాట్ ల్యాంప్ వంటి పరికరాన్ని ఆన్ చేయండి.

4. గంట వ్యవధి తర్వాత కొత్త రీడింగ్ రికార్డ్ చేయండి.

5. కచ్చితమైన మీటర్: ఒక యూనిట్ (1 కిలోవాట్-గంట) ఉంటే మీ మీటర్ ఖచ్చితంగా పని చేస్తుందని అర్థం.

6. తప్పు మీటర్: రీడింగ్ ఎక్కువగా ఉంటే, మీటర్ వేగంగా నడుస్తోందని అర్థం. అదే తక్కువగా ఉంటే మీటర్ నెమ్మదిగా ఉన్నట్టు.


ముఖ్యమైన గమనిక

1. స్థిరమైన పోలికల కోసం ఎల్లప్పుడూ రోజులో ఒకే సమయంలో రీడింగులను తీసుకోండి.

2. ఈ పద్ధతిలో సుమారుగా ఫలితం పొందవచ్చు. కచ్చితమైన పరీక్ష కోసం మీ విద్యుత్ శాఖను సంప్రదించండి.

3. మీ మీటర్ తప్పుగా ఉందని మీకు అనుమానం వస్తే విద్యుత్ శాఖకు ఫిర్యాదు చేసి అధికారిక పరీక్షను అభ్యర్థించవచ్చు. ఈ సేవ కోసం కొంత రుసుము చెల్లించాల్సి రావచ్చు. ఈ విధానంతో కచ్చితమైన రీడింగ్‌ పొంది అధిక బిల్లింగ్‌ను నిరోధించుకోవచ్చు.


మీ విద్యుత్ మీటర్‌ను క్రమం తప్పకుండా తనిఖీ చేయడం వలన కచ్చితమైన బిల్లింగ్‌ను నిర్ధారించుకుని అనవసరమైన ఖర్చులు తగ్గించుకోవచ్చు.

Updated Date - Dec 21 , 2024 | 05:47 PM