Share News

Ghee Test: మీరు వాడుతున్న నెయ్యి స్వచ్చమైనదేనా? ఈ 5 మార్గాల్లో తెలుసుకోండి..!

ABN , Publish Date - Jun 28 , 2024 | 04:09 PM

నెయ్యిని పాలనుండి కొందరు, పెరుగు నుండి కొందరు తయారుచేస్తుంటారు. ప్రస్తుతం మార్కెట్లో వివిధ రకాల బ్రాండ్లలో నెయ్యి లభ్యమవుతోంది. అయితే అన్ని రకాల పదార్థాలు కల్తీ అయినట్టు నెయ్యి కూడా కల్తీ అవుతోంది. ఈ కల్తీ నెయ్యి వాడటం వల్ల అనారోగ్యాలు చాలా తొందరగా వస్తాయి. అందుకే మీరు వాడుతున్న నెయ్యి స్వచ్చమైనదా లేదా నకిలీదా కనుక్కోవడం చాలా ముఖ్యం.

Ghee Test:  మీరు వాడుతున్న నెయ్యి స్వచ్చమైనదేనా? ఈ 5 మార్గాల్లో తెలుసుకోండి..!

నెయ్యి భారతీయుల జీవనశైలిలో ప్రధాన భాగం. దీన్ని వివిధ రకాల వంటల్లోనూ, స్వీట్లలోనూ ఉపయోగిస్తుంటారు. దేవుడి దీపారాధన నుండి, ఆయుర్వేద వైద్యం వరకు నెయ్యికి చాలా గొప్ప ప్రాధాన్యత ఉంది. నెయ్యిని పాలనుండి కొందరు, పెరుగు నుండి కొందరు తయారుచేస్తుంటారు. ప్రస్తుతం మార్కెట్లో వివిధ రకాల బ్రాండ్లలో నెయ్యి లభ్యమవుతోంది. అయితే అన్ని రకాల పదార్థాలు కల్తీ అయినట్టు నెయ్యి కూడా కల్తీ అవుతోంది. ఈ కల్తీ నెయ్యి వాడటం వల్ల అనారోగ్యాలు చాలా తొందరగా వస్తాయి. అందుకే మీరు వాడుతున్న నెయ్యి స్వచ్చమైనదా లేదా నకిలీదా కనుక్కోవడం చాలా ముఖ్యం. అసలు నెయ్యిని ఎలా కల్తీ చేస్తున్నారు. నకిలీ నెయ్యిని గుర్తించడం ఎలా? తెలుసుకుంటే..

Ceiling Fan: సీలింగ్ ఫ్యాన్ నుంచి గాలి వేడిగా వస్తోందా? మీరు చేస్తున్న మిస్టేక్ ఇదే..!


నకిలీ నెయ్యి ఎలా తయారు చేస్తున్నారు?

ఇటివల కాలంలో మార్కెట్లలో వేల లీటర్ల నకిలీ నెయ్యి పట్టుబడింది. దీని తయారీలో కూరగాయల నూనె, వెన్న, డాల్డా, హైడ్రోజనేటెడ్ ఆయిల్ ఉపయోగిస్తున్నారు. ఇలాంటి కల్తీ పదార్థాలతో తయారు చేసిన నెయ్యిని గుర్తించాలంటే కింది 5 పద్దతులలో ఏదో ఒకటి ఫాలో అవ్వాలి.

ఒక గ్లాసు నీటిలో 1 చెంచా నెయ్యి కలపాలి. నెయ్యి నీటిమీద తేలితే అది నిజమైన నెయ్యి అని అర్థం. ఒకవేళ నెయ్యి మునిగిపోతే అది నకిలీ నెయ్యి అని అర్థం.

నెయ్యిని అరచేతికి రాసుకుని బాగా రుద్దాలి. ఇలా రుద్దిన తరువాత స్వచ్చమైన నెయ్యి అయితే చాలాసేపటి వరకు మంచి సువాసన ఉంటుంది. నకిలీ నెయ్యి అయితే వాసన కొద్దిసేపటికే తగ్గిపోతుంది.

Kitchen Tips: నల్లగా మారిన పాన్ ను ఇలా క్లీన్ చేసి చూడండి.. కొత్తదానిలా మెరుస్తుంది..!



మీరు వాడుతున్న నెయ్యి స్వచ్చమైనదా కాదా తెలుసుకోవాలంటే నెయ్యిని మళ్లీ వేడి చేయాలి. దాన్ని 24 గంటలపాటు అలాగే ఉంచాలి. 24 గంటల తరువాత నెయ్యి పసుపు రంగులో ఉండి, మునుపటిలా వాసన వస్తుంటే అది అసలైన నెయ్యి అని అర్థం. అలా కాకుండా నెయ్యి సువాసన తొందరగా కోల్పోయి రంగు మారితే అది నకిలీ నెయ్యి అని అర్థం.

మీర వాడుతున్న నెయ్యిలో కొంచెం విడిగా తీసుకుని దాంట్లో పంచదార కొద్దిగా కలపాలి. నెయ్యి రంగు లేత ఎరుపు రంగులోకి మారితే ఆ నెయ్యి కల్తీ అయ్యిందని అర్థం.

నెయ్యి కల్తీదా కాదా కనుక్కోవడానికి మరొక సులువైన చిట్కా ఉంది. ఇంట్లో తయారుచేసిన నెయ్యిని, బయట కొన్న నెయ్యిని పోల్చి చూడాలి. ఇలా పోల్చి చూసినప్పుడు నెయ్యి వాసన, రంగు, నెయ్యి తీరును బట్టి నెయ్యి నకిలీదా, స్వచ్చమైనదా తెలుకోవచ్చు.

Yoga: 30రోజులు.. ఈ రెండు యోగాసనాలు వేసి చూడండి.. మీ ఫిట్‌నెస్ ఎంత మెరుగవుతుందంటే..!


Curd: వర్షాకాలంలో పెరుగు తినేవారికి అలెర్ట్.. ఈ నిజాలు తెలుసుకోకుంటే నష్టపోతారు..!


మరిన్ని ప్రత్యేక వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Jun 28 , 2024 | 04:09 PM