Viral video: వామ్మో.. ఇలాంటి జిరాఫీలు కూడా ఉంటాయా.. మహిళ దగ్గరికి వెళ్లడంతో.. చివరకు..
ABN , Publish Date - Jun 26 , 2024 | 05:07 PM
అడవి జంతువుల్లో శాంతంగా కనిపించే వాటిలో జిరాఫీలు కూడా ఒకటి. సాధాణంగా జిరాఫీల్లో ఆవేశం కనిపించదు. అయితే వాటిపై దాడి చేయడానికి ప్రయత్నించే జంతువులను అవి తమ బలమైన కాళ్తతో తన్నుతుంటాయి. కొన్నిసార్లు..
![Viral video: వామ్మో.. ఇలాంటి జిరాఫీలు కూడా ఉంటాయా.. మహిళ దగ్గరికి వెళ్లడంతో.. చివరకు..](https://media.andhrajyothy.com/media/2024/20240625/giraffe_kicking_woman_78b62c6cc5_v_jpg.webp)
అడవి జంతువుల్లో శాంతంగా కనిపించే వాటిలో జిరాఫీలు కూడా ఒకటి. సాధాణంగా జిరాఫీల్లో ఆవేశం కనిపించదు. అయితే వాటిపై దాడి చేయడానికి ప్రయత్నించే జంతువులను అవి తమ బలమైన కాళ్తతో తన్నుతుంటాయి. కొన్నిసార్లు వీటి దెబ్బకు పులులు, సింహాలు కూడా భయంతో పారిపోతుంటాయి. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషళ్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. అయితే తాజాగా, వైరల్ అవుతున్న వీడియోలో జిరాఫీ విచిత్రంగా ప్రవర్తించడం చూసి అంతా అవాక్కవుతున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. ఈ ఘటన దక్షిణాఫ్రికాలో (South Africa) చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. స్థానిక ప్రాంతానికి చెందిన ముసివా సిఖ్వారీ అనే మహిళ టిక్‌టాక్‌లో వీడియోలు చేస్తుంటుంది. అయితే ఈమెకు ఇటీవల షాకింగ్ అనుభవం ఎదురైంది. వీడియోలు చేసే క్రమంలో ఆమె ఓ జిరాఫీ వద్దకు వెళ్లా్ల్సి వచ్చింది. ఇంతవరకూ బాగానే ఉన్నా.. ఇక్కడే అసలు సమస్య వచ్చి పడింది.
Viral video: చిరుత కన్నేస్తే ఇలాగే ఉంటుంది మరి.. నీటిలోని మొసలిని ఎలా వేటాడిందో చూస్తే..
జిరాఫీ సమీపానికి వెళ్లి ఆసక్తిగా గమనిస్తున్న సందర్భంలో.. సాధారణానికి భిన్నంగా జిరాఫీకి కోపం కట్టలు తెంచుకుంది. ఉన్నట్టుండి కాలితో (giraffe kicks woman) ఆమెను ఒక్క తన్ను తన్నింది. దెబ్బకు ఆమె దూరంగా ఎగిరిపడింది. అయితే ఈ ప్రమాదంలో ఆమె.. అదృష్టం బాగుండి స్వల్ప గాయాలతో బయటపడినట్లు తెలుస్తోంది. జిరాఫీ విచిత్ర ప్రవర్తనకు ఆమెతో పాటూ చుట్టూ ఉన్న వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు.
Viral video: ఇలాక్కూడా రైలు దిగుతారా.. ఈ మహిళ చేసిన పనికి అవాక్కవుతున్న నెటిజన్లు..
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘అరే.. ఇదేంటీ.. ! జిరాఫీ ఇలా చేసిందీ’’.. అంటూ కొందరు, ‘‘జిరాఫీలతో కూడా జాగ్రత్తగా ఉండాలన్నమాట’’.. అంటూ మరికొందరు, ‘‘ఈ జిరాఫీకి మహిళలంటే నచ్చదేమో’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 5 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Viral video: సిమెంట్ మూటను ఇలా ఎవరైనా ఎత్తగలరా.. ఇతడి టాలెంట్ మామూలుగా లేదుగా..