Viral: 2 ఏళ్ల బాలికను ఆహారంగా భావించిన జిరాఫ్.. చివరకు.. షాకింగ్ వీడియో
ABN , Publish Date - Jun 06 , 2024 | 10:03 PM
వనారణ్యాల్లో సఫారీలు అద్భుత అనుభవాన్ని ఇస్తాయి. ప్రకృతిలో జంతువులను అతి దగ్గర నుంచి చూసే అవకాశాన్ని కల్పిస్తాయి. కానీ, సఫారీల్లో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఒక్కోసారి ఊహించని ప్రమాదాలు ఎదురవుతాయి. తాజాగా రెండేళ్ల బాలిక విషయంలో ఇదే జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
ఇంటర్నెట్ డెస్క్: వనారణ్యాల్లో సఫారీలు అద్భుత అనుభవాన్ని ఇస్తాయి. ప్రకృతిలో జంతువులను అతి దగ్గర నుంచి చూసే అవకాశాన్ని కల్పిస్తాయి. కానీ, సఫారీల్లో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఒక్కోసారి ఊహించని ప్రమాదాలు ఎదురవుతాయి. తాజాగా రెండేళ్ల బాలిక విషయంలో ఇదే జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా (Viral) మారింది. ఈ వీడియోను చూసి జనాలు షాకైపోతున్నారు. అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో ఈ ఘటన వెలుగు చూసింది.
వీడియోలో కనిపించిన దాని ప్రకారం, కారులో ఉన్న బాలిక జిరాఫ్‌కు ఆహారం అందించే ప్రయత్నం చేసింది. బాలికను కూడా జిరాఫ్ ఆహారంగా భావించిందో ఏమో తెలీదు కానీ.. అది చిన్నారి షర్టును నోట కరిచి పైకి ఎత్తింది. అదృష్టవశాత్తూ బాలిక కిందకు జారి కారులో పడిపోయింది. దీంతో, పెను ప్రమాదం తప్పింది (Giraffe Picks Up Toddler Trying to Feed it Fossil Rim Wildlife Centre in Texas).
Viral: మృతదేహం నుంచి వీర్యకణాల సేకరణ! భర్త పోయాక 15 నెలలకు బిడ్డను కన్న మహిళ
వీడియోలో ఇదంతా చూసిన జనాలు హాహాకారాలు చేస్తున్నారు. ఇలాంటి ప్రమాదం ముందెన్నడూ చూడలేదని కామెంట్స్ చేస్తున్నారు. సఫారీలపై వెళ్లేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని పలువురు సూచించారు. అడవి జంతువులు.. ముఖ్యంగా భారీ జంతువుల జోలికి వెళ్లకుండా ఉండటమే మంచిదని చెబుతున్నారు. చిన్న పిల్లలతో కలిసి ఇలాంటి ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య వీడియో తెగ వైరల్ అవుతోంది.