Share News

Viral: ‘పుష్ప-2’ చూద్దామంటే ఒప్పుకోని బాయ్‌ఫ్రెండ్! యువతి ఆత్మహత్యాయత్నం

ABN , Publish Date - Dec 21 , 2024 | 08:49 PM

పుష్ప- 2 సినిమా చూద్దామంటే బాయ్‌ఫ్రెండ్ వద్దనడంతో ఓ యువతి ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో తాజాగా వెలుగు చూసింది.

Viral: ‘పుష్ప-2’ చూద్దామంటే ఒప్పుకోని బాయ్‌ఫ్రెండ్! యువతి ఆత్మహత్యాయత్నం

ఇంటర్నెట్ డెస్క్: పుష్ప- 2 సినిమా చూద్దామంటే బాయ్‌ఫ్రెండ్ వద్దనడంతో ఓ యువతి ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో తాజాగా వెలుగు చూసింది. స్థానిక మీడియా కథనాల ప్రకారం, ఝార్ఖండ్‌లోని ధన్‌బాద్‌కు చెందిన ఆ జంట యూపీకి పర్యటనపై వచ్చారు. స్థానికంగా ఉన్న ఓ హోటల్‌లో దిగారు. ఈ క్రమంలోనే యువతి పుష్ప - 2 సినిమాకు వెళదామంది. అతడేమో ఆమె ప్రతిపాదన తిరస్కరించారు (Viral).

Viral: పార్లమెంటులో పొగతాగిన మహిళా ఎంపీ.. షాకింగ్ వీడియో వైరల్


దీంతో, ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చెలరేగింది. తీవ్ర అసహనానికి లోనైన యువతి తాము ఉంటున్న హోటల్ మూడో అంతస్తు నుంచి కిందకు దూకేశారు. తీవ్రంగా గాయపడిన ఆమెను స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం విషమంగా ఉన్నట్టు తెలిసింది. ఈ ఘటనకు సంబంధించి యువతి బాయ్‌ఫ్రెండ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అసలేం జరిగిందో తెలుసుకునేందుకు దర్యాప్తు ప్రారంభించారు.

Viral: రైలు కిటికీ అద్దాలు పగలగొట్టిన ప్యాసెంజర్లు.. షాకింగ్ దృశ్యాలు వైరల్!


‘‘ఛెట్‌గంజ్‌లోని హోటల్‌లో బుధవారం ఈ ఘటన జరిగింది. వారిద్దరూ హోటల్‌లో దిగారు. ఈ క్రమంలోనే యువతి మూడో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు ప్రయత్నించింది’’ పోలీసులు ప్రయత్నించారు. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా సంచలనంగా దారి తీసింది.

Viral: ప్రియురాలి ఎఫైర్‌తో మనోవేదన! బాధితుడికి రూ.35 లక్షల పరిహారం!

Read Latest and Viral News

Updated Date - Dec 21 , 2024 | 08:49 PM