Share News

Viral: దొంగలున్నారో లేదో తెలుసుకునేందుకు యువతి ప్రయోగం.. షాకింగ్ వీడియో!

ABN , Publish Date - Dec 05 , 2024 | 11:28 AM

పట్టపగలు దొంగతనాలు జరిగిపోతున్న రోజులు ఇవి. బైక్‌లపై వస్తున్న దొంగలు మహిళల మెడలో నగలను చోరీ చేసి పారిపోతున్నారు. నగలు ధరించే బయటకు వెళ్లాలంటేనే భయపడిపోయే పరిస్థితులు సృష్టిస్తు్న్నారు. ఇలాంటి పరిస్థితిలో ఓ యువతి చేసిన వింత ప్రయోగం వైరల్‌గా మారింది.

Viral: దొంగలున్నారో లేదో తెలుసుకునేందుకు యువతి ప్రయోగం.. షాకింగ్ వీడియో!

ఇంటర్నెట్ డెస్క్: పట్టపగలు దొంగతనాలు జరిగిపోతున్న రోజులు ఇవి. బైక్‌లపై వస్తున్న దొంగలు మహిళల మెడలో నగలను చోరీ చేసి పారిపోతున్నారు. నగలు ధరించి బయటకు వెళ్లాలంటేనే భయపడిపోయే పరిస్థితులు సృష్టిస్తున్నారు. ఇలాంటి పరిస్థితిలో ఓ యువతి చేసిన వింత ప్రయోగం వైరల్‌గా (Viral) మారింది. ఆమె చేసిన ప్రయోగం చూసి కొందరు ఆశ్చర్యపోతుంటే.. తమ దేశంలో మాత్రం ఇలాంటిది చేయొద్దని కొందరు సరదాగా సెటైర్లు పేల్చారు.

పూర్తి వివరాల్లోకి వెళితే, దుబాయ్‌లో ఓ యువతి ఈ వింత ప్రయోగం చేసింది. అక్కడి భద్రత, ప్రజల మానప్రాణాలు, ఆస్తిపాస్తులకు రక్షణ ఏమేరకు ఉందో తెలుసుకునేందుకు ఎవ్వరూ కలలో కూడా ఊహించలేని పరీక్షకు సిద్ధమైంది.

Viral: బిస్కెట్లల్లో రంధ్రాలు ఎందుకుంటాయో తెలుసా?


పరీక్ష కోసం యువతి తన వద్ద ఉన్న లక్షల విలువైన బంగారు నగలను ఎరగా వేసింది. ఇందుకోసం ఆమె.. రద్దీ రోడ్డుపై నిలిపి ఉంచిన కారు బానెట్‌పై బంగారు నగలను పెట్టింది. ఆ తరువాత దూరంగా నిలబడి కెమెరాతో అంతా సీక్రెట్‌గా అరగంట పాటు రికార్డు చేసింది.

వీడియోలో కనిపించిన దాని ప్రకారం, కారు బానెట్‌పై బంగారు నగలను అనేక మంది గమనించినా ఒక్కరు కూడా దాన్ని తాకే సాహసం చేయలేదు. దానిపై ఓ లుక్కేసి తమకేమీ సంబంధం లేదనట్టు వెళ్లిపోయారు. ఓ యువతి మాత్రం ఓ అడుగుముందుకేసి బానెట్ నుంచి కింద పడ్డ నగను తీసి మళ్లీ యథాస్థానంలో పెట్టి తన దారిన తాను వెళ్లిపోయింది.

Anand Mahindra: దటీజ్ ఆనంద్ మహీంద్రా! చెడామడా విమర్శించిన నెటిజన్‌కు స్వీట్ సర్‌ప్రైజ్


బంగారు నగలు అక్కడే పెట్టి ఉన్నా ఒక్కరూ తీసుకునేందుకు ప్రయత్నించకపోవడంతో యువతి షాకైపోయింది. దుబాయ్‌కు మించిన భద్రమైన నగరం ఉంటుందా? అస్సలు నమ్మశక్యంగా లేదే! అంటూ ఆశ్చర్యపోయింది.

ఇక ఈ వీడియోకు రెస్పాన్స్ కూడా ఓ రేంజ్‌లో వచ్చింది. ఆమె ప్రయోగంలో క్రియేటివిటీకి కొందరు ఆశ్చర్యపోయారు. నగర భద్రతను అంచనా వేసేందుకు పెద్ద రిస్కే చేసిందని కొందరు కామెంట్ చేశారు. తమ దేశంలో ఇలాంటి ప్రయోగాలు చేయొద్దని కొందరు సెటైర్లు పేల్చారు. కాదని ప్రయత్నిస్తే.. బంగారు నగలతో పాటు కారు కూడా కళ్లుమూసి తెరిచే లోపు మాయమైపోతుందని హెచ్చరించారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ ఉదంతం ప్రస్తుతం చర్చనీయాంశం అవుతోంది.

Tattoo: తొలిసారి టాటూ వేయించుకుంటున్నారా?ఈ విషయాల గురించి ఆలోచించారా?

Read Latest and Viral News

Updated Date - Dec 05 , 2024 | 11:35 AM