Share News

Google Employee: అది గూగుల్ ఆఫీసా? ఖరీదైన రెస్టారెంటా?.. మధ్యాహ్నం లంచ్ ఎలా ఉంటుందో చూపించిన ఉద్యోగి!

ABN , Publish Date - Aug 04 , 2024 | 08:56 PM

ఇంటర్నెట్ వాడే వారికి గూగుల్‌ను ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. గూగుల్ అందించే ఏదో ఒక సర్వీస్ వాడుతూనే ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాల్లో సేవలందిస్తున్న గూగుల్ సంస్థలో ఉద్యోగం సంపాదించడం అంత సులభం కాదు.

Google Employee: అది గూగుల్ ఆఫీసా? ఖరీదైన రెస్టారెంటా?.. మధ్యాహ్నం లంచ్ ఎలా ఉంటుందో చూపించిన ఉద్యోగి!
Lunch in Google Office

ఇంటర్నెట్ వాడే వారికి గూగుల్‌ను (Google) ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. గూగుల్ అందించే ఏదో ఒక సర్వీస్ వాడుతూనే ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాల్లో సేవలందిస్తున్న గూగుల్ సంస్థలో ఉద్యోగం (Google Job) సంపాదించడం అంత సులభం కాదు. భారీ జీతాలతో పాటు సకల సౌకర్యాలు అమర్చే గూగుల్ సంస్థలో ఉద్యోగం సంపాదించడం చాలా మంది సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ల కల. గూగుల్ సంస్థలో ఉద్యోగం సంపాదించిన ఓ యువతి (Google employee) తమ ఆఫీస్‌లో లంచ్ ఎలా ఉంటుందో వివరిస్తూ ఓ వీడియో రూపొందించింది (Viral Video).


ఆ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో పోస్ట్ చేసింది. ఆ యువతి పేరు పర్లీన్ రణ్‌హోత్రా. ఆమె తన మధ్యాహ్నం లంచ్‌కు సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఎన్నో రకాల డిషెస్ అందుబాటులో ఉన్నాయి. వెర్మిసెల్లీ నూడిల్స్, పరాఠా, మటన్ షామి కబాబ్స్ మరెన్నో వెరైటీలు అందుబాటులో ఉన్నాయి. ఖరీదైన రెస్టారెంట్‌లో ఉన్నట్టు ఎన్నో రకాల ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలు వరుసగా ఉన్నాయి. అక్కడి ఉద్యోగులు ఎవరికి నచ్చిన వాటిని వారు వడ్డించుకుని తింటున్నారు. లంచ్ తర్వాత డిజెర్ట్ కూడా అందుబాటులో ఉంది (Lunch in Google).


ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మిలియన్ కంటే ఎక్కువ మంది ఈ వీడియోను వీక్షించారు. 1.6 లక్షల మంది ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేశారు. ``గూగుల్.. నేను ఇంటర్వ్యూ ఇవ్వడానికి రెడీ``, ``అది ఆఫీసా? రెస్టారెంటా?``, ``సిక్ లీవ్ లేకుండా ఉండడం కోసం ఆరోగ్యకర ఆహారం``, ``ఇంటికి ప్యాక్ చేసి తెచ్చుకోవచ్చా`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Viral: స్టూడెంట్ ఇలా రాస్తే టీచర్ మాత్రం ఏం చేస్తుంది.. మార్కులు వేయకుండా ఉంటుందా? వైరల్ అవుతున్న ఆన్సర్ షీట్!


Viral Video: అర్జెంట్ అని వెళితే స్మార్ట్ టాయిలెట్ ఎంత పని చేసిందో చూడండి.. వీడియో చూస్తే నవ్వకుండా ఉండలేరు..!


Viral: తులం బంగారం ధర 1959లో ఎంతో తెలుసా? విపరీతంగా వైరల్ అవుతున్న పాత గోల్డ్ బిల్..!

Viral Video: ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. ఆ బాలుడి సరదా ఓ మహిళ ప్రాణాలను ఎలా తీసిందో చూడండి..!


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 04 , 2024 | 08:56 PM