Viral: స్టూడెంట్ ఇలా రాస్తే టీచర్ మాత్రం ఏం చేస్తుంది.. మార్కులు వేయకుండా ఉంటుందా? వైరల్ అవుతున్న ఆన్సర్ షీట్!
ABN , Publish Date - Aug 04 , 2024 | 05:13 PM
సోషల్ మీడియాలో ఎప్పుడు ఏదో వైరల్ అవుతుందో చెప్పడం కష్టం. ఆసక్తికరమైన వీడియోలు, ఫన్నీ పోస్ట్‌లు జనాల్ని ఆకట్టుకుని వైరల్ అవుతుంటాయి. పరీక్షల్లో విద్యార్థులు రాసిన ఫన్నీ ఆన్సర్లు కూడా ఇటీవలి కాలంలో నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి.
సోషల్ మీడియాలో ఎప్పుడు ఏదో వైరల్ అవుతుందో చెప్పడం కష్టం. ఆసక్తికరమైన వీడియోలు, ఫన్నీ పోస్ట్‌లు జనాల్ని ఆకట్టుకుని వైరల్ అవుతుంటాయి. పరీక్షల్లో విద్యార్థులు (Student) రాసిన ఫన్నీ ఆన్సర్లు కూడా ఇటీవలి కాలంలో నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. ప్రస్తుతం అలాంటిదే ఓ జవాబు పత్రం (Answer Sheet) సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ జవాబు పత్రం వైరల్ కావడానికి కారణం ఉపాధ్యాయురాలి (Teacher) గురించి ఓ విద్యార్థి రాసిన వ్యాసమే. దానిని చూసి చాలా మంది నవ్వుకుంటున్నారు. (Viral News)
@Rajputbhumi అనే టీచర్ ఈ ఆన్సర్ షీట్‌ను తన ట్విటర్ ఖాతాలో షేర్ చేసింది. అభిమాన టీచర్ గురించి రాయాలని ఆరో తరగతి ప్రశ్నా పత్రంలో అడిగారు. దానికి ఓ విద్యార్థి చాలా చక్కగా సమాధానం రాశాడు. ``మాకు టీచర్లందరూ ఇష్టమే. కానీ చాలా మంచి విషయాలు నేర్పించే, చాలా ప్రేమగా ఉండే భూమిక మేడమ్ అంటే ఇంకా ఎక్కువ ఇష్టం. భూమిక మేడమ్‌లా టీచర్లందరూ ఉంటే పిల్లలు శ్రద్ధగా చదువుకుంటారు. ఐ లవ్ యు భూమి మేడమ్`` అంటూ ఆ విద్యార్థి తన టీచర్‌ను పొగుడుతూ రాశాడు.
ఆ జవాబు పత్రాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసిన భూమిక టీచర్.. ``నా మనస్సును ఎప్పుడు బాగా లేకపోయినా ఇది చదువుతాను`` అని రాశారు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 1.5 లక్షల మంది వీక్షించారు. ఈ పోస్ట్‌పై నెటిజన్లు ఫన్నీగా స్పందించారు. ``మంచి మార్కులు పొందడానికి ఇది సరైన మార్గం ``, ``ఆ కుర్రాడు చాలా తెలివైన వాడు``, ``పిల్లలు ఎవరినైనా నిజాయితీగా ప్రేమిస్తారు`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
Viral: తులం బంగారం ధర 1959లో ఎంతో తెలుసా? విపరీతంగా వైరల్ అవుతున్న పాత గోల్డ్ బిల్..!
Viral Video: ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. ఆ బాలుడి సరదా ఓ మహిళ ప్రాణాలను ఎలా తీసిందో చూడండి..!
Viral Video: తమ్ముడూ.. ఇలా అయితే వధువు పారిపోతుందేమో.. పెళ్లిలో వరుడి తుఫాన్ డ్యాన్స్ చూడండి..!
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి