Viral News: గూగుల్‌ని నమ్మిన్రు.. వరదలో మునిగిన్రు.. ఆ తరువాత ఏమైందంటే?
ABN , Publish Date - May 25 , 2024 | 03:17 PM
ఎన్నో విధాలుగా ఉపయోగపడుతున్న గూగుల్ మ్యాప్స్(Google Maps) ఒక్కో సారి కొంప ముంచుతున్నాయి. నేవిగేషన్ తప్పుగా చూపిస్తుండటంతో చాలా మంది దారులు అయోమయమై నదీ జలాల్లోకి వెళ్లిన ఘటనలు చూశాం. తాజాగా ఇలాంటి ఘటనే కేరళలో జరిగింది.
కొట్టాయం: ఎన్నో విధాలుగా ఉపయోగపడుతున్న గూగుల్ మ్యాప్స్(Google Maps) ఒక్కో సారి కొంప ముంచుతున్నాయి. నేవిగేషన్ తప్పుగా చూపిస్తుండటంతో చాలా మంది దారులు అయోమయమై నదీ జలాల్లోకి వెళ్లిన ఘటనలు చూశాం. తాజాగా ఇలాంటి ఘటనే కేరళలో జరిగింది. హైదరాబాద్‌కి చెందిన ఓ బృందం ఓ మహిళ సహా నలుగురితో కలిసి కారులో కేరళ పర్యటనకు వెళ్లారు.
డ్రైవర్ గూగుల్ మ్యాప్స్ అనుసరిస్తూ అలప్పుజ వైపు వెళ్తున్నాడు. అప్పటికే భారీ వర్షాలతో జలకళను సంతరించుకున్న ఓ నీటి ప్రవాహంలోకి గూగుల్ మ్యాప్ చూపించింది. ఎదురుగా ప్రవాహం ఉందనే విషయాన్ని గుర్తించని డ్రైవర్ అందులోకి దూసుకెళ్లాడు. ఏం జరిగిందో తెలుసుకునేలోపే కారు వరదలో చిక్కుకుంది. ప్రాణాపాయంతో కారుపైకి ఎక్కి ప్రయాణికులు అరవసాగారు.
స్థానికులు వారిని గుర్తించి పోలీసులకు సమాచారం చేరవేశారు. ఎలాగోలా వారిని బయటకి తీయడంతో ప్రాణాపాయం తప్పింది. కారును బయటకి తీసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. కేరళలో ఇలాంటి ఘటన జరగడం ఇదే తొలిసారి కాదు. 2023 అక్టోబర్‌లో ఇద్దరు డాక్టర్లు గూగుల్ మ్యాప్స్‌ని అనుసరించి నదిలో పడిపోయారు. దీంతో గూగుల్ మ్యా్ప్స్ ఉపయోగించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
For Latest News and Technology News