Viral: ఫిల్టర్ నీటితో స్నానం జుట్టు రాలడాన్ని తగ్గిస్తుందా..?
ABN , Publish Date - Aug 19 , 2024 | 03:34 PM
ఆర్‌ఓ ఫిల్టర్ వాటర్‌తో స్నానం చేశాక జుట్టు రాలడం తగ్గిపోయిందన్న ఓ బెంగళూరు మహిళా టెకీ పోస్టు నెట్టింట చర్చనీయాంశంగా మారింది. బెంగళూరు మున్సిపల్ నీరు కఠిన జలమని, దాని వల్ల జుట్టు బాగా ఊగిపోయేదని అమిశా అగర్వాల్ అనే టెకీ నెట్టింట ఈ పోస్టు పెట్టారు.
ఇంటర్నెట్ డెస్క్: ఆర్‌ఓ ఫిల్టర్ వాటర్‌తో స్నానం చేశాక జుట్టు రాలడం తగ్గిపోయిందన్న ఓ బెంగళూరు మహిళా టెకీ పోస్టు నెట్టింట చర్చనీయాంశంగా (Viral) మారింది. బెంగళూరు మున్సిపల్ నీరు కఠిన జలమని, దాని వల్ల జుట్టు బాగా ఊగిపోయేదని అమిశా అగర్వాల్ అనే టెకీ నెట్టింట ఈ పోస్టు పెట్టారు.
తాను గూగుల్‌లో పనిచేస్తున్నట్టు చెప్పుకొచ్చిన ఆమె బెంగళూరు మున్సిపల్ నీరు కారణంగా ఇబ్బందులు ఎదుర్కొన్నానని చెప్పుకొచ్చారు. ‘‘చివరకు ఆర్వో ఫిల్టర్ వాటర్‌తో తలస్నానం చేయడం మొదలెట్టడంతో జుట్టు రాలడం తగ్గిపోయింది. ఇలా చేసి ఉండకపోతే జుట్టు మొత్తం రాలిపోయి ఉండేది’’ అని ఆమె పోస్టు పెట్టింది. ఇలాంటి అనుభవాలు మిగతా వారికి ఎదురై ఉంటే తనకు షేర్ చేయాలని కూడా అభ్యర్థించింది (Google Techie In Bengaluru Opens Up About Hair Loss Struggles Due To Hard Water).
Viral: షాకింగ్.. మూడో అంతస్తులోని ఏసీ నెత్తిపై పడి యువకుడి దుర్మరణం!
ఈ పోస్టుకు నెట్టింట పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. బెంగళూరు నీటిలో కరిగి ఉన్న లవణాల శాతం160 నుంచి 170 వరకూ ఉంటుందని ఓ నెటిజన్ అభిప్రాయపడ్డాడు. తానూ ఇదే పరిస్థితి ఎదుర్కొన్నట్టు చెప్పుకొచ్చాడు. బెంగళూరుకు వచ్చాన తన జుట్టు దాదాపు 50 శాతం ఊడిపోయిందన్నాడు.
కాగా, ఢిల్లీ, ముంబై, బెంగళూరు నగరాల్లో ఇలాంటి పరిస్థితులే ఎదురవుతాయని కొందరు చెప్పుకొచ్చారు. ముంబైలో తనకు ఈ ఇబ్బంది ఎదురుకాలేదని ఓ వ్యక్తి చెప్పుకొచ్చాడు. తాను హైదరాబాద్‌లో ఉండగా మినరల్ వాటర్‌తోనే తలస్నానం చేసినట్టు వివరించాడు. తన భార్య బాత్రూమ్‌లో ఏకంగా వాటర్ ప్యూరిఫయ్యర్ ఇన్‌స్టాల్ చేసిందని ఓ వ్యక్తి చెప్పుకొచ్చాడు. మంచి సీటీసీతో ప్యాకేజీ కావాలంటే బట్టతలకు సిద్ధపడాల్సిందేనని మరో వ్యక్తి సరదా కామెంట్ చేశారు.
కొందరు మాత్రం ఈ వాదనతో విభేధించారు. తాను చాలా ఏళ్లుగా కావేరీ వాటర్‌నే వాడుతున్నానని ఓ ఆల్ట్ న్యూస్ సహవ్యవస్థాపకుడు చెప్పుకొచ్చాడు. కానీ, తన జుట్టు మాత్రం నిక్షేపంగా ఉందని అన్నారు. దీనిపై స్పందించిన అమిషా అగర్వాల్.. తాను ఇంకా బెంగళూరు నీటికి అలవాటు పడి ఉండకపోవచ్చని అన్నారు. అసలు ఫిల్టర్ వాటర్ జుట్టు రాలడాన్ని అరికడుతుందా? అని సందేహం వ్యక్తం చేశారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ ట్వీట్ పెద్ద చర్చనీయాంశమవుతోంది.