Viral: బామ్మ కండలు చూసి మనవడికి షాక్.. నెటిజన్ల మతి పోగొడుతున్న వీడియో
ABN , Publish Date - Jul 22 , 2024 | 04:34 PM
మనవడితో సమానంగా ఓ బామ్మ తన దేహదారుఢ్యాన్ని ప్రదర్శించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. జనాలు షాకయ్యేలా చేస్తోంది. వీడియోకు ఇప్పటివరకూ కోటికి పైగా వ్యూస్ వచ్చాయి.
ఇంటర్నెట్ డెస్క్: ఈ కాలంలో యువతను వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో ఊబకాయం ఒకటి. దీని ఫలితంగా చిన్న వయసులోనే దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతున్న యువతలో 40 ఏళ్లకే వృద్ధాప్య ఛాయలు వచ్చి పడుతున్నాయి. కానీ ఇటీవల ఓ వృద్ధురాలు మనవడితో సమానంగా కండలు ప్రదర్శించిన వైనం నెట్టింట వైరల్‌గా (Viral) మారింది. ఈ బామ్మ రేంజే వేరంటూ జనాలు ప్రశంసిస్తూనే నోరెళ్లబెట్టాల్సిన పరిస్థితి కల్పించింది.
Viral: ఇదేం టాలెంట్రా బాబూ.. తన కటింగ్ తానే చేసుకున్న యువకుడు!
ఘటన ఎక్కడ జరిగిందీ తెలీయకపోయినా వీడియో మాత్రం నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. వీడియోలో కనిపించిన దాని ప్రకారం, తొలుత ఓ యువకుడు తన కండలు ప్రదర్శిస్తాడు. జిమ్ బాడీ ఇదేనంటూ బిల్డప్ ఇస్తాడు. అప్పటి వరకూ అక్కడే ఉన్న బామ్మ స్వయంగా రంగంలోకి దిగింది. మనవడికి తానేమీ తీసుపోను అన్నట్టుగా తన దేహదారుఢ్యాన్ని ప్రదర్శించింది. బామ్మను చూసి షాకైపోవడం యువకుడి వంతైంది (Grandmas toned biceps leaves netizens astounded watch viral video).
ఇక వీడియో చూసిన జనాలు కూడా బామ్మ ఫిట్నెస్ చూసి ఆశ్చర్యపోతున్నారు. పండు ముసలి వయసులోనూ ఇంత ఫిట్‌గా ఉందంటే నమ్మశక్యం కావట్లేదని కామెంట్ చేశారు. నిత్యం జిమ్‌కు వెళ్లే మనవడు కూడా బామ్మ ముందు దిగదుడుపేనని కొందరు అన్నారు. బామ్మ టాలెంట్ చూసి మనవడి మతి పోయి ఉంటుందని అన్నారు. బామ్మ కూడా జిమ్‌కు వెళుతోందేమోనని కొందరు సందేహం వ్యక్తం చేశారు. ఇదంతా సంప్రదాయిక భారతీయ ఆహారం తిన్న ఫలితమని కొందరు అభిప్రాయపడ్డారు. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటే ఇదేనని మరికొందరు చమత్కరించారు. ఇలా రకరకాల కామెంట్స మధ్య వీడియోకు ఏకంగా కోటికి పైగా వ్యూస్ వచ్చాయి. మరి మీరూ ఓ లుక్కేయండి.