Viral Video: దేవుడా.. ఈ వంటకం ఏంటో తెలిస్తే కంట్లో నీళ్లు తిరగాల్సిందే.. అవాక్కవుతున్న నెటిజన్లు!
ABN , Publish Date - May 22 , 2024 | 03:44 PM
మీరు రకరకాల హల్వాలు తిని ఉంటారు.. మాడుగుల హల్వా నుంచి క్యారెట్ హల్వా, సొరకాయ హల్వా వరకు అన్నింటినీ లొట్టలేసుకుంటూ తిని ఉంటారు. ఏ హల్వా అయినా ఎంతో తియ్యగా నోరూరించే రుచితో ఉంటుంది. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలోని ఓ హల్వా తినాలంటే మాత్రం చెంబుడు నీళ్లను పక్కన ఉంచుకోవాల్సిందే.
మీరు రకరకాల హల్వాలు (Halwa) తిని ఉంటారు.. మాడుగుల హల్వా నుంచి క్యారెట్ హల్వా, సొరకాయ హల్వా వరకు అన్నింటినీ లొట్టలేసుకుంటూ తిని ఉంటారు. ఏ హల్వా అయినా ఎంతో తియ్యగా నోరూరించే రుచితో ఉంటుంది. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలోని ఓ హల్వా తినాలంటే మాత్రం చెంబుడు నీళ్లను పక్కన ఉంచుకోవాల్సిందే. ఎందుకంటే ఆ హల్వా చాలా కారంగా ఉంటుంది. దానిని పచ్చిమిర్చితో (Green chilli halwa) తయారు చేయడానికి అందుకు కారణం (Viral Video).
indian_street_food అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో పచ్చి మిర్చి వీడియోను తయారు చేస్తున్నారు. ముందుగా పచ్చిమిరపకాయలను సన్నగా తరిగారు. ఆ మిరపకాయలను గ్రైండ్ చేశారు. ఆ తరువాత దానికి పంచదార, ఆకుపచ్చ రంగు, పాలు, కొబ్బరి నీరు కలిపారు. ఆ తరువాత చాలా సేపు దానిని మంట పెట్టి వేడి చేశారు. కొంతసేపటికి హల్వా తయారైంది. దానిని ముక్కలు ముక్కలుగా కోసి బర్ఫీ ఆకారానికి తీసుకువచ్చారు. ఈ గ్రీన్ మిర్చీ హల్వాను కాలికట్‌లో అమ్ముతున్నారు.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోకు లక్షల్లో వ్యూస్ వచ్చాయి. ఎంతో మంది ఆ వీడియోను వీక్షించి తమ స్పందనలను తెలియజేశారు. ``వామ్మో.. ఇది కేన్సర్ హల్వా``, ``ఇలాంటి వాళ్లను దేవుడు శిక్షిస్తాడు``, ``ఈ హల్వా కంటే గుమ్మడికాయ పాయసం బెటర్``, ``ఈ హల్వా రుచి ఏంటి`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
Viral Video: ముళ్ల పందిని పట్టుకోబోయి గాయపడిన చిరుత.. తర్వాతేం జరిగిందో చూస్తే షాకవ్వాల్సిందే..!
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..