Share News

Viral: మార్స్‌పై మనిషి సెటిలైతే జరిగేది ఇదే.. అమెరికా శాస్త్రవేత్త హెచ్చరిక

ABN , Publish Date - Sep 29 , 2024 | 09:16 PM

అంగారకుడిపై జీవించే వారు బలహీనంగా మారతారని, వారి చర్మం ఆకు పచ్చరంగులోకి వస్తుందని ఓ శాస్త్రవేత్త తాజాగా హెచ్చరించారు. వారికి దూరపు చూపు కూడా తగ్గిపోతుందని వార్నింగ్ ఇచ్చారు. అంతా ఊహిస్తున్నట్టు అక్కడ అంత సౌకర్యవంతమైన జీవితం ఉందని కుండబద్దలు కొట్టారు.

Viral: మార్స్‌పై మనిషి సెటిలైతే జరిగేది ఇదే.. అమెరికా శాస్త్రవేత్త హెచ్చరిక

ఇంటర్నెట్ డెస్క్: సృష్టి రహస్యాలను కనుగొనేందుకు ఉత్సాహపడే మానవుడు ఈ దిశగా అంతరిక్ష యాత్రలు కూడా చేస్తున్నాడు. ప్రస్తుతం మానవాళి లక్ష్యం అంగారకుడు. అక్కడ శాశ్వత స్థావరాలు ఏర్పాటు చేయాలని, వాటి సాయంతో సౌర కుటుంబం అంచుల వరకూ వెళ్లి సృష్టి రహస్యాలు తెలుసుకోవాలేది ప్లాన్. మస్క్ వంటి వ్యాపారవేత్తలు ఇప్పటికే ఈ దిశగా అడుగులు వేయడం కూడా ప్రారంభించారు. అయితే, ఇదంతా అనుకున్నంత సులువు కాదని ఓ శాస్త్రవేత్త హెచ్చరిస్తున్నారు. అంగారకుడిపై సెటిలయ్యే మానవులు అనేక అవస్థల పాలవుతారని, గుర్తుపట్టలేనంతా మారిపోతారని హెచ్చరిస్తున్నారు (Viral).

Viral: స్వీయ వివాహం చేసుకున్న ఇన్‌ఫ్లుయెన్సర్ ఆత్మహత్య!

మార్స్‌ ప్రభావం మనుషులపై ఎలా ఉంటుందో డా స్కాట్ సాలమన్ తన పుస్తకంలో కళ్లకు కట్టినట్టు వివరించారు. ఆయన టెక్సాస్ యూనివర్సిటీలో బయాలజీ శాస్త్రవేత్త. మార్స్‌పై జీవితం గురించి ఆయన ఫ్యూచర్ హుమన్స్ అనే పుస్తకం రాశారు. మార్స్‌లో కఠిన పరిస్థితులు ఉంటాయని ఆయన వాదించారు. అక్కడ సౌకర్యవంతమైన జీవితం ఉండదని చెప్పుకొచ్చారు. బతికేందుకే నానా కష్టాలు పడాల్సి వస్తుందని చెప్పారు.

Viral: డబ్బున్నోళ్లంటే భారతీయులకు అందుకే ద్వేషం! ప్రముఖ సంస్థ సీఈఓ వ్యాఖ్య


మార్స్‌లో సెటిలైన, అక్కడే పిల్లల్ని కంటే వారి సంతానం అనేక లోపాలతో జన్మిస్తుందని ఆయన హెచ్చరించారు. అక్కడి వాతావరణానికి అనుగూణంగా పిల్లల్లో జన్యుమార్పులు చోటుచేసుంటాయని అన్నారు. మార్స్‌పై తక్కువ గురుత్వాకర్షణ శక్తి ఉంటుందని, ఫలితంగా అక్కడి పిల్లల ఎముకలు బలహీనంగా ఉంటాయని అన్నారు. కండరాలు శక్తి కూడా తక్కువగా ఉంటుందని చెప్పారు.

ఏంటీ.. అంత సంపాదిస్తున్నా సరిపోట్లేదా! కెనడా ఎన్నారైపై జనాల విసుర్లు!

మార్స్‌ గ్రహం చుట్టూ భూమికి ఉన్నట్టు విద్యుదయస్కాంత వలయం, ఓజోన్ పొర ఉండదని అన్నారు. ఫలితంగా అక్కడ నివసించే వారు ప్రమాదకర రేడియో ధార్మిక తరంగాలు గురయ్యే అవకాశం ఉందని, ఇది పలు జన్యుపరమైన మార్పులకు దారి తీస్తుందని చెప్పారు. దీంతో అక్కడి వారి చర్మం ఆకుపచ్చరంగులో మారిపోతుందట. పిల్లల ఎముకలు కూడా పెళుసుగా ఉంటాయని, కండరాలు దారుఢ్యంతో తగ్గి భూమ్మీదున్న వారితో పోలిస్తే బలహీనంగా తయారవుతారట.

లైఫ్ ఎలా ఎంజాయ్ చేయాలో ఈమెను చూసి నేర్చుకోవాలి! వీడియో వైరల్!


ఇక అక్కడ నివసించే మహిళల్లో కూడా ఎముకలు బలహీనంగా మారి ప్రసవ సమయంలో తుంటె ఎముకలు విరిగే ప్రమాదం పెరుగుతుందని హెచ్చరించారు. బయటి వాతావరణం లేక వెళ్లలేక అనేక మంది ఇళ్లల్లోనే గడుపుతుంటారని, ఫలితంగా వారి దూరపు చూపు తగ్గిపోతుందని కూడా చెప్పారు.

ఆఫీసులో అలసిపోయి వచ్చిన భార్య కోసం వంట వండని భర్త! చివరకు..

అంతరిక్షంలో అగ్రగామి సంస్థ నాసా ఇప్పటికే మార్స్‌ వైపు మానవరహిత వ్యోమనౌకల్ని పంపింది. అయితే, 2030 కల్లా అంగాకరకుడిపై మనిషిని దింపాలని లక్ష్యంగా పెట్టుకుంది. అంతేకాదు.. వచ్చే 30 ఏళ్లల్లో మార్స్‌పై తొలి మానవ నగరం ఏర్పాటైనా ఆశ్చర్యపోనక్కర్లేదని టెక్ ఆంత్రప్రెన్యూర్ జోస్యం చెప్పారు. ఆ నేపథ్యంలో డా. సోలమన్ రచించిన పుస్తకం శాస్త్రవేత్తలతో పాటు సామాన్యుల్లో కూడా ఆసక్తి రేకెత్తిస్తోంది.

వామ్మో! పెళ్లికొచ్చిన అతిథుల నుంచి వధూవరులు రూ.2 లక్షలు చొప్పున వసూల్!

Read Latest and Viral News

Updated Date - Sep 29 , 2024 | 09:18 PM