Share News

Viral: వధువుకు షాక్! రొట్టెలు లేటుగా వడ్డించారని మరో యువతిని పెళ్లాడిన వరుడు!

ABN , Publish Date - Dec 28 , 2024 | 08:33 AM

రొట్టె లేటుగా పెట్టారంటూ ఆగ్రహించిన వరుడి కుటుంబం పెళ్లి సడెన్‌గా క్యాన్సిల్ చేసేసింది. అదే రోజు రాత్రి వరుడు మరో వివాహం చేసుకున్నాడు. ఉత్తరప్రదేశ్‌లో ఇటీవల ఈ ఘటన వెలుగు చూసింది.

Viral: వధువుకు షాక్! రొట్టెలు లేటుగా వడ్డించారని మరో యువతిని పెళ్లాడిన వరుడు!

ఇంటర్నెట్ డెస్క్: ఉత్తరప్రదేశ్‌లో తాజాగా షాకింగ్ ఉదంతం వెలుగులోకి వచ్చింది. తమకు రొట్టెలు లేటుగా పెట్టారని ఆగ్రహించిన వరుడు పెళ్లి రద్దు చేసుకున్నాడు. అదే రోజు మరో యువతిని పెళ్లాడాడు. వరుడి తీరుతో షాకైన వధువు కుటుంబం చివరకు పోలీసులను ఆశ్రయించారు. చందౌలీ జిల్లాలో ఈ షాకింగ్ ఘటన వెలుగుచూసింది (Viral).

జాతీయ మీడియా కథనాల ప్రకారం, మెహతాబ్ అనే యువకుడికి డిసెంబర్ 22న పెళ్లి జరగాల్సి ఉంది. ఏడు నెలల ముందే ఈ తేదీని వధూవరుల కుటుంబాలు ఖరారు చేసుకున్నాయి. ఇక పెళ్లి రోజున వరుడి కుటుంబం ఊరేగింపుగా వధువు ఇంటికి చేరుకుంది. ఈ క్రమంలో వారికి వధువు కుటుంబం స్వీట్లు, పూలదండలతో ఘన స్వాగతం పలికింది. ఆ తరువాత అందరికీ భోజనం వడ్డించింది. అయితే, రోట్టె ఇవ్వడంలో ఆలస్యం కావడంతో వరుడి కుటుంబసభ్యుల్లో ఒకరు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ తగాదాకు దిగారు. ఇది చినికిచినికి గాలివానగా మారింది.

Viral: మార్చరీలో జాబ్‌కు వింత పరీక్ష.. శవాల మధ్య 10 నిమిషాల పాటు..


వారిని శాంత పరిచేందుకు వధువు తరపు వారు ఎంత ప్రయత్నించినా ఉపయోగం లేకపోయింది. వరుడి తరపు వారు తిరిగెళ్లిపోయారు. ఆ తరువాత వరుడు కూడా చెప్పాపెట్టకుండా ఇంట్లోంచి వెళ్లిపోయాడు. అదే రాత్రి తన బంధువుల అమ్మాయిని వివాహమాడాడు. విషయం తెలిసి వధువు కుటుంబం తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. తమను ఆదుకోవాలంటూ స్థానిక పోలీసులను ఆశ్రయించింది. వరుడి కుటుంబంపై వారు ఎటువంటి చర్యలకూ అంగీకరించకపోవడంతో రెండు రోజుల తరువాత వధువు తరపు వారు ఎస్పీకి ఫిర్యాదు చేశారు.

Viral: వాహనదారుడికి షాక్.. రోడ్డుపై వెళుతుండగా హెల్మెట్‌లోని పాము కాటేయడంతో..


వరుడి తీరు కారణంగా తమకు రూ.7 లక్షల నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందులో రూ.1.5 లక్షలను కట్నంగా ఇచ్చుకున్నట్టు కూడా చెప్పుకొచ్చారు. నిందితులపై తక్షణం ఎఫ్‌ఐఆర్ రిజిస్టర్ చేసి తగు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. తమకు సాయపడాల్సిందిగా ఎస్పీ స్థానిక పోలీసులకు సూచించారని వధువు తరపు వ్యక్తులు చెప్పుకొచ్చారు. అయితే, పోలీసులు ఇప్పటివరకూ తమను సంప్రదించలేదని అన్నారు. స్థానిక పోలీసుల నిష్క్రియాపరత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళల సమస్యల పరిష్కారానికి సీఎం యోగి పోలీస్ స్టేషన్లలో ప్రత్యేకంగా హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేయించినా పోలీసుల తీరులో మార్పు లేకపోవడం ఏమిటని ప్రశ్నించారు.

Viral: భర్త నుంచి విడాకుల కోసం సెక్స్ వర్కర్‌ను ఎరగా వేసి మాస్టర్ ప్లాన్!

Read Latest and Viral News

Updated Date - Dec 28 , 2024 | 08:48 AM