Share News

Viral Video: వరుడు ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ ఉద్యోగేమో.. ఊరేగింపు కారును ఎలా డెకరేట్ చేశారో చూస్తే నవ్వకుండా ఉండలేం..

ABN , Publish Date - Sep 28 , 2024 | 02:00 PM

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ప్రతిరోజు కొన్ని వందల వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. ముఖ్యంగా పెళ్లి వేడుకలకు సంబంధించిన డ్యాన్స్, పాటలు, వధూవరుల వీడియోలు బాగా వైరల్ అవుతున్నాయి. పెళ్లికి సంబంధించిన ఫన్నీ వీడియోలు నెటిజన్లను బాగా ఆకట్టుకుంటున్నాయి.

Viral Video: వరుడు ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ ఉద్యోగేమో.. ఊరేగింపు కారును ఎలా డెకరేట్ చేశారో చూస్తే నవ్వకుండా ఉండలేం..
Groom's car decoration

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ప్రతిరోజు కొన్ని వందల వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. ముఖ్యంగా పెళ్లి వేడుకలకు (Wedding Videos) సంబంధించిన డ్యాన్స్, పాటలు, వధూవరుల వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. పెళ్లికి సంబంధించిన ఫన్నీ వీడియోలు నెటిజన్లను బాగా ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం అలాంటిదే ఓ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. వరుడు (Groom) కారు డెకరేషన్, దానిపై నెటిజన్ల ఫన్నీ కామెంట్లు చాలా మందిని ఆకట్టుకుంటున్నాయి (Viral Video).


rishavyadav26 అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ పెళ్లి కారు రోడ్డుపై వెళ్తోంది. ఆ కారులో వరుడు ఉన్నాడు. అయితే ఆ కారును పూలతో డెకరేట్ చేయలేదు. ఆ కారును పూర్తిగా ఆకులు, మొక్కలతో నింపేశారు (Groom's car decoration). రోడ్డు మీద వెళ్తున్న ఆ కారును చూసి చాలా మంది ఆశ్చర్యపోయారు. వీడియోలో కనిపించే కొత్త స్టైల్ డెకరేషన్‌పై నెటిజన్లు ఫన్నీ కామెంట్‌లు చేశారు. అవి చదివిన తర్వాత మీకు నవ్వు రావడం ఖాయం. ఆ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.


ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు 35 లక్షల కంటే ఎక్కువ మంది వీక్షించారు. 80 వేల మందికి పైగా ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో ఫన్నీ కామెంట్లు చేశారు. ``వరుడు ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్‌లో పని చేస్తున్నాడనుకుంటా``, ``అతను పెళ్లికి వెళ్తున్నాడా లేదా చెట్ల పెంపకానికి వెళ్తున్నాడా``, ``ఆ డెకరేషన్‌ను తొలగించడానికి మేకలను పిలవవలసి ఉంటుంది``, ``ఇది మోగ్లీ పెళ్లి ఊరేగింపు`` అంటూ నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Viral: ఏం క్రియేటివిటీ బాసూ.. క్లాస్‌లో పాస్‌పోర్ట్ సైజ్ ఫొటో తీయడానికి ఎలాంటి టెక్నిక్ వాడారో చూడండి..


Viral Video: వామ్మో.. ఇదెక్కడి సర్‌ప్రైజ్ రా బాబూ.. బర్త్‌డే విషెస్ పేరుతో ఫ్రెండ్ ప్రైవేట్ పార్ట్‌కు నిప్పు.. తర్వాతేం జరిగిందంటే..


IQ Test: మీ ఐక్యూ ఏ స్థాయిలో ఉందో టెస్ట్ చేసుకోండి.. ఈ ముగ్గురిలో బాస్ ఎవరో కనిపెట్టండి..


Viral Video: వామ్మో.. చీమ కూడా ఇంతలా భయపెడుతుందా? జర్మన్ ఫొటోగ్రాఫర్ తీసిన ఫొటో చూస్తే షాకవ్వాల్సిందే..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి.

Updated Date - Sep 28 , 2024 | 03:49 PM