Viral: ఏం క్రియేటివిటీ బాసూ.. క్లాస్‌లో పాస్‌పోర్ట్ సైజ్ ఫొటో తీయడానికి ఎలాంటి టెక్నిక్ వాడారో చూడండి..
ABN , Publish Date - Sep 28 , 2024 | 10:27 AM
తెలివితేటలు ఉండాలే గానీ, ఎంత పెద్ద సమస్యకైనా సులభంగా పరిష్కారం కనుక్కోవచ్చు. ఓ పని చేయడానికి అవసరమైన వనరులు అందుబాటులో లేనపుడు, ఉన్న వాటితోనే పని కానిచ్చెయ్యవచ్చు. అలాంటి ఎన్నో జుగాడ్ వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
తెలివితేటలు ఉండాలే గానీ, ఎంత పెద్ద సమస్యకైనా సులభంగా పరిష్కారం కనుక్కోవచ్చు. ఓ పని చేయడానికి అవసరమైన వనరులు అందుబాటులో లేనపుడు, ఉన్న వాటితోనే పని కానిచ్చెయ్యవచ్చు. అలాంటి ఎన్నో జుగాడ్ వీడియోలు (Jugaad Video) ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ ఫొటో వైరల్ అవుతోంది. క్లాస్‌రూమ్‌లో పాస్‌పోర్ట్ సైజ్ ఫొటో (Passport Size Photo) తీయడానికి వాడిన నింజా టెక్నిక్ చూస్తే షాక్ అవ్వాల్సిందే. చైనా (China)కు చెందిన విద్యార్థులు పాస్‌పోర్ట్ సైజ్ ఫొటో తీసేందుకు వెరైటీ టెక్నిక్ వాడారు (Students Passport Size Photo Viral).
madrazcorner అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ ఫొటో షేర్ అయింది. కొంతమంది పాఠశాల విద్యార్థులు తమ క్లాస్‌మేట్‌ను నేలపై పడుకోబెట్టి, వారి మొబైల్‌తో అతని పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో తీస్తున్నారు.ఈ విద్యార్థి తల కింద నీలిరంగు పేపర్‌ను కర్టెన్‌గా ఉంచారు. నిజంగా ఫొటో స్టూడియోలో పాస్‌పోర్ట్ సైజ్ ఫొటో తీయించుకున్నట్టుగా ఉండేందుకు అన్ని ఏర్పాట్లూ చేశారు. ఆ విద్యార్థి చుట్టూ అతని క్లాస్‌మేట్స్ నిలబడి తమ మొబైల్స్‌తో ఫొటోలు తీశారు. ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు ఆ కుర్రాళ్ల క్రియేటివిటీని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు.
ఈ వైరల్ ఫొటోకు పది లక్షలకు పైగా వ్యూస వచ్చాయి. దాదాపు లక్ష మంది ఈ ఫొటోను లైక్ చేశారు. ఆ ఫొటోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``హార్డ్ వర్క్ బ్రో, పర్ఫెక్షన్``, ``మాస్టర్ మైండ్``, ``కొత్త ఆలోచన అన్‌లాక్ అయింది``, ``మేడ్ ఇన్ చైనా``, ``ఇంత కష్టం ఎందుకు, గూగుల్ ఏఐ వాడితే సరిపోతుంది కదా`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
IQ Test: మీ ఐక్యూ ఏ స్థాయిలో ఉందో టెస్ట్ చేసుకోండి.. ఈ ముగ్గురిలో బాస్ ఎవరో కనిపెట్టండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి.