Viral Video: అదేంటి.. కారును ఇలా కూడా డెకరేట్ చేస్తారా? ఆ కారును చూస్తే నవ్వాపుకోవడం కష్టం..
ABN , Publish Date - Nov 25 , 2024 | 11:28 AM
అందర్నీ ఆకట్టుకునేందుకు భిన్నంగా చేయాలనే కోరికతో, కొందరు చేసే పనులు చూస్తే నవ్వు ఆపుకోలేరు. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో కూడా అలాంటిదే. పెళ్లికి వెళ్తున్న వరుడి కారును చాలా వెరైటీగా డిజైన్ చేశారు. పెళ్లి ఊరేగింపుతో వెళ్తున్న ఈ కారును చూసిన జనం ఉలిక్కిపడ్డారు.
సోషల్ మీడియాలో పాపులారిటీ సంపాదించడం కోసం, ప్రజల దృష్టిని ఆకర్షించడం కోసం చాలా మంది ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. అందర్నీ ఆకట్టుకునేందుకు భిన్నంగా చేయాలనే కోరికతో, కొందరు చేసే పనులు చూస్తే నవ్వు ఆపుకోలేరు. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో (Funny Video) కూడా అలాంటిదే. పెళ్లికి వెళ్తున్న వరుడి కారును (Groom's car) చాలా వెరైటీగా డిజైన్ చేశారు. పెళ్లి ఊరేగింపుతో వెళ్తున్న ఈ కారును చూసిన జనం ఉలిక్కిపడ్డారు. ఆ వీడియో సోషల్ మీడియా జనాలను విపరీతంగా ఆకట్టుకుంటోంది (Viral Video).
cars_mixcher అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో వరుడి కారు కనిపిస్తోంది. సాధారణంగా వరుడి కారును పువ్వలతో డెకరేట్ చేస్తుంటారు. అయితే ఈ కారును కూరగాయలతో డిజైన్ చేశారు. పండ్లు, కూరగాయలతో అలంకరించారు. పచ్చిమిర్చి, అరటి పళ్లు, వంకాయలు, బెండకాయలతో అలంకరించారు. ఈ కారును చూసిన వారందరూ పగలబడి నవ్వుకున్నారు. దానిని చుట్టుపక్కల వారు ఆశ్చర్యంగా చూస్తుండిపోయారు. ఆ కారును వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు దాదాపు 10 లక్షల మంది వీక్షించారు. లక్ష మంది కంటే ఎక్కువ మంది ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియో చూసిన వారు తమదైన శైలిలో ఫన్నీ కామెంట్లు చేశారు. ``కూరగాయల వ్యాపారి పెళ్లి ఊరేగింపులా ఉంది``, ``భిన్నమైన ఆలోచన``, ``పెళ్లి రైతు బజార్‌లో జరుగుతోందా`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
Viral Video: బ్యాడ్ లక్ అంటే ఇదే.. అమెరికాలో ఇంజనీరింగ్.. ఇండియాలో అడుక్కుంటున్నాడు..!
Viral Video: ఇలాంటి వాళ్ల వల్ల మరో మహమ్మారి వస్తుంది.. వింత బిర్యానీ చేసిన మహిళపై నెటిజన్ల ఆగ్రహం..
Optical Illusion Test: మీ దృష్టికి పరీక్ష.. ఈ గుహలో దాక్కున్న కుక్కను 5 సెకెన్లలో పట్టుకోండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి