Share News

Viral: డ్రోన్‌ కాఫ్టర్ తయారు చేసిన కుర్రాడు.. ఆనంద్ మహీంద్రా ప్రశంస!

ABN , Publish Date - Dec 19 , 2024 | 09:51 PM

హైస్కూల్లో చదువుతూనే ఓ కుర్రాడు డ్రోన్ కాప్టర్ తయారు చేసి అందులో స్వయంగా కూర్చుని గాల్లో ఎగిరాడు. ఈ వీడియోపై స్పందించిన ఆనంద్ మహీంద్రా ఆ కుర్రాడిపై ప్రశంసల వర్షం కురిపించారు.

Viral: డ్రోన్‌ కాఫ్టర్ తయారు చేసిన కుర్రాడు.. ఆనంద్ మహీంద్రా ప్రశంస!

ఇంటర్నెట్ డెస్క్: మనం రోజువారీ ఎదుర్కొనే సమస్యలకు కొత్త రీతిలో పరిష్కారాలను కొనుగొనడమే ఇంజినీరింగ్‌. ఇలాంటి ఉత్సుకత సృజనాత్మకత ఉన్న వాళ్లు సాంకేతికరంగాన్ని కొత్త పుంతలు తొక్కించగలరు. దేశ ఆర్థిక రంగాన్ని పరుగులు పెట్టించగలరు. ఈ ఉత్సాహాన్నే ప్రదర్శించిన ఓ కుర్రాడిపై ప్రస్తుతం ఆనంద్ మహీంద్రా ప్రశంసలు కురిపించారు. భారత్‌కు ఇలాంటి వాళ్లే కావాలని పేర్కొన్నారు. అతడు రూపొందించిన ఓ డ్రోన్ కాప్టర్ వీడియోను కూడా నెట్టింట షేర్ చేశారు (Viral).

Viral: వామ్మో.. మిల్క్ ప్యాకెట్స్‌పై ఎక్స్‌పైరీ డేట్ వెనక ఇంత స్టోరీ ఉందా!

వీడియోలో కనిపించిన దాని ప్రకారం, మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో హైస్కూల్‌లో చదువుతున్న మేధాంశ్ ద్వివేదీ అనే కుర్రాడు ఓ డ్రోన్ కాప్టర్ సిద్ధం చేశాడు. అంటే.. ఓ మనిషిని మోసుకెళ్లగలిగేలా నాలుగు డ్రోన్లకు ఓ సీటు ఏర్పాటు చేశాడు. అందులో తనే కూర్చుని రిమోట్ కంట్రోల్ సాయంతో గాల్లోకి ఎగిరాడు. రెండు మూడు నిమిషాలు అలాగే గాల్లో ఉండి మళ్లా కిందకు దిగాడు.


Viral: పబ్లిక్‌గా జంట అధర చుంబనాలు.. మెట్రో స్టేషన్‌లో షాకింగ్ సీన్!

ఈ వీడియోపై ఆనంద్ మహీంద్రా కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘ఇక్కడ మనం చూడాల్సింది సృజనాత్మకత గురించి కాదు. ఎందుకంటే ఇలాంటి ఓ పరికరం తయారు చేసేందుకు కావాల్సిన ప్రణాళిక ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉంది. అయితే, ఓ పని ఎల్లాగైన పూర్తి చేయాలన్న తపన, ఇంజినీరింగ్ పట్ల అనురక్తికి ఈ దృవ్యం ఉదాహరణ. ఇలాంటి యువతీయువకులు ఎందరుంటే దేశంలో సృజనాత్మకత అంతగా వెల్లివిరుస్తుంది’’ అని కామెంట్ చేశారు.

Viral Video: బస్సులో ప్రయాణికుడిని 26 సార్లు చెంప ఛెళ్లుమనిపించిన మహిళ!


కాగా, వీడియోపై నెట్టింట భారీ స్పందన వచ్చింది. అనేక మంది త్రివేదీ నైపుణ్యాల్ని మెచ్చుకున్నారు. ‘‘ఆలోచనలకు వాస్తవరూపం ఇవ్వాలన్న తపన, నిబద్ధతల నుంచే సృజనాత్మకత పుట్టుకొస్తుంది’’ అని ఓ వ్యక్తి కామెంట్ చేశారు. ఇంతటి ఉత్సాహంతో యువత ఇంజినీరింగ్‌లోకి ప్రవేశిస్తే దేశాభివృద్ధికి, సృజనాత్మకతకు గట్టిపునాదులు పడతాయి’’ అని మరో వ్యక్తి అన్నారు. ‘‘సృజనాత్మక మూలాలు కేవలం జ్ఞానంలోనే కాదు.. ఆసక్తి, నిబద్ధతలోననూ ఉన్నాయి’’ అని మరో వ్యక్తి కామెంట్ చేశారు. డ్రోన్ తాయరీ అద్భుతమని వ్యాఖ్యానించారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ ఉదంతం తెగ వైరల్ అవుతోంది.

Viral: ఈ ఏనుగుకు ఎంత మర్యాద! తన దారికి అడ్డుగా నిలబడ్డ వ్యక్తిని..

Viral: టీచర్ కష్టం చూసి జనాలు షాక్! ఈ సర్కస్ ఏంటంటూ విమర్శలు!

Updated Date - Dec 19 , 2024 | 09:51 PM