Share News

Viral: ఉద్యోగులే మా సెలబ్రిటీలన్న కంపెనీ! ఎలాంటి దీపావళి గిఫ్ట్ ఇచ్చిందంటే..

ABN , Publish Date - Oct 22 , 2024 | 05:31 PM

హర్యానాకు చెందిన ఓ ఫార్మా కంపెనీ తన ఉద్యోగులకు ఏకంగా కార్లను దీపావళి బహుమతిగా ఇచ్చింది. అత్యద్భుత ప్రతిభను కనబరిచిన 15 మందిని ఎంపిక చేసి వీటిని ఇచ్చింది.

Viral: ఉద్యోగులే మా సెలబ్రిటీలన్న కంపెనీ! ఎలాంటి దీపావళి గిఫ్ట్ ఇచ్చిందంటే..

ఇంటర్నెట్ డెస్క్: నేటి కార్పొరేట్ పోటీ ప్రపంచంలో కంపెనీలకు ఉద్యోగులే అసలైన వనరులు. వారి విలువను గుర్తిస్తున్న అనేక సంస్థలు ఉద్యోగులను అందలం ఎక్కిస్తున్నాయి. గూగుల్ లాంటి సంస్థలు తమ ఉద్యోగులకు ఆఫీసుల్లో సకల సౌకర్యాలు కల్పిస్తున్నాయి. అద్భుతమైన భోజనం మొదలు, ఆఫీసుల్లో జిమ్‌లు వంటివి అందుబాటులో ఉంచుతున్నాయి. అయితే, కొన్ని సంప్రదాయక పరిశ్రమలు కూడా ప్రస్తుతం టెక్ సంస్థలతో పోటీ పడుతూ ఉద్యోగులకు ప్రోత్సాహకాలు ఇవ్వడం ప్రారంభించాయి. తాజాగా హర్యానాకు చెందిన ఓ పార్మా కంపెనీ.. అత్యధిక ప్రతిభగల ఉద్యోగులకు కింద ఏకంగా కార్లనే దీపావళి బహుమతులుగా ఇచ్చేసింది (Viral).

Viral: బాయ్‌ఫ్రెండ్‌కు కోట్ల ఆస్తి వారసత్వంగా రానుందని తెలిసి హత్య! చివరకు..


హర్యానాకు చెందిన మిట్స్ హెల్త్‌కేర్ అనే ఫార్మా సంస్థ..అత్యధిక ప్రతిభ కనబరిచిన 15 మందికి ఈ దిపావళి బహుమతులు ఇచ్చింది. ‘‘వాళ్లు మా ఉద్యోగులు కారు.. సెలబ్రిటీలు, కుటుంబ సభ్యులు’’ అని సంస్థ వ్యవస్థాపకుడు ఎమ్‌కే భాటియా మీడియాకు తెలిపారు.

Viral: ఎడారిలో చిక్కుకుపోయిన యువతులకు వింత అనుభవం! ఉబెర్ యాప్‌లో ఒంటెల సవారీ!

‘‘మేము సాధారణంగా యువతీయువకులను ఉద్యోగంలోకి తీసుకుని తగిన శిక్షణ ఇస్తాము. ఆ తరువాత వీరిలో అద్భుత పనితీరు కనబరిచిన వారికి తమ బృందాలకు ప్రెసిడెంట్స్‌గా చేస్తాము. ఆ తరువాత మళ్లీ పనితీరు ఆధారంగానే డైరెక్టర్లు కూడా పదోన్నతి కల్పిస్తాము. ఇదే క్రమంలో వారికి కార్లు కూడా బహూకరిస్తాము’’ అని ఆయన చెప్పుకొచ్చారు. ఈ ఏడాది 15 మందికి కార్లు బహుమతిగా ఇచ్చినట్టు తెలిపారు. తన పనితీరును మెరుగుపరుచుకునేలా యువ ఉద్యోగులను ప్రోత్సహించేందుకు కార్లను బహుమతులుగా ఇస్తున్నట్టు తెలిపారు. తనకు ఒకప్పుడు ఎదురైన అనుభవం కూడా దీనికి ఓ కారణమని భాటియా వివరించారు.


UP: భర్త ఆయుష్షు కోసం రోజంతా ఉపవాసం.. రాత్రికి విషం పెట్టి హత్య!

తాను వ్యాపారవేత్తగా తొలి విజయం అందుకున్నాక కారు కొనుక్కున్నానని, ఇలా చేస్తే ప్రజల్లో తనకు గౌరవం దక్కుతుందని అప్పట్లో భావించినట్టు చెప్పారు. ‘‘కారు కొన్నాక నాలో కాన్ఫిడెన్స్ పీక్స్‌కు వెళ్లింది. కాబ్టటి ఇదే లాజిక్ అనుసరిస్తున్నాను’’ అన్ని అన్నారు. కార్లు బహుమతిగా ఇచ్చాక కొందరు ఉద్యోగుల లైఫ్ స్టైలే మారిపోయిందని తెలిపారు.

కాగా ఇటీవల చెన్నైకి చెందిన ఓ సంస్థ తన ఉద్యోగులకు ఏకంగా 28 కార్లు, 29 బైకులు దీపావళి బహుమతిగా ఇచ్చింది. హ్యుందాయ్, టాటా, మారుతీ సుజుకీ సహా మెర్సిడీస్ బెంజ్ వంటి ఖరీదైన కార్లను సైతం బహుమతులుగా ఇచ్చేసింది.

Read Latest and Viral News

Updated Date - Oct 22 , 2024 | 05:37 PM