Share News

Viral Video: వామ్మో.. ఇతడు మామూలు డ్రైవర్ కాదు.. బోటు నుంచి వ్యాన్‌ను రోడ్డు మీదకు ఎలా తెచ్చాడో చూడండి..

ABN , Publish Date - Dec 14 , 2024 | 06:19 PM

ఎంతో నైపుణ్యం, గుండె ధైర్యం ఉన్న వారు మాత్రమే విపత్కర పరిస్థితుల్లో కూడా చక్కగా వాహనాలను నడుపుతుంటారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో చూస్తే డ్రైవింగ్ స్కిల్ అంటే ఏంటో అర్థమవుతుంది. ఆ వీడియోలోని వ్యక్తి అత్యంత ప్రమాదకర పరిస్థితిలో వాహనాన్ని నడిపి ఔరా అనిపించుకున్నాడు.

Viral Video: వామ్మో.. ఇతడు మామూలు డ్రైవర్ కాదు.. బోటు నుంచి వ్యాన్‌ను రోడ్డు మీదకు ఎలా తెచ్చాడో చూడండి..
Driving Skill

కార్లు, వ్యాన్‌లు వంటి నాలుగు చక్రాల వాహనాలను చాలా మంది డ్రైవ్ (Driving) చేస్తుంటారు. అయితే విపత్కర పరిస్థితుల్లో వాటిని డ్రైవ్ చేయడం అందరికీ సాధ్యం కాదు. ఎంతో నైపుణ్యం, గుండె ధైర్యం ఉన్న వారు మాత్రమే అలాంటి పరిస్థితుల్లో కూడా చక్కగా వాహనాలను నడుపుతుంటారు (Driving Skill). ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో చూస్తే డ్రైవింగ్ స్కిల్ అంటే ఏంటో అర్థమవుతుంది. ఆ వీడియోలోని వ్యక్తి అత్యంత ప్రమాదకర పరిస్థితిలో వాహనాన్ని నడిపి ఔరా అనిపించుకున్నాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది (Viral Video).


@Tiwari_Saab అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఓ బోటు మీద మినీ వ్యాన్‌ను ఓ చోటు నుంచి మరో చోటుకు తీసుకెళ్లారు. అయితే గమ్యస్థానానికి చేరుకున్న తర్వాత ఆ వ్యాన్‌ను రోడ్డు మీదకు దించడం సవాలుగా మారింది. బోటు ఒడ్డుకు పూర్తి చేరువలోకి రాకపవడంతో రెండు చెక్కలు వేసి వాటి మీదుగా వ్యాన్‌ను నడిపించారు. సన్నటి ఆ చెక్కల మీద నుంచి వ్యాన్ ఏ మాత్రం జారినా నీటిలో పడిపోవాల్సిందే. అలాంటి ప్రమాదకర పరిస్థితుల్లో కూడా డ్రైవర్ ఆ వ్యాన్‌‌ను చక్కగా నడిపి రోడ్డు మీదకు చేర్చాడు. ఆ ఘటనను అక్కడున్న వారు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.


ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు దాదాపు 2.8 లక్షల మంది వీక్షించారు. వందల మంది ఆ వీడియోను లైక్ చేశారు. ఆ డ్రైవర్ స్కిల్‌కు ఫిదా అయిపోయి అతడిపై ప్రశంసలు కురిపించాడు. ``హెవీ డ్రైవర్‌లు కూడా ఇది చూసి షాకవుతారు``, ``అతడి గుండె ధైర్యానికి సెల్యూట్ చెప్పాల్సిందే``, ``ఇది నిజమైన ట్యాలెంట్`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Viral Video: కర్ర పట్టుకొచ్చి పోలీస్ కానిస్టేబుల్ హల్‌చల్.. ట్రక్ డ్రైవర్ మాటలకు భయపడి పరార్..


Optical Illusion Test: మీవి డేగ కళ్లు అయితే.. ఆకుల మధ్యనున్న కప్పను 5 సెకెన్లలో పట్టుకోండి..


Viral Video: గర్ల్‌ఫ్రెండ్‌ను ఎంచుకునేందుకు ``ఏబీసీడీఈ రూల్``.. ఈ వ్యక్తి చెప్పే టిప్స్ వింటే షాకవ్వాల్సిందే..

Viral Video: యముడు ఏదైనా ఫంక్షన్‌కు వెళ్లాడేమో.. వీడియో కోసం పట్టాలపై పడుక్కున్న యువకుడు.. ఆ తర్వాత..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి

Updated Date - Dec 14 , 2024 | 06:19 PM