Viral: భార్య కోసం వీఆర్ఎస్.. ఫేర్‌వెల్ పార్టీలో మహిళ మృతి
ABN , Publish Date - Dec 26 , 2024 | 02:00 PM
అనారోగ్యంతో ఉన్న భార్యకు అండగా ఉండేందుకు భర్త స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్నాడు. కానీ, అతడి గౌరవార్థం ఏర్పాటు చేసిన విడ్కోలు పార్టీలోనే ఆమె కన్నుమూసింది.
ఇంటర్నెట్ డెస్క్: గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న తన భార్య బాగోగులను ఆయన స్వయంగా చూసుకోవాలనుకున్నారు. ఇంటిపట్టునే ఉండి ఆమెకు సేవలు చేయాలని భావించారు. ఇందుకోసం రిటైర్మెంట్‌కు మూడేళ్ల ముందే స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్నారు. కానీ, ఇంతలోనే దారుణం జరిగిపోయింది. పదవీ విరమణ పార్టీ సందర్భంగా ఆమె భర్త కళ్లముందరే కన్నుమూసింది. రాజస్థాన్‌లో వెలుగు చూసిన ఈ ఘటనతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి (Viral).
కోటాకు చెందిన దేవేంద్ర సందాల్ కేంద్ర గిడ్డంగుల కార్పొరేషన్‌లో మేనేజర్‌గా పనిచేస్తున్నారు. ఆయన భార్య పేరు టీనా, ఇద్దరూ దాదాబరీ ప్రాంతంలోని శాస్త్రి నగర్‌లో ఉంటున్నారు. టీనా కొంత కాలంగా గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు.
Viral: భర్త నుంచి విడాకుల కోసం సెక్స్ వర్కర్‌ను ఎరగా వేసి మాస్టర్ ప్లాన్!
దీంతో, ఆమె బాగోగులను దగ్గరుండి చూసుకోవాలనుకున్న దేవేంద్ర సందాల్ రిటైర్మెంట్‌కు ఇంకా మూడేళ్లు ఉండగానే వీఆర్ఎస్ తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన గౌరవార్థం ఫేర్‌వెల్ పార్టీ ఏర్పాటు చేశారు. టీనా కూడా ఈ పార్టీకి హాజరయ్యారు. దంపతులు ఇద్దరూ కుర్చీల్లో పక్క పక్కన కూర్చున్నారు. వారికి పుష్ఫగుచ్ఛాలు అందిస్తూ సహోద్యోగులు, బంధువులు స్నేహితులు ఒక్కొక్కరుగా వచ్చి శుభాకాంక్షలు చెప్పి వెళ్లసాగారు. అతిథుల సందడి మధ్య అక్కడంతా పండగ వాతావరణం నెలకొంది. కానీ ఇంతలోనే ఊహించని పరిణామం చోటుచేసుకుంది.
Viral: లగ్జరీ కారులో అకస్మాత్తుగా మంటలు! ‘రేమండ్స్’ అధినేత గుస్సా!
భర్త పక్కనే కూర్చున్న టీనా ఉన్నట్టుండి ముందుకు ఒరిగిపోయారు. ‘‘నాకు కళ్లు తిరుగుతున్నాయి’’ అంటూ టీనా పడిపోతుంటే భర్త ఆమె వీపుపై నిమిరి స్థిమితపరిచే ప్రయత్నం చేశారు. నీళ్లు తీసుకురండి.. నీళ్లు.. అంటూ కంగారుగా పక్కనున్న వారిని పురమాయించారు. అంతకు కొన్ని క్షణాల ముందే ఆమెను ఫొటోకు పోజులివ్వమని ఎవరో అడిగారు. నవ్వుతూ తలపైకెత్తిన ఆమె ఆ మరుక్షణమే తూలుతున్నట్టు ముందుకు వంగిపోయింది. ఆమెను లేవనెత్తేందుకు తన కూర్చీలోంచి భర్త లేచేలోపే ఆమె కుప్పకూలిపోయింది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించినా ఉపయోగం లేకపోయింది. ఆమె అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు ప్రకటించారు. హఠాత్తుగా భార్య కన్నుమూయడంతో దేవేంద్ర కన్నీరుమున్నీరయ్యారు.
Viral: ఒకే ట్రిప్‌కు రెండు ఫోన్లలో వేర్వేరు చార్జీల ఆరోపణ.. స్పందించిన ఉబర్