Share News

Voters List: ఓటరు జాబితాలో మీ పేరు ఉందా? లేదా? ఆన్‌లైన్ ద్వారా చెక్ చేసుకోవడం ఎలాగంటే..

ABN , Publish Date - Mar 25 , 2024 | 07:17 PM

ఎన్నికల్లో ఓటు వేయాలంటే ఓటర్ల జాబితాలో మీ పేరు కచ్చితంగా ఉండాల్సిందే. మరి, మీ పేరు ఉందో, లేదో ఆన్‌లైన్ ద్వారా చెక్ చేసుకోవడం ఎలా? ఈ కింది స్టెప్స్ ఫాలో అయితే మీ పేరు ఉందో, లేదో సులభంగా తెలిసిపోతుంది.

Voters List: ఓటరు జాబితాలో మీ పేరు ఉందా? లేదా? ఆన్‌లైన్ ద్వారా చెక్ చేసుకోవడం ఎలాగంటే..

త్వరలో దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలు, పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగబోతున్నాయి. ఈ ఎన్నికల ప్రక్రియ ఎప్రిల్ 19న ప్రారంభమై జూన్ 1వ తేదీన ముగియబోతోంది. ఈ ఎన్నికల్లో ఓటు వేయాలంటే ఓటర్ల జాబితాలో మీ పేరు కచ్చితంగా ఉండాల్సిందే. మరి, మీ పేరు ఉందో, లేదో ఆన్‌లైన్ ద్వారా చెక్ చేసుకోవడం ఎలా? ఈ కింది స్టెప్స్ ఫాలో అయితే మీ పేరు ఉందో, లేదో సులభంగా తెలిసిపోతుంది.

స్టెప్:1

ముందుగా మీరు https://electoralsearch.eci.gov.in/ అనే వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయాలి. అక్కడ ``సెర్చ్ బై డిటైల్స్``, ``సెర్బ్ బై ఈపీఐసీ``, ``సెర్చ్ బై మొబల్`` ఆప్షన్లు కనబడతాయి.

``సెర్చ్ బై డిటైల్స్`` ఎంచుకుంటే..

స్టెప్:2

మీ రాష్ట్రం, భాషను ఎంచుకోవాలి

స్టెప్:3

మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, వయసు, జెండర్, బంధువుల పేరు, లాస్ట్ నేమ్ మొదలైనవి నింపాలి

స్టెప్:4

లోకేషన్‌ను ఎంచుకోవాలి. మీ జిల్లా, అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఎంటర్ చేయాలి.

స్టెప్:5

క్యాప్చా ఎంటర్ చేసి సెర్చ్‌పై క్లిక్ చేయాలి.

``సెర్బ్ బై ఈపీఐసీ``

స్టెప్:2

మీ భాషను ఎంచుకోవాలి

స్టెప్:3

మీ ఈపీఐసీ నెంబర్, రాష్ట్రాన్ని సెలెక్ట్ చేసుకోవాలి

స్టెప్:4

క్యాప్చా ఎంటర్ చేసి సెర్చ్‌పై క్లిక్ చేయాలి.

``సెర్చ్ బై మొబల్``

స్టెప్:2

మీ రాష్ట్రం, భాషను ఎంచుకోవాలి

స్టెప్:3

మీ మొబైల్ నెంబర్‌ను, క్యాప్చాను ఎంటర్ చేయాలి.

స్టెప్:4

``సెండ్ ఓటీపీ`` ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.

స్టెప్:5

మీ మొబైల్‌కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి సెర్చ్‌పై క్లిక్ చేయాలి.

ఈ మూడు మార్గాల్లో ఏదో ఒక దానిని ఎంచుకుంటే ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందా, లేదా తెలుసుకోవడంతో పాటు, మీ వ్యక్తిగత సమాచారం, పోలింగ్ స్టేషన్, పోలింగ్ డేట్, ఎలక్షన్ అధికారులు పేర్లు తెలుస్తాయి.

Updated Date - Mar 25 , 2024 | 07:21 PM