Share News

Limited Period SIP: 5 ఏళ్ల పాటు పెట్టుబడి పెడితే ఏకంగా రూ. కోటి సొంతం! ఎలాగంటే..

ABN , Publish Date - Dec 24 , 2024 | 09:36 AM

5 ఏళ్ల పాటు పెట్టుబడి పెడితే ఏకంగా రూ.కోటి సొంతం..! అవును.. లిమిటెడ్ పీరియడ్ క్రమానుగత పెట్టుబడుల్లో మదుపు చేస్తే ఏకంగా కోటి సొంతం అవుతుంది.

Limited Period SIP: 5 ఏళ్ల పాటు పెట్టుబడి పెడితే ఏకంగా రూ. కోటి సొంతం! ఎలాగంటే..

ఇంటర్నెట్ డెస్క్: 5 ఏళ్ల పాటు పెట్టుబడి పెడితే ఏకంగా రూ.కోటి సొంతం..! అవును.. లిమిటెడ్ పీరియడ్ క్రమానుగత పెట్టుబడుల్లో మదుపు చేస్తే ఏకంగా కోటి సొంతం అవుతుంది. ఏళ్ల తరబడి పెట్టుబడులు పెట్టలేమనే వారు ఇలా పరిమిత కాల సిస్టమిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్‌ను ఎంచుకుంటే ఆర్థికభారం తగ్గించుకుంటూనే లక్ష్యాలను కూడా చేరుకోవచ్చు.

TRAI: ఈ టెలికాం కంపెనీలకు ట్రాయ్ భారీ ఫైన్.. కారణమిదే..


ఏమిటీ లిమిటెడ్ పీరియడ్ ఎస్ఐపీ?

మ్యూచువల్ ఫండ్స్‌లో ఓ నిర్దిష్ట కాలానికి పెట్టుబడి పెట్టేందుకు అవకాశమిచ్చే సాధనమే లిమిటెడ్ పీరియడ్ ఎస్‌ఐపీ. కొంత కాలం తరువాత ఇందులో పెట్టుబడులు ఆపేసినా.. ఆర్థికలాభాలు మాత్రం ఒనగూరుతూనే ఉంటాయి. అంటే.. అప్పటివరకూ పెట్టిన పెట్టుబడిపై వడ్డీ కాంపౌండ్ అయ్యి లాభాలు పెరుగుతూనే ఉంటాయని ఫైనాన్షియల్ ప్లానర్లు చెబుతున్నారు.

లిమిటెడ్ పీరియడ్ ఎస్‌ఐపీల్లో ఓ నిర్దిష్ట కాలపరిమితిలో పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఆ తరువాత పెట్టుబడి మొత్తం మిగిలిన కాలంలో వృద్ధి చెందూతూ వెళుతుంది. ఆర్థిక లక్ష్యాలను చేరుకునేందుకు సుదీర్ఘకాలం పాటు పెట్టుబడులను పెట్టాల్సిన సమస్య లిమిటెడ్ పీరియడ్ ఎస్‌ఐపీతో ఉండదు.

Rohan Mirchandani: ప్రముఖ పెరుగు బ్రాండ్ సహ వ్యవస్థాపకుడు 42 ఏళ్లకే మృతి..

ఉదాహరణకు, మీ కొడుకు లేదా కూతురు భవిష్యత్తు కోసం ఈ పథకాన్ని ఎంచుకోవచ్చు. ఓ ఐదేళ్ల పాటు పెట్టుబడి పెట్టి ఆ తరువాతి కాలంలో ఏకంగా రూ.1 కోటి సొంతం చేసుకోవచ్చు. ఇందుకోసం నెల నెల రూ.30 వేల మేరకు లిమిటెడ్ పీరియడ్ ఎస్‌ఐపీలోకి డబ్బు మళ్లించాల్సి ఉంటుంది. ఏటా 12 శాతం వడ్డీ వస్తుందనుకుంటే ఈ మొత్తం ఐదేళ్ల తరువాత 24.7 లక్షలకు చేరుకుటుంది. ఆ తరువాత పెట్టుబడి ఆపేసినా లాభాలు మాత్రం వస్తూనే ఉంటాయి. అంటే.. సంతానం మేజర్లయ్యే నాటికి పెట్టిన పెట్టుబడి ఏకంగా రూ.1.07 కోట్లకు చేరుతుంది.


భారీ ఆర్థిక లక్ష్యాలు ఉన్నా ఏళ్లకు ఏళ్లు చెల్లింపులు వద్దనుకునే వారు ఈ తరహా ఎస్‌ఐపీని ఎంచుకోవచ్చు. పిల్లల చదువులు లేదా సొంత ఇల్లు కొనుగోలు, లేదా పెట్టుబడుల కోసం దీన్ని ఎంచుకోవచ్చు. దీర్ఘకాలిక పెట్టుబడుల అవసరం లేకున్నా ఆ స్థాయిలోనే లాభాలు కళ్లచూడొచ్చు.

లిమిటెడ్ పీరియడ్ ఎస్‌ఐపీలతో లాభాలు

ఇలాంటి పథకాల్లో 15 నుంచి 20 ఏళ్ల పాటు పెట్టుబడులు కొనసాగించాల్సిన అవసరం ఉండదు. కాంపౌండింగ్ కారణంగా పెట్టుబడిపై దీర్ఘకాలిక లాభాలు వస్తాయి. ఐదేళ్ల తరువాత నెలవారీ చెల్లింపులు ఆపేయొచ్చు. ఆపై నిశ్చింతగా పేమెంట్ హాలిడే తీసుకోవచ్చు. తక్కువ కాలం పెట్టుబడితో దీర్ఘకాలిక లక్ష్యాలు చేరుకోవాలనుకునే వారికి ఇది అత్యంత అనువైన పథకమని ఫైనాన్షియల్ ప్లానర్లు చెబుతున్నారు.

Read More Business News and Latest Telugu News

Updated Date - Dec 24 , 2024 | 09:36 AM