Share News

Washing White Clothes: ఈ టెక్నిక్స్‌తో తెల్ల దుస్తులపై పాత మరకలు మాయం!

ABN , Publish Date - Dec 07 , 2024 | 09:02 AM

కాస్తంత సహనం ప్రదర్శిస్తూ సరైన టెక్నిక్‌ వాడితే తెల్లటి దుస్తులపై ఉన్న ఎంతటి మొండి మరక అయినా సులువుగా వదిలిపోతుందని అనుభవజ్ఞులు చెబుతున్నారు. మరి ఈ చిట్కాలు ఎంటో ఈ కథనంలో సవివరంగా తెలుసుకుందాం.

Washing White Clothes: ఈ టెక్నిక్స్‌తో తెల్ల దుస్తులపై పాత మరకలు మాయం!

ఇంటర్నెట్ డెస్క్: చాలా మందికి తెల్లని దుస్తులు అంటే ఎంతో ఇష్టం. ప్రత్యేక సందర్భాల్లో కచ్చితంగా వీటినే వేసుకుంటారు. కానీ, వాటిపై చిన్న మరక పడినా అందవిహీనంగా మారిపోతాయి. మరకలు కొట్టొచ్చినట్టు కనబడతాయి. అందుకే చాలా మందికి తెల్లి దుస్తులంటే ఒకింత భయపడతారు. ఒకసారి వాటిపై మరక పడితే వదిలించుకోవడం కష్టమని భావిస్తుంటారు. అయితే, కాస్తంత సహనం ప్రదర్శిస్తూ సరైన టెక్నిక్‌ వాడితే ఎంతటి మొండి మరక అయినా సులువుగా వదిలిపోతుందని అనుభవజ్ఞులు చెబుతున్నారు. మరి ఈ చిట్కాలు ఎంటో ఈ కథనంలో సవివరంగా తెలుసుకుందాం (Old stains on White Clothes).

Viral: ఏం ఐడియా బ్రో.. గుళ్లల్లో చెప్పులు చోరీ కాకుండా ఉండేందుకు భలే చిట్కా!

బేకింగ్ సోడా పేస్ట్‌తో మేజిక్

పాత మరకలపై బేకింగ్ సోడా అద్భుతంగా పనిచేస్తుంది. ఆహారం మరకలు, చమట మరకలు, రంగు మారడం వంటివాటివి బేకింగ్ సోడాతో సులువుగా వదిలిపోతాయి. ఇందుకోసం నాలుగు టీస్పూన్ల బేకింగ్ సోడాలో రెండు టీస్పూన్ల నీళ్లు కలిపి పేస్టు చేసుకోవాలి. ఈ పేస్టును మరకపై వేసి బ్రష్ లేదా వేళ్లతో పలుమార్లు రుద్దాలి. ఆ తరువాత 30 నిమిషాల పాటు అలాగే ఉండనినచ్చి నీళ్లతో కడిగేస్తే మరక మాయమైపోతుంది. దీనితో దుర్వాసన కూడా తొలగిపోతుంది.


వెనిగర్‌తో ఇలా..

వైట్ వెనిగర్‌తో మరకలు సులువుగా తొలగిపోవడంతో పాటు దుస్తులు మృదువుగా మారతాయి. వైన్, కాఫీ, టీ మరకలపై ఇది అద్భుతంగా పనిచేస్తుంది. ఈ మరకలను వదిలించుకునేందుకు ఒక గిన్నెలో ఒక వంతు వెనిగర్‌కు మూడు వంతుల నీళ్లు కలపాలి. ఆ మిశ్రమంలో మరకలున్న దుస్తులను కనీసం 30 నిమిషాల పాటు నానబెట్టాలి. ఆ తరువాత దుస్తుల బ్రష్‌తో నెమ్మదిగా వాటిని ఉతికాలి. ఆ తరువాత నీళ్లల్లో జాడించి ఆరేసుకుంటే మరకలు మాయమవుతాయి. వెనిగర్‌లోని యాసిడ్ గుణాలు మరకల వదిలిపోయేలా చేసి దుస్తులు మరింత రంగు తేలేలా చేస్తాయి.

Viral: బైక్‌పై భారీ ఒంటె తరలింపు.. నోరెళ్లబెడుతున్న జనాలు! వైరల్ వీడియో!

హైడ్రోజన్ పెరాక్సైడ్..

మరీ మొండి మరకలపై ఓ మోస్తరు ప్రభావం ఉండే బ్లీచింగ్ రసాయనాలను వాడొచ్చని అనుభవజ్ఞులు చెబుతున్నారు. ఇందుకోసం మరకలపై నేరుగా హైడ్రోజన్ పెరాక్సైడ్ పోయాలి. అవసరమనుకుంటే కాస్త గిన్నెలు తోమే సోప్ కూడా వేసి మరకపై రుద్దాక 30 నిమిషాల పాటు అలాగే వదిలేయాలి. ఆ తరువాత చల్లి నీళ్లతో కడిగితే మరక పోతుంది. అవసరమనుకుంటే ఇదే టెక్నిక్‌ను మరోసారి ట్రై చేయొచ్చు. దుస్తుల లోపలి వరకూ వెళ్లే హైడ్రోజన్ పెరాక్సైడ్ మరకల్లోని కాంపౌండ్లను విచ్ఛిన్నం చేసి అది వదిలిపోయేలా చేస్తుంది.


సహజసిద్ధమైన పద్ధతుల్లో మరక వదలనప్పుడు కృత్రిమ రసాయనాలవైపు మళ్లొచ్చు. ఇందుకోసం మరకలను వదిలించే కమర్షియల్ స్టెయిన్ రిమూవర్ లేదా ఆక్సీజన్ బ్లీచ్‌ను ఎంచుకోవచ్చు. ఇవి వాడే ముందు ప్యాకింగ్‌పై ఉన్న సూచనలు పూర్తిగా చదివి అవగతం చేసుకోవాలి. స్టెయిన్ రిమూవర్‌ను మరకపై వేసి కనీసం 15 నిమిషాలు దుస్తులను అలాగే వదిలేయాలి. ఆ తరువాత దుస్తులను శుభ్రం చేస్తే మరక వదిలిపోతుంది. ఇక ఆక్సీజన్ బ్లీచ్ ఉపయోగించే వారు గోరువెచ్చని నీటిని వాడితే మంచి ఫలితాలు ఉంటాయి. మరకలున్న దుస్తులను ఈ కెమికల్‌లో రాత్రంతా నానబెడితే మొండి మరకలు సైతం వదిలిపోతాయి. ఆక్సీజన్ బ్లీచ్ నుంచి విడుదలయ్యే ఆక్సీజన్ బుడగలు..దుస్తుల మీదున్న మరక పైకిలేచొచ్చేలా చేస్తాయి. దుస్తులు మునుపటిలా తెల్లగా మెరిసిపోయేలా చేస్తాయి.

ఈ పద్ధతుల్లో దుస్తులు ఉతికాక వాటిని ఎండలో ఆరేస్తే మరకలు పూర్తిగా కనుమరుగువుతాయని నిపుణులు చెబుతున్నారు. సూర్యరశ్మి సహజంగా బ్లీచింగ్ లక్షణం ఉండటంతో మరకల అనవాళ్లు కూడా పూర్తిగా తొలగిపోతాయని చెబుతున్నారు. సూర్య రశ్మిలోని అతినీలలోహిత కిరణాలు మరకల్లోని కెమికల్స్ విచ్ఛిన్నమయ్యేలా చేయడంతో అవి కనుమరుగవుతాయి.

Elon Musk: భారత్‌లో ఒకే రోజులో 640 మిలియన్ ఓట్లు లెక్కించారు! మస్క్ ప్రశంసలు

Read Latest and Viral News

Updated Date - Dec 07 , 2024 | 09:02 AM