Viral: కెనడాలో పరిస్థితి మరీ ఇంతలా దిగజారిందా? విద్యార్థుల కష్టాలు చూస్తే..
ABN , Publish Date - Jun 23 , 2024 | 04:42 PM
కెనడాలో పార్ట్ టైం ఉద్యోగాల కోసం విదేశీ విద్యార్థులు ఎన్ని పాట్లు పడుతున్నారో కళ్లకు కట్టినట్టు చెప్పే వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఓ ఫాస్ట్‌ఫుడ్ రెస్టారెంట్‌లో జాబ్ కోసం వెళితే తనకు ఎలాంటి అనుభవం ఎదురైందో చెబుతూ నిషత్ అనే భారతీయ విద్యార్థి ఈ వీడియో షేర్ చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: కెనడాలో పార్ట్ టైం ఉద్యోగాల కోసం విదేశీ విద్యార్థులు ఎన్ని పాట్లు పడుతున్నారో కళ్లకు కట్టినట్టు చెప్పే వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్ (Viral) అవుతోంది. ఓ ఫాస్ట్‌ఫుడ్ రెస్టారెంట్‌లో జాబ్ కోసం వెళితే తనకు ఎలాంటి అనుభవం ఎదురైందో చెబుతూ నిషత్ అనే భారతీయ విద్యార్థి ఈ వీడియో షేర్ చేశారు. జనాలు నోరెళ్లబెట్టేలా చేస్తున్న ఈ వీడియో ప్రస్తుతం తెగ ట్రెండ్ అవుతోంది.
టొరొంటోలో ఉంటున్న విద్యార్థి నిషాత్ గత నెలరోజులుగా పార్ట్ టైం జాబ్ కోసం వెతుకుతున్నట్టు చెప్పుకొచ్చాడు. టిమ్ హార్టన్స్ ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్‌లో ఖాళీలు ఉన్నట్టు తెలిసి అపాయింట్‌మెంట్ టైమ్ కంటే అరగంట ముందుగానే వచ్చానని చెప్పాడు. కానీ, అక్కడ దాదాపు వంద మంది భారీ క్యూ కట్టారని చెప్పుకొచ్చాడు.
Viral: కొబ్బరి చిప్పలో టీ తయారు చేసిన మహిళ.. చూసి తీరాల్సిన వీడియో
ఆ క్యూ చూసి స్థానికులు కూడా ఆశ్చర్యపోవడంతో రెస్టారెంట్ వారు బయటకు వచ్చి తమ సీవీలు తీసుకుని, ఎంపికయ్యందీ లేనిదీ ఫోన్ చేసి చెబుతామంటూ తమను పంపించేశారని అన్నాడు. ఆ తరువాత తాను మరో చోట ఇంటర్వ్యూకు వెళ్లానని, తాను ఉండే ప్రదేశానికి ఆ చోటు చాలా దూరంలో ఉందని కూడా చెప్పాడు. ఈ రెండింట్లో ఏది దొరకుతుందో లేదా అసలు జాబ్ దొరుకుతుందో లేదో కూడా చెప్పలేమని అన్నాడు (Hundreds Of Indian Foreign Students Queue Up For A Job At Tim Hortons In Canada).
ఈ వీడియో వైరల్ కావడంతో జనాలు షాకైపోతున్నారు. కెనడాలో నిరుద్యోగిత ఈ రేంజ్ లో ఉందా అంటూ షాకైపోయారు. కెనడాలోని కొందరు భారతీయులు కూడా ఈ వీడియోపై స్పందించారు. తామూ చాలా రోజులుగా పార్ట్ టైం జాబ్ కోసం వెతుకుతున్నా ఇంత వరకూ లక్ కలిసి రాలేదని కామెంట్ చేశారు. కెనడాలోని నిర్మాణ రంగం, ట్రక్కు డ్రైవింగ్ తదితర రంగాల్లో ఉద్యోగాలు ఉన్నాయని, ఈ నైపుణ్యాలు నేర్చుకోవాలని కొందరు సలహా ఇచ్చారు. ఏడేళ్ల క్రితం తాను చూసిన కెనడాకు ఇప్పటి పరిస్థితికి చాలా తేడా ఉందని, అన్ని రకాలుగా ఆలోచించుకున్నాకే కెనడాకు రావాలని మరో వ్యక్తి అంతర్జాతీయ విద్యార్థులకు సలహా ఇచ్చాడు.