Share News

Hyderabad: కునుకు తీసేందుకు ప్రత్యేక పరికరం...

ABN , Publish Date - May 18 , 2024 | 10:23 AM

కార్యాలయాల్లో కాసేపు కునుకు తీయడం (పవర్‌ న్యాప్‌) ఇటీవలి కాలంలో చాలా కార్పొరేట్‌ కంపెనీలలో(Corporate companies) ఓ ట్రెండ్‌గా కొనసాగుతున్నది. నగరంలోని పలు ఐటీ, ఐటీయేతర కంపెనీలు తమ కార్యాలయాల్లో మధ్యాహ్నం పూట ఉద్యోగులు విశ్రమించడానికి సమయం ఇస్తున్నాయి.

Hyderabad: కునుకు తీసేందుకు ప్రత్యేక పరికరం...

హైదరాబాద్‌ సిటీ: కార్యాలయాల్లో కాసేపు కునుకు తీయడం (పవర్‌ న్యాప్‌) ఇటీవలి కాలంలో చాలా కార్పొరేట్‌ కంపెనీలలో(Corporate companies) ఓ ట్రెండ్‌గా కొనసాగుతున్నది. నగరంలోని పలు ఐటీ, ఐటీయేతర కంపెనీలు తమ కార్యాలయాల్లో మధ్యాహ్నం పూట ఉద్యోగులు విశ్రమించడానికి సమయం ఇస్తున్నాయి. 10 నుంచి 30 నిమిషాల పవర్‌న్యాప్స్‌తో అలసట తగ్గడంతో పాటు అప్రమత్తత పెరుగుతుందని అధ్యయనాలు చెబుతుండడంతో పలు కంపెనీలు ఉద్యోగుల కోసం ఆఫీసుల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాయి.


ఇదికూడా చదవండి: Big Alert: హైదరాబాదీలకు బిగ్ అలర్ట్.. మెట్రో రైలు వేళలు మారిపోయాయ్..

అలాంటి వారికోసమే అర్బన్‌ నాప్స్‌ అంటూ స్పికా సంస్థ నాప్‌ ప్యాడ్‌ను రూపొందించింది. నార్సింగ్‌లోని ఓ కన్వెన్షన్‌ హాల్‌లో తెలంగాణా ఫెసిలిటీ మేనేజ్‌మెంట్‌ కౌన్సిల్‌ నిర్వహించిన 10వ జాతీయ సదస్సులో ఇది ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ న్యాప్‌ పాడ్‌ ఖరీదు 7.5 లక్షల రూపాయలు ఉంటుందని ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఇందులో జీరోగ్రావిటీ సీట్‌, బ్యాక్‌ మసాజ్‌, ఆక్సిజన్‌ థెరపీ, మెడిటేషన్‌ మ్యూజిక్‌, వెంటిలేటెడ్‌ సీట్‌, టైమ్డ్‌ వేకింగ్‌ వంటి ఫీచర్లు ఉన్నాయన్నారు.

ఇదికూడా చదవండి: Hyderabad: ‘మెట్రో’లో మహిళలు తగ్గుతున్నారు..!

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - May 18 , 2024 | 10:23 AM