Viral: వామ్మో.. నవ్వు ఎంత పని చేసింది.. విపరీతంగా నవ్వి హాస్పిటల్ పాలైన వ్యక్తి.. డాక్టర్ ఏం చెప్పారంటే..
ABN , Publish Date - Jun 05 , 2024 | 11:28 AM
నవ్వు నాలుగు విధాల గ్రేటు, నవ్వకపోవడం ఒక రోగం అంటుంటారు. ఒక చిన్న నవ్వు మన శరీరానికి ఎంతో మేలు చేస్తుందని వైద్యులు కూడా చెబుతుంటారు. అయితే ఆ నవ్వు ఎక్కువైతే మాత్రం చేటే. విపరీతంగా నవ్వి ఓ వ్యక్తి ఏకంగా స్పృహ కోల్పోయాడు. కుటుంబ సభ్యులు వెంటనే అతడిని హాస్పిటల్‌కు తరలించారు.
నవ్వు (Laugh) నాలుగు విధాల గ్రేటు, నవ్వకపోవడం ఒక రోగం అంటుంటారు. ఒక చిన్న నవ్వు మన శరీరానికి ఎంతో మేలు చేస్తుందని వైద్యులు కూడా చెబుతుంటారు. అయితే ఆ నవ్వు ఎక్కువైతే మాత్రం చాలా ప్రమాదం. విపరీతంగా నవ్వి ఓ వ్యక్తి ఏకంగా స్పృహ కోల్పోయాడు (Non-stop Laugh). కుటుంబ సభ్యులు వెంటనే అతడిని హాస్పిటల్‌కు తరలించారు. అతడిని పరీక్షించిన వైద్యులు సంచలన విషయాలు చెప్పారు. హైదరాబాద్ (Hyderabad)లోనే ఈ ఘటన జరిగింది (Viral News).
హైదరాబాద్‌కు చెందిన ఓ 53 ఏళ్ల శ్యామ్ అనే వ్యక్తి సాయంత్రం ఇంట్లో తన కుటుంబ సభ్యులతో కలిసి టీవీలో కామెడీ షో చూస్తున్నాడు. ఆ షో చూస్తూ టీ తాగుతూ విపరీతంగా నవ్వాడు. ఆ ధాటికి శ్యామ్ చేతిలోంచి టీ కప్పు ఒక్కసారిగా జారిపోయింది. అదే సమయంలో, అతని శరీరం వంగి, అతను వెంటనే నేలపై పడిపోయాడు. అతడి రెండు చేతులూ గట్టిగా వణకడం ప్రారంభమైంది. అతడు నెమ్మదిగా స్పృహ కూడా కోల్పోయాడు. పక్కనే ఉన్న అతడి కూతురు వెంటనే అంబులెన్స్‌కు ఫోన్ చేసి హాస్పిటల్‌కు తీసుకెళ్లింది.
హాస్పిటల్‌లో చేర్చిన తర్వాత శ్యామ్ పరిస్థితిలో కొద్ది కొద్దిగా మార్పు వచ్చింది. డాక్టర్ సుధీర్ కుమార్ అతడికి చికిత్స అందించారు. అతడి మెడికల్ హిస్టరీ గురించి తెలుసుకుని రకరకాల పరీక్షలు చేశారు. అతడికి ఎలాంటి వ్యాధులూ లేవు. అతిగా నవ్వడం వల్లే అతడికి ఫిట్స్ వచ్చినట్టు తెలుసుకున్నారు. అతడు లాఫ్టర్ ఇండ్యూస్డ్ సింకోప్ (Laughter-induced syncope) అనే అరుదైన సమస్యతో బాధపడుతున్నట్టు గుర్తించారు. అతిగా నవ్వడం, ఎక్కువ సేపు నిలబడడం, శారీరక శ్రమ చేయడం వంటివి తగ్గించుకోవాలని శ్యామ్‌కు డాక్టర్ చెప్పారు. ఎక్కువ మంచి నీళ్లు తాగాలని సూచించారు.
ఇవి కూడా చదవండి..
Viral Video: ప్రతి కుక్కకూ ఓ రోజు వస్తుందంటే ఇదేనేమో.. గేదె మీద శునక రాజసం చూడండి..!
Opitcal Illusion: ఈ ఫొటోలో ``A`` ఎక్కడుందో కనిపెడితే మీ కళ్లు నిజంగా పవర్‌ఫుల్ అని నమ్మవచ్చు..!
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..