Viral Video: గర్ల్‌ఫ్రెండ్‌ను ఎంచుకునేందుకు ``ఏబీసీడీఈ రూల్``.. ఈ వ్యక్తి చెప్పే టిప్స్ వింటే షాకవ్వాల్సిందే..
ABN , Publish Date - Dec 13 , 2024 | 08:50 PM
పెళ్లి చేసుకునే ముందు ఏడు తరాల గురించి తెలుసుకోవాలనే వారు. అయితే ప్రస్తుతం అంత తీరిక ఎవరికీ లేదు. ఎవరైనా కాస్త అందంగా కనబడితే ప్రేమలోకి దిగిపోతున్నారు. ఆ తర్వాత వారితో అడ్జెస్ట్ కాలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఓ వ్యక్తి గర్ల్‌ఫ్రెండ్‌ను ఎంచుకోవడం ఎలాగో చెబుతున్నాడు.
జీవిత భాగస్వామిని ఎంచుకునే విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. గతంలో పెద్ద వాళ్లు ఆ పని చేసేవారు. పెళ్లి (Marriage) చేసుకునే ముందు ఏడు తరాల గురించి తెలుసుకోవాలనే వారు. అయితే ప్రస్తుతం అంత తీరిక ఎవరికీ లేదు. ఎవరైనా కాస్త అందంగా కనబడితే ప్రేమలోకి దిగిపోతున్నారు. ఆ తర్వాత వారితో అడ్జెస్ట్ కాలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఓ వ్యక్తి గర్ల్‌ఫ్రెండ్ (Girl Friend)ను ఎంచుకోవడం ఎలాగో చెబుతున్నాడు. అమ్మాయిని ఎంచుకునేందుకు ఏబీసీడీఈ రూల్
` (ABCDE Rule) ఫాలో కావాలని చెబుతున్నాడు. అతడు మాట్లాడుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది (Viral Video).
bihar_ekfeel అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఆ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలోని వ్యక్తి భోజ్‌పురీలో మాట్లాడుతున్నాడు. అమ్మాయిలను సెలెక్ట్ చేసుకునేందుకు ``ఏబీసీడీఈ రూల్`` ఫాలో కావాలని, అమ్మాయికి ఎంచుకునే ముందు ఐదు విషయాలను టెస్ట్ చేసుకోవాలని అంటున్నాడు. అతడు చెబుతున్న దాని ప్రకారం.. ``ఏ`` అంటే ఏజ్. అమ్మాయి కచ్చితమైన వయస్సు తెలుసుకోవాలి. ``బి`` అంటే బ్యూటీ. శారీరకంగానే కాదు.. మానసికంగా కూడా అందమైన అమ్మాయిని సెలెక్ట్ చేసుకోవాలి. ``సి`` అంటే క్యారెక్టర్. మంచి నడవడిక, ప్రవర్తను ఉన్న అమ్మాయిని ఎంచుకోవాలి.
ఇక, ``డి`` అంటే డెకరేషన్ అట. అంటే అబ్బాయి హైట్, వెయిట్‌కు తగినట్టుగా అమ్మాయి ఉందో, లేదో చూసుకోవాలట. చివరగా ``ఈ`` అంటే ఎడ్యుకేషన్. ఆ అమ్మాయి చదువు గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలట. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వైరల్ వీడియోను పది లక్షల కంటే ఎక్కువ మంది వీక్షించారు. లక్ష కంటే ఎక్కువ మంది ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. అమ్మాయిల విషయంలోనే కాదు.. అబ్బాయిలను సెలక్ట్ చేసుకునే ముందు కూడా ఈ రూల్ ఫాలో కావొచ్చని చాలా మంది కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
Viral Video: సింహంతో ఆడుకోవాలనుకున్నాడు.. చుక్కలు చూశాడు.. షాకింగ్ వీడియో వైరల్..
Viral Video: రోడ్డు పక్కన పూలు అమ్ముకుంటున్న కుర్రాడు.. ఆ పేద బాలుడి కళ్లలో సంతోషం కోసం..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి