Share News

Viral: ఒంటరిగా స్లమ్ ఏరియాకు వెళ్లిన ఫారినర్! అతడిని స్థానికులు చూసి..

ABN , Publish Date - Oct 11 , 2024 | 09:37 AM

పేదరికం అత్యధికంగా ఉన్న ఓ స్లమ్ ఏరియాలో పరిస్థితులను వీడియోలో రికార్డు చేసేందుకు ఒంటరిగా వెళ్లిన ఓ ఫారినర్‌కు ఊహించని అనుభవం ఎదురైంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

Viral: ఒంటరిగా స్లమ్ ఏరియాకు వెళ్లిన ఫారినర్! అతడిని స్థానికులు చూసి..

ఇంటర్నెట్ డెస్క్: పేదరికం అత్యధికంగా ఉన్న ఓ స్లమ్ ఏరియాలో పరిస్థితులను వీడియోలో రికార్డు చేసేందుకు ఒంటరిగా వెళ్లిన ఓ ఫారినర్‌కు ఊహించని అనుభవం ఎదురైంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ (Viral) అవుతోంది.

విదేశీయుల్లో కొందరికి ఇక్కడి స్లమ్ ఏరియాలపై అసాధారణ ఆసక్తి ఉంటుంది. ఇక్కడి ప్రజల దుర్భర పరిస్థితులు, జీవనశైలి చూసి ఆశ్చర్యపోతుంటారు. అయితే, యూట్యూబర్ క్రిస్ మాత్రం ఇందుకు భిన్నంగా వారకేమైనా సాయం చేయాలనే ఉద్దేశంతో ఢిల్లీలోని కుసుమ్ పహాడీ ప్రాంతానికి వెళ్లాడు. తన అనుభవాన్ని వీడియోలో బంధించాలనే ఉద్దేశంతో కెమెరాతో రికార్డు చేయడం ప్రారంభించాడు. కానీ తదుపరి ఏం జరుగుతుందో తెలీక భయంభయంగానే రికార్డింగ్ ప్రారంభించాడు. తను చూస్తున్నదాని గురించి వివరించసాగాడు.

Viral: విమానం నడుపుతన్న భర్తకు గుండెపోటు! ఒంటరైన భార్య ఊహించని విధంగా..


‘‘భారత్‌లో అత్యంత పేద ప్రాంతం ఇదే. ఇక్కడ పిల్లలు ఆహారం కోసం చెత్త డబ్బాల్లో వెతుకుతుంటారు. ఇక్కడి వారికి బాత్రూమ్ కూడా ఓ లగ్జరీనే. ఇకడి వారి రోజువారీ సంపాదన 20 డాలర్ల కూడా ఉండదు. మంచి నీళ్ల కోసం ప్రజలు పరస్పరం తగువులాడుతుంటారు. ఇక్కడికి రావడం నాకు ఇదే తొలిసారి. కొద్దిగా టెన్షన్‌గా ఉంది. ఇక్కడ జీవితం అంటే చెత్తకుప్పపై బతకడమే అని స్థానికులు వ్యాఖ్యానిస్తుంటారు’’ అని చెబుతూ వీడియో రికార్డు చేయసాగాడు.

ఇదంతా చూస్తున్న కొందరు స్థానిక మహిళలు తమ దొడ్డ మనసును చాటుకున్నారు. అతిథిగా వచ్చిన అతడిని తమ ఇంట్లోకి ఆహ్వానించి చాయ్ బిస్కెట్ ఇచ్చారు. ఆప్యాయంగా అతడికి షేక్ హ్యాండ్ ఇచ్చారు. అతడితో కలిసి పాటలకు లయబద్దంగా నృత్యం చేశారు. డబ్బుకు పేదలైనా మంచి మనసున్న వారిని చూసి క్రిస్ ఆశ్చర్యపోయాడు.

Turkish Airlines: మార్గమధ్యంలో పైలట్ మరణం.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్!


ఆ తరువాత అతడు ఓ బార్బర్ షాపుకు వెళ్లి షేవింగ్ చేయించుకున్నాడు. ధర ఎంత అని అడగ్గా షాపు యజమాని రూ.50 అని చెప్పడంతో క్రిస్ ఆశ్చర్యపోయాడు. అతడి నిజాయతీని మెచ్చుకుంటూ రూ.500 ఇచ్చాడు. దీంతో, ఆ బార్బర్ స్వయంగా ప్రాంతాన్నంతా క్రిస్ దగ్గరుండి మరీ చూపించాడు.

ఇక వీడియో నెట్టింట వైరల్‌గా మారిన నేపథ్యంలో జనాలు తమ అభిప్రాయాలను కామెంట్ చేశారు. అక్కడి పేదల మంచి మనసు, వారి అతిథిమర్యాదలు ఎందరినో కదిలించాయి. క్రిస్ వారికి సాయం చేయడంపై కూడా కొందరు వ్యాఖ్యానించారు. ఇలాంటి దుర్భర పరిస్థితుల్లో జీవించడం సామాన్య విషయం కాదని కొందరు అన్నారు. స్లమ్ ఏరియాలతో పాటు భారత్‌లోని లగ్జరీ ప్రాంతాలను కూడా సందర్శించి తన వ్యూవర్స్‌తో పంచుకోవాలని కొందరు సూచించారు.

Read Latest and Viral News

Updated Date - Oct 11 , 2024 | 09:44 AM