Viral: రోల్స్ రాయిస్ షోరూంలో భారతీయ బిలియనీర్‌కు అవమానం! ఆ తరువాత..
ABN , Publish Date - Aug 27 , 2024 | 09:17 PM
దుబాయ్‌లోని రోల్స్‌రాయిస్ షోరూంలో తనకెదురైన అనుభవాన్ని మలయాళీ బిలియనీర్ జాయ్ అలుక్కాస్ నెట్టింట పంచుకున్నారు. తనకు స్తోమత లేదని భావించిన షోరూంలోని సిబ్బంది రోల్స్ రాయిస్ కారు అమ్మేందుకు విముఖత వ్యక్తం చేశారని అన్నారు.
ఇంటర్నెట్ డెస్క్: ఇప్పుడంటే భారతీయులు సంపన్నులన్న విషయం ప్రపంచం గుర్తించింది కానీ ఒకప్పుడు పరిస్థితి భిన్నంగా ఉండేది. ఇందుకు సంబంధించి ఓ భారతీయ బిలియనీర్ తాజాగా మీడియాతో పంచుకున్న ఉదంతం ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ (Viral) అవుతోంది.
జాయ్ అలుక్కాస్.. ఈ పేరు చెప్పగానే ముందుగా గుర్తొచ్చేది ప్రముఖ జువెలరీ బ్రాండే. మలయాళీ వ్యాపారవేత్త అయిన జాయ్ అలుక్కాస్..ఫోర్బ్స్ అపరకుబేరుల జాబితాలో ఈ ఏడాది 712 స్థానాన్ని దక్కించుకున్నారు. అయితే, అపరకుబేరుడైన ఆయన ఒకానొక సందర్భంలో రోల్స్ రాయిస్ షోరూంలో అసాధారణ అనుభవాన్ని చవి చూశారు (Indian billionaire insulted by Rolls Royce Dubai showroom now owns a fleet of luxury cars).
Viral: 65 ఏళ్ల వ్యక్తి 35 ఏళ్ల వాడిలా మారిపోయాడుగా! షాకింగ్ వీడియో!
1987లో అలుక్కాస్ తన కుటుంబ వ్యాపారాన్ని అంతర్జాతీయంగా విస్తరించేందుకు దుబాయ్ వెళ్లారు. ఆ తరువాత తన పేరుతోనే సొంతంగా జువెలరీ బ్రాండ్ ప్రారంభించారు. ఈ క్రమంలో 2000లో ఓసారి ఆయన దుబాయ్‌లోని రోల్స్ రాయిస్ షోరూంకు వెళ్లారు. కారు కొనుగోలు చేసేందుకు వచ్చానని ఆయన చెప్పగానే షోరూం సిబ్బంది నుంచి ఊహించని సమాధానం ఎదురైంది.
‘‘నాకు రోల్స్ రాయిస్ కారు కావాలని అన్నాను. వారేమో.. నో.. నో..మీరు కారు కొనుక్కోవాలనుంటే పక్కనే ఉన్న మిత్సుబిషీ షోరూంకు వెళ్లండి అక్కడో కారు దొరుకుతుందీ అని అన్నారు. దీంతో. నాకు అవమానంగా అనిపించింది. ఆ తరువాత పట్టుబట్టి మరీ రోల్స్‌రాయిస్ కారు కొన్నా. అయితే, అంత ఖరీదైన లగ్జీర కారు నాకు అవసరం లేదు. దీంతో, మా జువెలరీ చెయిన్ నిర్వహించిన లక్కీ డ్రాలో గెలిచిన వారికి ఆ కారును బహుమతిగా ఇచ్చేశా’’ అని ఆయన చెప్పుకొచ్చారు. అప్పట్లో ఈ ఉదంతం సంచలనంగా మారిందని అన్నారు. ప్రస్తుతం జాయ్ అలుక్కాస్ వద్ద రూ.6 కోట్ల విలువైన రోల్స్ రాయిస్ కలినన్ కారు ఉంది.
గతేడాది జాయ్ అలుక్కాస్ నికర సంపద విలువ 2.8 బిలియన్ డాలర్లు కాగా ఈ ఏడాది ఆయన సంపద 4.4 బిలియన్ డాలర్లకు చేరింది. ప్రస్తుతం ఆయనకు భారత్‌లో 100 జువెలరీ స్టోర్స్ ఉన్నాయి. విదేశాల్లో మరో 60 స్టోర్స్‌ను నెలకొల్పారు. ఆయన సంస్థల్లో మొత్తం 9000 వేల పైచిలుకు సిబ్బంది పనిచేస్తున్నారు. జాయ్ అలుక్కాస్‌కు చెందిన అతిపెద్ద షోరూం చెన్నైలో ఏర్పాటు చేశారు.