Share News

Viral: వీళ్లేం తల్లిదండ్రులురా దేవుడా.. పుట్టిన రోజున పాప జీవితంతో చెలగాటం!

ABN , Publish Date - Jun 15 , 2024 | 06:38 PM

బిడ్డ పుట్టిన రోజును ప్రమాదకరంగా జరిపిన ఓ తల్లిదండ్రుల వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. వారి తీరు చూసి జనాలు మండిపడుతున్నారు.

Viral: వీళ్లేం తల్లిదండ్రులురా దేవుడా.. పుట్టిన రోజున పాప జీవితంతో చెలగాటం!

ఇంటర్నెట్ డెస్క్: ఈ రోజుల్లో తమకున్న దానికి ఆనందించకుండా గోప్పలకు పోవడం సాధారణంగా మారింది. ఈ యావలో పడి చివరకు తెలీకుండానే ప్రమాదాలు కూడా కొనితెచ్చుకుంటున్నారు. అలాంటి ఓ షాకింగ్ వీడియో నెట్టింట వైరల్‌గా (Viral) మారింది. ఈ వీడియోలో తల్లిదండ్రులు తమ బిడ్డ పుట్టిన రోజు సందర్భంగా చేసిన అతి చూసి జనాలు మండిపడుతున్నారు. వారు చేసిన తప్పునకు చిన్నారి బెదిరిపోయినా పట్టించుకోకుండా ఆ తండ్రి తన భార్యను కాపాడుకునే ప్రయత్నం చేయడం జనాలకు మరింత ఆగ్రహం తెప్పించింది.

Viral: 80 ఏళ్ల వృద్ధుడిని పెళ్లాడిన 23 ఏళ్ల యువతి! ఆయనలో ఆమెకు నచ్చింది ఇదే!


వీడియోలో కనిపించిన దాని ప్రకారం, ఓ యువ జంట తమ బిడ్డ తొలి పుట్టిన రోజును ఘనంగా జరిపించాలనుకుంది. అది చాలదన్నట్టు తమ హడావుడిని గొప్పగా ప్రదర్శించాలనుకుంది. ఈ క్రమంలో బిడ్డను చిన్నా ట్రాలీలో కూర్చోపెట్టారు. ఆమె ఎదురుగా రెండు వరుసల్లో బాణసంచా పేర్చి వాటి మధ్య ట్రాలీని నడిపిస్తూ బాణసంచా కాల్చారు. ఈ క్రమంలో ఒకటి పేలి నిప్పు రవ్వలు చిన్నారి వైపునకు దూసుకొస్తే బాలిక భయపడిపోయింది. కొన్ని తల్లిదండ్రుల మీద కూడా పడ్డాయి. అయితే, ఆ వ్యక్తి తన భార్యను కాపాడే ప్రయత్నం చేశాడు కానీ చిన్నారి వణికిపోతున్నా ఒక అడుగు ముందు కూడా వేయలేదు. ఈలోపు అక్కడే ఉన్న పెద్దావిడ వచ్చి చిన్నారిని లేవనెత్తి ఓదార్చింది.


ఈ వీడియో వైరల్ అవడంతో తల్లిదండ్రులపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బిడ్డను ప్రమాదంలో నెట్టే ఇలాంటి వేడుకలు నిర్వహించేందుకు మనసెలా వచ్చిందో అని కొందరు ఆవేదన వ్యక్తం చేశారు. కళ్లముందే బిడ్డ కంగారు పడుతున్నా ఆ తండ్రి తన భార్యపేనే దృష్టి పెట్టడం జనాలకు మరింత ఆగ్రహం తెప్పించింది. ఇలాంటి జంటను తామెప్పుడూ చూడలేదంటూ విమర్శలు గుప్పించారు.

Read Viral and Telugu News

Updated Date - Jun 15 , 2024 | 06:42 PM