Indian Dishes: వావ్.. టేస్ట్ అట్లాస్ ర్యాకింగ్స్ లో దుమ్ము రేపిన భారతీయ వంటకాలు.. టాప్ 50లో మనవెన్ని ఉన్నాయంటే..!
ABN , Publish Date - Apr 27 , 2024 | 03:09 PM
టేస్ట్ అట్లాస్.. ఇది ప్రఖ్యాత వంటల గైడ్.. పలు మార్గాలలో వివిద దేశాల వంటకాలను, పానీయాలను అందరికీ పరిచయం చేస్తూ రుచులను వ్యాప్తి చేస్తోంది. తాజాగా ప్రపంచ వ్యాప్తంగా అత్యుత్తమ వంటకాల సంకలనాన్ని వెలువరించింది. ఏప్రిల్ 2024 ర్యాంకింగ్ ల ప్రకారం వెలువడిన ఈ సంకలనంలో టాప్ 50లో 9 భారతీయ వంటకాలుండటం విశేషం.
టేస్ట్ అట్లాస్.. ఇది ప్రఖ్యాత వంటల గైడ్.. పలు మార్గాలలో వివిద దేశాల వంటకాలను, పానీయాలను అందరికీ పరిచయం చేస్తూ రుచులను వ్యాప్తి చేస్తోంది. తాజాగా ప్రపంచ వ్యాప్తంగా అత్యుత్తమ వంటకాల సంకలనాన్ని వెలువరించింది. ఏప్రిల్ 2024 ర్యాంకింగ్ ల ప్రకారం వెలువడిన ఈ సంకలనంలో టాప్ 50లో 9 భారతీయ వంటకాలుండటం విశేషం. ఇంతకీ ఈ 50 లో ఉన్న భారతీయ వంటకాలేంటి తెలుసుకుంటే..
వేసవిలో ఈ మొక్కలు ఇంట్లో ఉంటే చాలు.. ఏసి కూడా పనికిరాదు!
భారతీయులు అమిత ఇష్టంతో తినే కీమా టాప్ 10లో చోటు దక్కించుకుంది. ఇది 6వ ర్యాంక్ పొందింది. దీని తరువాత బెంగాల్ వంటకం అయిన చింగ్రీ మలై కర్రీ 18వ స్థానాన్ని సంపాదించింది. సుగంధ కూర్మా 22వ స్థానంలో నిలిచింది. ఆ తరువాత విందాలు అనే వంటకం 26వ స్థానాన్ని సంపాదించింది. భారతీయులకు ఇష్టమైన కామన్ గా అందరూ చేసుకునే దాల్ తడ్కా 30వ స్థానంలో నిలించింది. ఇక సాగ్ పనీర్ 32వ స్థానంలోనూ, షాహీ పనీర్ 34వ స్థానంలోనూ, మిసాల్ 38వ స్థానంలోనూ నిలిచాయి. ఇక చివరిగా 50 వ స్థానంలో భారతీయులకు ఇష్టమైన పప్పు నిలిచింది.
ఈ రాళ్లు వజ్రాల కంటే కూడా ఖరీదైనవి..!
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని ప్రత్యేక వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.