Viral: వరుసగా 3 సార్లు భారతీయుడికి గిన్నిస్ రికార్డు! ఇతడేం చేశాడంటే..
ABN , Publish Date - Jun 01 , 2024 | 01:11 PM
వరుస గిన్నిస్ రికార్డులు బద్దలు కొట్టడంలో ఆరితేరిపోయాడో భారతీయుడు. ముక్కుతో అత్యధిక వేగంతో ఇంగ్లిష్ అక్షరాలు టైప్ చేసి మూడో సారి గిన్నిస్ రికార్డు నెలకొల్పాడు. అతడి పేరు వినోద్ కుమార్. టైపింగ్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా ప్రసిద్ధుడు.
ఇంటర్నెట్ డెస్క్: వరుస గిన్నిస్ రికార్డులు (Guinness Records) బద్దలు కొట్టడంలో ఆరితేరిపోయాడో భారతీయుడు. కేవలం ఏడాది వ్యవధిలో తన రికార్డులు తానే చెరిపేస్తూ ఏకంగా మూడు గిన్నిస్ రికార్డులు సొంతం చేసుకున్నాడు. కాస్తంత కొత్తగా ఆలోచించి ఈ అరుదైన గుర్తింపు సొంతం చేసుకున్నాడు. అతడి పేరు వినోద్ కుమార్ చౌదరి. ఇతడు ముక్కుతో కీబోర్డుపై టైపింగ్ చేయడంలో నేర్పరి. తాజాగా ఆంగ్ల అక్షరక్రమాన్ని కేవలం 25.66 సెకెన్లలో ముక్కుతో టైప్ చేసి సరికొత్త రికార్డు నెలకొల్పాడు. ఇందుకు సంబంధించిన వీడియోను గిన్నిస్ రికార్డ్స్ తాజాగా నెట్టింట పంచుకుంది. ప్రస్తుతం ఇది తెగ వైరల్ (Viral) అవుతోంది.
వినోద్ కుమార్ గతంలోనే ఇదే కేటగిరిలో రికార్డులు నెలకొల్పాడు. 2023లో తొలిసారిగా 27.80 సెకెన్లలో ఆల్ఫబెట్స్ మొత్తం టైప్ చేశాడు. ఆ తరువాత మరో ప్రయత్నంలో 26.73 సెకెన్లలో అంగ్ల అక్షరాలను టైప్ చేసి తన రికార్డు తానే బద్దలుకొట్టాడు. తాజాగా రెండోసారి పాత రికార్డు అధిగమించాడు. మీ ముక్కుతో ఎంత సేపట్లో టైప్ చేయగలరు అనే క్యాప్షన్‌తో గిన్నిస్ రికార్డ్స్ వారు ఈ వీడియోను షేర్ చేశారు (Indian Man 44 breaks Own Guinness World Record For Third Time By Typing With Nose).
Viral: వామ్మో! క్యాప్సికమ్‌తో ఇలాంటి ప్రమాదం కూడా ఉంటుందా? షాకింగ్ వీడియో
వినోద్ కుమార్ వృత్తి టైప్ చేయడమే. అందుకే ఈ రంగంలోనే ఓ రికార్డు నెలకొల్పాని భావించినట్టు అతడు చెప్పాడు. ఈ రికార్డులు నెలకొల్పేందుకు తాను రోజూ గంటల తరబడి ప్రాక్టీస్ చేసేవాణ్ణని అతడు చెప్పుకొచ్చాడు. ఎక్కువ సేపు ముక్కతో టైప్ చేస్తే కళ్లు తిరిగినట్టు అనిపించేవని చెప్పుకొచ్చాడు. నిత్యం మెడిటేసన్ చేయడం, సానుకూల దృక్పథమే తన సక్సెస్‌కు కారణమని అన్నాడు.
టైపింగ్‌లో వినోద్ అనేక రికార్డులు నెలకొల్పాడు. దీంతో, అతడికి టైపింగ్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరు స్థిరపడింది. అతడు అతి తక్కువ సమయంలో (5.36 సెకెన్లు) ఒంటి చేత్తో ఆంగ్ల క్షరక్రమాన్ని వ్యతిరేక దిశలో టైప్ చేసి రికార్డు నెలకొల్పాడు. ‘‘జీవితంలో ఎన్ని కష్టాలు ఉన్నా మనకు నచ్చిన పని చేస్తూనే ఉండాలి. ఇదే నేను నమ్మే సిద్ధాంతం’’ అని అతడు చెప్పుకొచ్చాడు. మరి ఈ వైరల్ వీడియోను మీరూ చూడండి.