Viral: ఊహించని ట్విస్ట్! భార్య కోసం రూ.3.4 లక్షల బంగారు నగలు కొంటే..
ABN , Publish Date - Nov 30 , 2024 | 07:10 PM
భార్య కోసం ఖరీదైన బంగారు నగలు కొన్న ఓ వ్యక్తిని కలలో కూడా ఊహించని రీతిలో అదృష్టం వరించింది. షాపులో నిర్వహించిన బంపర్ లాటరీలో విజేతగా నిలిచిన అతడు రాత్రికి రాత్రి కోటీశ్వరుడైపోయాడు.
ఇంటర్నెట్ డెస్క్: భార్య కోసం ఖరీదైన బంగారు నగలు కొన్న ఓ వ్యక్తిని కలలో కూడా ఊహించని రీతిలో అదృష్టం వరించింది. షాపులో నిర్వహించిన బంపర్ లాటరీలో విజేతగా నిలిచిన అతడు రాత్రికి రాత్రి కోటీశ్వరుడైపోయాడు. సింగపూర్‌లో ఈ ఘటన వెలుగు చూసింది. ఘటనపై స్పందించిన భారతీయ రాయబార కార్యాలయం కూడా ఈ అదృష్టవంతుడికి ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపింది (Viral)..
Viral: 100 ఏళ్ల పాటు చెక్కుచెదరకుండా ఉండే చీర.. నీతా అంబానీ ఫేవరెట్!
పూర్తి వివరాల్లోకి వెళితే, స్థానికంగా ఉంటున్న బాలసుబ్రమణియన్ చిదంబరం మూడు నెలల క్రితం ముస్తాఫా జువెలర్స్‌లో తన భార్య కోసం రూ. 3.4 లక్షలు పెట్టి బంగారు నగలు కొన్నారు. అప్పటికే, షాపు నిర్వహకులు ఓ లాటరీని ప్రారంభించారు. షాపులో రూ.15 వేలు పైబడి నగలు కొన్నవారు ఇందులో పాల్గొనేందుకు అర్హులు. దీంతో, ఈ లాటరీలో బాలసుబ్రమణియన్ కూడా పాల్గొన్నారు. నవంబర్ 24న షాపు నిర్వహకులు లక్కీ డ్రా నిర్వహించగా బాలసుబ్రమణియన్‌కు ఏకంగా లక్ష డాలర్ల బంపర్ లాటరీ తగిలింది.
Viral: ఉచితంగా జ్ఞానం పంచుతున్న ఆటో డ్రైవర్! ఎలాగో తెలిస్తే..
ఈ విషయాన్ని షాపు యాజమాన్యం ఎక్స్ వేదికగా ప్రకటించింది. ఇదో కొత్త చరిత్ర. లక్ష డాలర్లు అందుకోబోయే వ్యక్తి వీరే అంటూ సోషల్ మీడియాలో బాలసుబ్రమణియన్ ఫొటోను కూడా షేర్ చేసింది. విషయం తెలిసి బాలసుబ్రమణియన్ ఉబ్బితబ్బిబ్బైపోయారు. ‘‘ఈ రోజు మా నాన్న నాలుగో వర్ధంతి. ఇది ఆయన దీవెనే’’ అంటూ ఆయన మురిసిపోయారు. భారతీయ కరెన్సీ ప్రకారం, రూ.8.45 కోట్లు బాలసుబ్రమణియన్ సొంతమయ్యాయి. ఈ మొత్తంలో కొంత భాగాన్ని సమాజాసేవకు కృతజ్ఞతాపూర్వకంగా ఉపయోగిస్తానని ఆయన చెప్పుకొచ్చారు.
మరోవైపు, ఈ ఘటనపై సింగపూర్‌లోని భారతీయ హైకమిషన్ కూడా స్పందించింది. లాటరీ విజేతకు శుభాకాంక్షలు తెలిపింది. ‘‘1 మిలియన్ డాలర్లు గెలుచుకున్న బాలసుబ్రమణియన్‌కు శుభాకాంక్షలు. కోటీశ్వరుడు కావాలన్న కలలు సింగపూర్‌లో నిజమవుతాయి’’ అని ఎక్స్ వేదికగా పోస్టు పెట్టింది.
కాగా, ఇటీవల బ్రిటన్‌కు చెందిన ఓ వ్యక్తికి కూడా ఇదేవిధంగా అదృష్టం అనూహ్య రీతిలో వరించింది. యూరోమిలియన్ జాక్‌పాట్ విజేతగా నిలిచినందుకు ఏకంగా రూ.1804 కోట్లు దక్కింది. ఈ మొత్తం బ్రిటన్‌లో మూడో అతిపెద్ద లాటరీగా పేరుపొందింది. అయితే, ఈ టిక్కెట్ కొన్నది ఒక వ్యక్తా లేక అనేక మందా అన్నది ఇంకా తెలియాల్సి ఉంది. ఈ మొత్తాన్ని ఒకే వ్యక్తి గెలుచుకున్నట్టైతే వారు బ్రిటన్‌లోని ప్రముఖ పాప్ సింగర్ అడేల్ కంటే ధనవంతులవుతారని బీబీసీ సంస్థ వ్యాఖ్యానించింది.
Viral: ఈ ఆడ ఏనుగు కష్టం చూస్తే గుండె తరుక్కుపోతుంది! ఎంతైనా తల్లి కదా..