Viral: ఇండియాకు రానా? అంటూ ఎన్నారై ప్రశ్న! రావద్దంటూ నెటిజన్ల గగ్గోలు!
ABN , Publish Date - Oct 18 , 2024 | 10:28 PM
ఐరోపాలో ఉంటున్న ఓ టెకీ ఇండియాకు రావాలని ఉందంటూ నెట్టింట పోస్టు పెట్టాడు. ఈ నిర్ణయం మంచిదేనా అని నెటిజన్లను ప్రశ్నించాడు. దీంతో, ఈ పోస్టు వైరల్‌గా మారింది. ఈ పోస్టుకు జనాలు పెద్ద ఎత్తున స్పందించగా అనేక మంది అతడికి ఇండియాకు రావద్దని వారించారు.
ఇంటర్నెట్ డెస్క్: అతడో టెకీ. ఐరోపాలో 5 ఏళ్లుగా పని చేసిన అనుభవం అతడి సొంతం. జీతం ఏటా రూ.80 లక్షలు (సీటీసీ). కానీ అతడికి భారత దేశంపై మనసు మళ్లింది. బెంగళూరులో ఓ జాబ్ ఆఫర్ కూడా వచ్చింది. రూ.50 లక్షల జీతం ఆఫర్ చేశారు. దీంతో, తిరిగిరావడమే బెటరని అతడు దాదాపుగా ఫిక్స్ అయ్యాడు. ఎందుకైనా మంచిదని ఈ విషయాన్ని కుటుంబసభ్యులతో పాటు నెట్టింట పంచుకున్నాడు. జనాల సలహా కోరాడు. జనాలు ఈ ఉదంతంపై ముక్తకంఠంతో స్పందిస్తుండగంతో ప్రస్తుతం ఈ పోస్టు నెట్టింట రచ్చ రచ్చ చేస్తోంది (Viral).
Viral: కారు కొనద్దన్న ఇన్‌ఫ్లుయెన్సర్‌పై నెట్టింట విమర్శలు!
బెంగళూరులో రూ.50 లక్షల జీతంతో హ్యాపీగా బతకొచ్చనుకున్న ఆ ఎన్నారై భారత్‌కు తిరిగిరావాలని భావించాడు. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెబితే వారు అస్సలు రావద్దని వారు ఖరాఖండీగా చెప్పేశారు. ఇక్కడ జీవితం దారుణంగా ఉంటుందని హెచ్చరించారు. అయితే, సొంత దేశానికి తిరిగెళ్లాలని మనసు గోల చేస్తుంటే చివరి ప్రయత్నంగా అతడు జనాల అభిప్రాయం కోసం నెట్టింట బాటపట్టాడు. అయితే, చాలా మంది నెటిజన్లు కూడా టెకీ తల్లిదండ్రులతో ఏకీభవించారు. ఇండియాకు రావద్దని తేల్చి చెప్పారు.
Viral: ఇంత టాలెంటెడ్‌గా ఉంటే జాబ్ ఇవ్వము! యువతికి షాకిచ్చిన గూగుల్!
ఇండియాకు రావద్దని సలహా ఇచ్చిన నెటిజన్లు రకరకాల కారణాలు చెప్పుకొచ్చారు. ‘‘ఇక్కడ వర్క్-లైఫ్ బ్యాలెన్స్ అస్సలు ఉండదు. అవినీతి ఆకాశమంత ఎత్తుకు విస్తరించింది. ఆహారం, నీరు, గాలి, అన్నీ కల్తీ అయిపోయాయి. ఇవి చాలా ఇంకేమైనా కావాలా?’’ అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. ‘‘ఉద్యోగ భద్రత వద్దనుకుంటే, విషపూరిత పనిసంస్కృతి కావాలని కోరుకుంటే కచ్చితంగా ఇక్కడకు రావచ్చు. ఇబ్బందేంలేదు’’ అని మరో వ్యక్తి సెటైర్ పేల్చాడు. ‘‘ఈయూ దేశాల్లో కార్మిక చట్టాలు కఠినంగా ఉంటాయి. సంస్థలు తమ ఉద్యోగులను ఇష్టారీతిన తొలగించలేదు. ఇండియాలో కంపెనీలు ఇష్టారీతిన లేఆఫ్స్ చేపడుతున్నాయి. కుటుంబ కారణాలతో ఇండియాకు వస్తానంటే ఓకే కానీ లేకపోతే ఇక్కడకు రావాల్సిన అవసరం లేదు’’ అని మరో వ్యక్తి వివరించాడు. ‘‘రోడ్ల మీద ప్రయాణించనంతవరకూ, ప్రభుత్వ ఆఫీసులతో అవసరం పడనంతవరకూ ఇండియాలో లైఫ్ బాగుంటుంది. లేకపోతే చుక్కలు కనిపిస్తాయి’’ అని మరో వ్యక్తి అన్నాడు.
Viral: మనిషంటే నువ్వే బాసూ! అచేతనంగా పడున్న పామును ఎలా కాపాడాడో చూడండి!
‘‘బెంగళూరులో పుట్టిపెరిగినట్టైతే ఇక్కడకు తిరిగిరావచ్చు. అక్కడ నెల రోజులు ఈజీగా లీవ్ తీసుకోవచ్చు. బెంగళూరులో వరుసగా 15 సెలవలు దొరకడం కూడా కష్టమే’’ అని మరో వ్యక్తి హెచ్చరించాడు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ ఉదంతం చర్చనీయాంశంగా మారింది.