Share News

Viral: భారత యువతిని పబ్లిక్‌గా ఆ డ్రెస్‌లో చూసి.. జపాన్ యువత షాక్!

ABN , Publish Date - May 16 , 2024 | 05:35 PM

సంప్రదాయ చీరకట్టులో జపాన్ వీధుల్లో క్యాట్ వాక్ చేస్తూ ఓ భారతీయ యువతి అక్కడి యువతను ఆశ్చర్యపరిచింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.

Viral: భారత యువతిని పబ్లిక్‌గా ఆ డ్రెస్‌లో చూసి.. జపాన్ యువత షాక్!

ఇంటర్నెట్ డెస్క్: భారతీయతకు చిరునామాగా నిలిచే చీరకు ప్రపంచవ్యాప్తంగా అనేక మంది అభిమానులు ఉన్నారు. అనేక అంతర్జాతీయ ఫ్యాషన్ షోలల్లో మోడల్స్ చీర స్ఫూర్తితో డిజైన్ చేసిన డ్రెస్సుల్లో తళుక్కున మెరిశారు. ఎందరో ష్యాషన్ డిజైనర్లకు స్ఫూర్తిగా నిలిచింది చీర. ఇక ప్రపంచం నలుమూలలా భారతీయులు ఉండటంతో అనేక సంస్కృతుల వారికి మన వస్త్రధారణ గురించి తెలుసు. ఇప్పుడిదంతా ఎందుకంటే ఓ భారతీయ యువతి చీర ధరించి జపాన్ వాసులను ఆశ్చర్యపరిచింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా (Viral)0 మారింది.

జపాన్ వీధుల్లో ఫొటో షూట్ నిర్వహించిన ఓ యువతి అక్కడి వారిని తన చీరకట్టుతో ఆశ్చర్యపరిచింది. బంగారం రంగు బార్డర్ ఉన్న నీలి రంగు చీర ధరించిన ఆమె హోయలొలికిస్తూ క్యాట్ వాక్ చేస్తుంటే చూసి అక్కడి వారు ఆశ్చర్యపోయారు. అనేక మంది తమ ఫోన్లు తీసి ఈ అందాన్ని కెమెరాలతో బంధించారు. ఆమె వస్త్రధారణ చూసి జపాన్ యువత ఆశ్చర్యపోవడం ఈ వీడియోలో స్పష్టంగా చూడొచ్చు (Indian Woman's Saree Glam In Japan Makes Heads Turn And How).

Viral: డోర్ హ్యాండిల్‌‌కు చుట్టుకున్న పాము.. తలుపు తీయగానే.. షాకింగ్ వీడియో


తనను చీరకట్టులో చూసి జనాల నుంచి ఇలాంటి రియాక్షన్ వస్తుందని అస్సలు ఊహించలేదని సదరు యువతి పేర్కొంది. ‘‘జపాన్‌లో చీరకట్టులో వెళుతుంటే నన్ను చూసి అక్కడి వారు ఆశ్చర్యపోయారు. సరదాగా కోసం సంప్రదాయక వస్త్రధారణలో టోక్యో వీధుల్లో వెళితే జనాల నుంచి ఇలాంటి రియాక్షన్ వస్తుందని అస్సలు ఊహించలేదు’’ అని ఆ యువతి తన వీడియోకు క్యాప్షన్ కూడా జతచేసింది.

నెటిజన్లకు.. ముఖ్యంగా భారతీయులకు కూడా ఈ వీడియో నచ్చడంతో దీన్ని తెగ వైరల్ చేస్తున్నారు. ఇప్పటికే దీనికి 70 లక్షల వరకూ వ్యూస్ వచ్చాయి. అక్కడి యువతకు చీరకట్టు నచ్చడం భారతీయ నెటిజన్లను అనేక మందిని ఆశ్చర్యపరిచింది. అయితే యువతి వస్త్రధారణపై కొందరు మాత్రం పెదవివిరిచారు.

Read Viral and Telugu News

Updated Date - May 16 , 2024 | 05:42 PM