Viral: శాకాహారినైనందుకు గర్వంగా ఉందన్న యువతి! నెట్టింట దుమారం!
ABN , Publish Date - Oct 19 , 2024 | 06:26 PM
శాకాహారినైనందుకు గర్వపడుతున్నానంటూ ఓ యువతి పెట్టిన పోస్టు నెట్టింట వైరల్‌గా మారింది. దీనిపై నెట్టింట పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: శాకాహారినైనందుకు గర్వపడుతున్నానంటూ ఓ యువతి పెట్టిన పోస్టు నెట్టింట వైరల్‌గా మారింది. ఈ పోస్టు మాంసాహారులను రెచ్చగొట్టిన్నట్టుందంటూ మండిపడుతున్న నెటిజన్లు ఆమెను తిట్టిపోస్తున్నారు. కొందరు మాత్రం ఆమెకు మద్దతుగా కామెంట్స్ చేస్తున్నారు. దీంతో, ఈ ఉదంతం నెట్టింట చర్చనీయాంశంగా (Viral) మారింది.
నళినీ ఉనాగర్ అనే యూట్యూబర్ ఇటీవల తన ఆహారపు అలవాట్ల గురించి చెబుతూ ఓ పోస్టు పెట్టింది. పప్పు, అన్నం ఉన్న ప్లేట్ ఫొటోను నెట్టింట పంచుకున్న ఆమె శాకాహారినైనందుకు గర్వపడుతున్నానని పోస్టు పెట్టింది. జంతువుల కన్నీళ్లు, హింస, తప్పు చేశానన్న భావనలకు తన ఫుడ్‌లో స్థానం లేదని పేర్కొంది. ఇందుకు తనకెంతో సంతోషంగా ఉందని చెప్పుకొచ్చింది.
Viral: ఈ బస్సు డ్రైవర్ గ్రేట్.. అందరూ ఇలా చేస్తే రోడ్డు ప్రమాదాలే జరగవు!
ఈ పోస్టు చూడగానే జనాలు రెచ్చిపోయారు. ఆమెపై మండిపడ్డారు. ఆమె ఫుడ్ వెనకాల కూడా జీవ హింస ఉందంటూ పలు కామెంట్స్ చేశారు.
ఉనాగర్ పోస్టును ఏకంగా 3.4 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. అనేక మంది ఆమెను విమర్శించారు. తానేదో ఉన్నత విలువలు కలిగిన వ్యక్తినన్నట్టు గొప్పలకు పోవద్దని సలహా ఇచ్చారు.
అయితే, ఈ పోస్టుపై ఉనాగర్ స్పందిస్తూ తన వాదన వినిపించే ప్రయత్నం చేసింది. ‘‘మొక్కలకు పురిటినొప్పులు ఉండవు. జంతువులకు ఉంటాయి. మొక్కలకు మెదళ్లు ఉండవు. జంతువులకు ఉంటాయి’’ అంటూ తన ఆహారపు అలవాట్ల గొప్పదనాన్ని చెప్పే ప్రయత్నం చేసింది.
Viral: ఇండియాకు రానా? అంటూ ఎన్నారై ప్రశ్న! రావద్దంటూ నెటిజన్ల గగ్గోలు!
కాగా, ఉనాగర్ గతంలో పెట్టిన పోస్టులు కూడా కాంట్రవర్సీకి దారి తీశాయి. అప్పట్లో ఇదే కాప్షన్‌తో ఆమె ఫ్రైడ్ రైస్, పనీర్ గ్రేవీ ఫొటోలను పోస్టు చేసింది. దీనిపై బాలీవుడ్ నటి స్వరా భాస్కర్ కూడా ఈ పోస్టుపై ఘాటుగా స్పందించింది. ‘‘తామేదో గొప్పవారమన్నట్టు ఈ వెజిటేరియన్లు ఇచ్చే బిల్డప్ నాకు ఓపట్టాన అర్థం కాదు. మీ డైట్‌లోనూ జీవ హింస ఉంది. దూడను తల్లి నుంచి దూరం చేసి.. కృత్రిమ పద్ధతుల్లో గేదెలు గర్భం దాల్చేలా చేసి.. దూడలు తాగాల్సిన పాలను దొంగిలిస్తున్నారు. మీరూ కాయగూరలు తింటారుగా. అంటే ఓ మొక్క ప్రాణం తీసినట్టేగా. కాబట్టి.. మీ విలువల గురించి ఇలా డబ్బా కొట్టుకోకండి’’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది.