Share News

Viral: భారతీయులు ఆరోగ్యంగా ఉన్నారంటే ఇదే కారణం! అమెరికా యువతి కామెంట్ వెనక..

ABN , Publish Date - Jul 02 , 2024 | 07:14 PM

స్వదేశంలో వైద్యం ఎంత ఖరీదైనదో భారత్‌కు వచ్చాక ఓ అమెరికన్ యువతికి అర్థమైంది. భారత వైద్యరంగం విశేషాలకు ఆశ్చర్యపోయిన యువతి తన అనుభవాన్ని నెట్టింట పంచుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

Viral: భారతీయులు ఆరోగ్యంగా ఉన్నారంటే ఇదే కారణం! అమెరికా యువతి కామెంట్ వెనక..

ఇంటర్నెట్ డెస్క్: స్వదేశంలో వైద్యం ఎంత ఖరీదైనదో భారత్‌కు వచ్చాక ఓ అమెరికన్ యువతికి అర్థమైంది. భారత వైద్యరంగం విశేషాలకు ఆశ్చర్యపోయిన యువతి తన అనుభవాన్ని నెట్టింట పంచుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ (Viral) అవుతోంది. మెకెన్జీ, ఆమె బాయ్‌ఫ్రెండ్ ట్రావెల్ వ్లాగర్స్. వివిధ దేశాలు పర్యటిస్తూ తన అనుభవాలను వీడియోల రూపంలో ఇన్‌స్టాలో పంచుకుంటూ ఉంటారు.

Viral: ఖడ్గమృగాల్ని నడిచే అణుబాంబుల్లా మారుస్తున్న శాస్త్రవేత్తలు! ఎందుకో తెలిస్తే..

ఇటీవల ఆ జంట ఇండియాకు వచ్చింది. కానీ, ఆమె బాయ్‌ఫ్రెండ్ అనుకోకుండా అనారోగ్యం పాలయ్యాడు. దీంతో, మెకెన్జీ వెన్నులో వణుకు మొదలైంది. అతడి వైద్యానికి భారీ ఖర్చవుతుందని భావించి ఆమె గుండె దడదడలాడింది. అమెరికాలో లాగా ఇక్కడ కూడా వైద్యం ఖరీదైన వ్యవహారంగా భావించింది (Indias Affordable Healthcare System Impresses US Woman).


కానీ ఆమె స్నేహితురాలు మెకెన్జీకి కావాల్సిన సాయం చేసింది. ముందుగా అతడికి కొన్ని బ్లడ్ టెస్టులు చేయించింది. ఇందుకు కోసం నర్సు ఇంటికే వస్తారని, రోగులకు అనువైన సమయంలో బ్లడ్ శాంపిల్స్ తీసుకుంటారని తెలిసి మెకెన్జీ ఆశ్చర్యపోయింది. అంతేకాకుండా, టెస్టులకు కేవలం రూ.1100 ( 14 డాలర్లు) ఖర్చు కావడంతో ఆమె నోరెళ్లబెట్టింది. ఆ తరువాత స్నేహితురాలి సాయంతో డాక్టర్ అపాయింట్‌మెంట్ తీసుకుని బాయ్‌ఫ్రెండ్‌కు చికిత్స చేయించింది. ఎంతో ఖర్చవుతుందనుకున్న వ్యవహారం ఇంత తక్కువ డబ్బుతో పూర్తి కావడంతో మెకెన్జీ ఆనందానికి అంతేలేకుండా పోయింది.

ఇదంతా నెట్టింట పంచుకున్న అమెరికా యువతి.. భారత్‌లో వైద్యం ఇంత సులువని అస్సలు తెలీదని కామెంట్ చేసింది. భారత్‌లో 140 కోట్ల మంది ఆరోగ్యంగా ఉన్నారంటే ఈ వ్యవస్తే కారణం అంటూ వ్యాఖ్యానించింది. సహజంగానే యువతి వీడియోకు నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. వీడియోకు లక్షకు పైగా వ్యూస్ వచ్చాయి. కానీ, అమెరికన్ యువతికి భారత్‌పై అవగాహన అసంపూర్ణమని కామెంట్ చేశారు. ఇక్కడి సామాన్యులకు నాణ్యమైన వైద్యం ఖరీదైన వ్యవహారంగా మారిందని వాపోయారు.

Read Viral and Telugu News

Updated Date - Jul 02 , 2024 | 07:14 PM