Share News

Viral Video: మసాజ్ పేరుతో తలపై తబలానే వాయించాడుగా.. ఈ తాత టాలెంట్‌కు నెటిజన్లు ఫిదా..

ABN , Publish Date - Sep 09 , 2024 | 11:04 AM

ఒత్తిడిని నుంచి ఉపశమనం కోసం హెడ్ మసాజ్ చేయించుకోవడం ఇటీవల కాలంలో ఎక్కువుగా చూస్తున్నాం. ఇతర దేశాల నుంచి భారత్‌కు వచ్చినప్పుడు చాలామంది తలకు మసాజ్ చేయించుకుంటున్న సందర్భాలు ..

Viral Video: మసాజ్ పేరుతో తలపై తబలానే వాయించాడుగా.. ఈ తాత టాలెంట్‌కు నెటిజన్లు ఫిదా..
Head Massage

దేశంలో ప్రతిభావంతులకు కొదవలేదు. నేటి సోషల్ మీడియా యుగంలో ప్రతి ఒక్కరి టాలెంట్ ప్రజలు చూడగలుగుతున్నారు. ప్రతి రోజు ఎన్నో వీడియోలు సామాజిక మాద్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం విదేశీయుడికి ఓ వ్యక్తి మసాజ్ చేసిన వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. అతడి స్టైల్ చూస్తుంటే తలపై తబలా వాయించినట్లే ఉంది. ప్రస్తుత బిజీ యుగంలో చాలా మంది ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఈ ఒత్తిడిని నుంచి ఉపశమనం కోసం హెడ్ మసాజ్ చేయించుకోవడం ఇటీవల కాలంలో ఎక్కువుగా చూస్తున్నాం. ఇతర దేశాల నుంచి భారత్‌కు వచ్చినప్పుడు చాలామంది తలకు మసాజ్ చేయించుకుంటున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఓ విదేశీయుడు హెడ్ మసాజ్ చేయించుకుంటున్న వీడియో వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి తలపై చాలా స్పీడ్‌గా మసాజ్ చేస్తున్నాడు. అతడి వేగాన్ని చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.


ఒత్తిడి నుుంచి ఉపశమనం..

వారాంతాలు, హెయిర్ కట్ చేయించుకునే సమయాల్లో ఎక్కువమంది హెడ్ మసాజ్ చేయించుకుంటూ ఉంటారు. పని ఒత్తిడి నుంచి ఉపశమనంతో పాటు తలనొప్పి వంటి సమస్యలను దూరం చేసుకోవచ్చు. అంతేకాకుండా రక్త ప్రసరణ మెరుగవ్వడంతో పాటు ఆందోళనను దూరం చేసుకోవచ్చు. ఏకాగ్రత రెట్టింపు అవుతుంది. దీంతో ఇటీవల కాలంలో ఎక్కువమంది హెడ్ మసాజ్‌పై ఆసక్తి చూపిస్తున్నారు. భారతదేశంలో ఈ హెడ్ మసాజ్‌ను ఎక్కువుగా చూస్తుంటాం. ఈ మధ్య కాలంలో సెలూన్ షాపుల్లోనే హెడ్ మసాజ్ చేస్తున్నారు. ఎవరైనా ఇతర దేశాల నుంచి భారత్ వచ్చినప్పుడు హెడ్ మసాజ్ చేయించుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో తబలా వాయించడం కంటే వేగంగా హెడ్ మసాజ్ చేయడం చూడొచ్చు.


ఎంతో వేగంగా..

ఒక విదేశీయుడి తలపై 50 ఏళ్లకు పైబడియన ఓ వ్యక్తి మసాజ్ చేయడం వీడియోలో కనిపిస్తోంది. చాలా సులువుగా ఎంతో వేగంగా మసాజ్ చేయడం చూడొచ్చు. అచ్చం తబలా వాయించడం వచ్చిన వ్యక్తిలా.. తలపై తబలా వాయిస్తున్నట్లు మసాజ్ చేస్తున్నాడు. కొన్నిసార్లు తలపై మసాజ్ చేస్తూ.. మధ్యలో చెవుల దగ్గర మర్దన చేస్తున్నాడు. ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసినప్పటి నుంచి నెటిజన్లు తెగ ఇష్టపడుతున్నారు. వేలమంది వీక్షించడంతో పాటు వందలాది మంది ఈ వీడియోపై కామెంట్స్ చేస్తున్నారు. ఆయన మసాజ్ చేసిన తీరు అద్భుతమని ఒక నెటిజన్ కామెంట్ చేయగా.. గతంలో తబలా ప్రాక్టీస్ చేసినట్లు ఉన్నారంటూ మరో నెటిజన్ కామెంట్ చేశారు. ఇంత వేగంగా మసాజ్ చేసే వ్యక్తిని నేను చూడలేందటూ మరొకరు కామెంట్ చేశారు. మొత్తానికి ఈ హెడ్ మసాజ్ వీడియో సోషల్ మీడియాలో తెగ ట్రెండింగ్ అవుతోంది.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read More Latest Telugu News Click Here

Updated Date - Sep 09 , 2024 | 11:12 AM