Share News

Silent City: ట్రాఫిక్ తిప్పలు లేని సిటీ మీకు తెలుసా.. అదీ మన దేశంలో

ABN , Publish Date - Jun 24 , 2024 | 04:37 PM

ఓ పట్టణంలోఎలాంటి శబ్దాలు చేయకుండా వాహనాలు నడుస్తుంటాయి మీకు తెలుసా. ఇదెక్కడో విదేశాల్లో అనుకుంటే పొరపాటే. మన దేశంలోని ఓ ప్రముఖ పట్టణమే ఇది. నమ్మలేకపోతున్నారా. అయితే ఈ వార్త చదవాల్సిందే.

Silent City: ట్రాఫిక్ తిప్పలు లేని సిటీ మీకు తెలుసా.. అదీ మన దేశంలో

ఇంటర్నెట్ డెస్క్: అభివృద్ధి చెందుతున్న దేశాలను ప్రధానంగా వేధిస్తున్న సమస్య ట్రాఫిక్(Traffic Problem). రణ గోళ ధ్వనుల మధ్య ప్రజలు నిత్యం నరకం అనుభవిస్తున్నారు. ఇక రోడ్డు పక్కన ఇల్లు ఉన్న వారి సంగతి వేరే చెప్పనక్కర్లేదు. అలా ప్రశాంతంగా సూర్యుడిని చూద్దామని మిద్దెపైకి వెళ్తే ఇక అంతే.. వాహనాల సౌండ్లు, హారన్‌లతో నిత్య నరకమే. ముంబయి, హైదరాబాద్, బెంగళూరులాంటి నగరాల్లో మరీ దారుణ పరిస్థితులు ఉంటాయి.

శబ్ద కాలుష్యం పడని వారు బయటకి రాకుండా ఉండటమే మంచిదని భావిస్తుంటారు. అయితే ఓ పట్టణంలోఎలాంటి శబ్దాలు చేయకుండా వాహనాలు నడుస్తుంటాయి మీకు తెలుసా. ఇదెక్కడో విదేశాల్లో అనుకుంటే పొరపాటే. మన దేశంలోని ఓ ప్రముఖ పట్టణమే ఇది. నమ్మలేకపోతున్నారా. అయితే ఈ వార్త చదవాల్సిందే.


మిజోరం రాజధాని ఐజ్వాల్‌కి(Aizawl) మీరెప్పుడైన వెళ్తే అక్కడ రోడ్లన్ని ప్రశాంతంగా ఉంటాయి. వాహనాలు రోడ్లపై వెళ్లాక అనుకునేరు.. వాహనదారుల క్రమశిక్షణే రోడ్లను ప్రశాంతంగా ఉంచుతాయి. ఇక్కడ వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు తప్పకుండా పాటిస్తారు. రోడ్లపై ఇష్టానుసారంగా వాహనాలు నడపరు. దీంతో ఇక్కడ అరుదుగా ట్రాఫిక్ సమస్య తలెత్తుతుంది. కార్లని ఒక వరుసలో, బైక్‌లన్నీ మరో వరుసలో, పెద్ద వాహనాలన్నీ ఇంకో వరుసలో ప్రయాణిస్తుంటాయి.


ఓవర్ టేక్ చేయడమనే సమస్యే తలెత్తదు. చిత్రంలో వరుసగా వెళ్తున్న వాహనాలు మీరు చూడవచ్చు. హారన్ల చప్పుడు కూడా వినిపించదంటే అర్థం చేసుకోవచ్చు అక్కడి రోడ్లు ఎంత ప్రశాంతంగా ఉంటాయోనని. వరుస క్రమంలో రావడమే కదాండోయ్.. ప్రతి ద్విచక్రవాహనదారుడు హెల్మెట్ ధరిస్తాడు.

అంటే ట్రాఫిక్ రూల్స్‌ని పక్కాగా ఫాలో అవుతరన్నమాట. ఎక్కువగా విదేశాల్లోనే ఇంత పక్కాగా ట్రాఫిక్ రూల్స్ అనుసరించే ప్రజలను చూస్తుంటాం. అలాంటిది మన దేశంలోనే ఇలాంటి ఒక పట్టణం ఉందంటే అన్ని నగరాలు, పట్టణాలకు ఐజ్వాల్ ఆదర్శమే కదా.

For Latest News and National News click here

Updated Date - Jun 24 , 2024 | 04:37 PM