Inflation: మీ వద్ద రూ.కోటి ఉందా! 2050 కల్లా ఆ విలువ ఎంత తగ్గుతుందో తెలిస్తే..
ABN , Publish Date - Oct 06 , 2024 | 03:06 PM
ద్రవ్యోల్బణం కారణంగా రూపాయికి ఉన్న కొనుగోలు శక్తి తగ్గిపోతుందని నిపుణులు చెబుతున్నారు. ఫలితంగా దాచిపెట్టుకున్న డబ్బు విలువ క్రమంగా పడిపోతుంది. ఈ సమస్యను తప్పించుకోవాలంటే కూడబెట్టిsన డబ్బును మళ్లి పెట్టుబడిగా మారిస్తే ద్రవ్యోల్బణాన్ని తట్టుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: ఎవరి వద్దనైనా రూ. కోటి ఉంటే వాళ్లు కచ్చితంగా కోటీశ్వరులే. పిల్లల, చదువులు, వైద్య ఖర్చులు..ఇలా ఏ అవసరానికైనా ఆందోళన అక్కర్లేదు. కానీ, ఈ డబ్బుతో భవిష్యత్తుకు భరోసా లభించినట్టేనా అంటే అస్సలు కాదని ఆర్థిక రంగ నిపుణులు చెబుతున్నారు. దాదాపు మరో పాతికేళ్లకు ఈ డబ్బు విలువ ఏకంగా ఐదొ వంతుకు పడిపోతుందని అంటున్నారు. అంటే, నేటి రూ. కోటి 2050 నాటికి రూ.17.41 లక్షలతో సమానమట (Personal Finance). అదెలా సాధ్యమని అంటరా? అయితే, ఈ కథనం మీ కోసమే..
TATA: గుడ్ న్యూస్ చెప్పిన టాటా సంస్థ! ఐఫోన్ కంపెనీలో జాబ్ కావాలా? అయితే..
అంతా ద్రవ్యోల్బణం మాయ..!
కాలం గడిచే కొద్దీ డబ్బు విలువ పడిపోవడాన్నే ద్రవ్యోల్బణం అంటారు. ఉదాహరణకు ఇరవై ఏళ్ల క్రితం రూ.100కు లభించే ఏ వస్తువుకైనా నేడు అంతకు రెట్టింపు పెట్టాల్సి వస్తోందంటే రూపాయి విలువ పడిపోయిందనే అర్థం. గత దశాబ్దంలో భారత్‌లో ద్రవ్యోల్బణం సగటు 5-6 శాతంగా ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇదే తీరు కొనసాగితే రూపాయికున్న కొనుగోలు శక్తి మరింతగా తగ్గుతుంది. అంటే.. వచ్చే పదేళ్లల్లో రూ.కోటి కాస్త రూ.55.84 లక్షలుగా మారుతుంది. మరో పదేళ్లకు ఇది రూ.31.18 లక్షలుగా మారుతుంది. ఇక 2050 కల్లా కోటి కాస్త రూ.17.41లకు సమానంగా మారిపోతుంది.
భారత మార్కెట్లోకి రోల్స్ రాయిస్ కలినాన్ సిరీస్-2
గత కొన్ని దశాబ్దాలుగా బంగారం ధరల్లో వస్తున్న మార్పులు గమనిస్తే ఈ విషయం మరింత స్పష్టంగా ఉంటుందని ఆర్థిక రంగ నిపుణులు చెబుతున్నారు. ఉదాహరణకు 1950ల్లో 10 గ్రాముల బంగారం ధర రూ.99గా ఉండేది. నేడు పది గ్రాముల బంగారం ఏకంగా రూ.78 వేలకు చేరుకుంది. అంటే..1950ల్లో నెలకు రూ.200 సంపాదిస్తూ విలాసవంతమైన జీవితం అనుభవించిన వాళ్లు ఇప్పటికీ అదే లైఫ్ స్టైల్ కొనసాగించాలంటే వారి సంపాదన నెలకు రూ.1.5 లక్షలుగా ఉండాలన్నమాట.
కష్టపడి సంపాదించుకున్న డబ్బు విలువ ఇలా మంచులా కరిగిపోకుండా ఉండాలంటే పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. కేవలం సేవింగ్స్ బ్యాంకులో డబ్బు దాచుకోవడమే కాకుండా వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని సూచిస్తున్నారు. మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్, రియల్ ఎస్టేట్, బంగారం ఇలా రకరకాల పెట్టుబడి సాధనాల్లోకి డబ్బు మళ్లిస్తే అనుకోని నష్టాలు, ద్రవ్యోల్బణం తాలూకు నష్టాలు పోను మంచి రాబడి కళ్ల చూడొచ్చని చెబుతున్నారు.
మ్యూచువల్ ఫండ్ల రిస్క్‌కు కలర్ కోడింగ్!