Share News

Viral: అందంగా ఉన్నందుకు పార్టీకి రావద్దంటూ నిషేధం! మహిళకు షాకింగ్ అనుభవం

ABN , Publish Date - Dec 15 , 2024 | 09:05 PM

బ్రెజిల్ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ మెరీనా స్మిత్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేసింది. తాను అందంగా ఉన్నట్టు తన స్నేహితురాళ్లు క్రిస్మస్ పార్టీకి రావద్దన్నారని పేర్కొంది.

Viral: అందంగా ఉన్నందుకు పార్టీకి రావద్దంటూ నిషేధం! మహిళకు షాకింగ్ అనుభవం

ఇంటర్నెట్ డెస్క్: బ్రెజిల్ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ మెరీనా స్మిత్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేసింది. తాను అందంగా ఉన్నట్టు తన స్నేహితురాళ్లు క్రిస్మస్ పార్టీకి రావద్దన్నారని పేర్కొంది. ‘‘క్రిస్మస్ పార్టీలకు రాకుండా నాపై నా స్నేహితురాళ్లు నిషేధం విధించారు. వారి భర్తలు, భాగస్వాములను నేను సొంతం చేసుకుంటానని వారు అభద్రతా భావానికి లోనవుతున్నారు’’ అని మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొంది (Viral).

Gujarat: కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేయడం ఇష్టం లేక వేళ్లు నరికేసుకున్న వ్యక్తి!


స్థానిక అందాల పోటీలో విజేతగా నిలిచిన ఆమె తాను అందంగా ఉన్నంత మాత్రాన దూరం పెట్టడం సబమేనా అని పేర్కొంది. తన స్నేహితురాళ్ల జీవిత భాగస్వాములకు దగ్గరయ్యే ప్రయత్నం తానెప్పుడూ చేయలేదని కూడా పేర్కొంది. ‘‘యస్.. నేను అందగత్తెనే. కానీ ఈ కారణంతో నన్ను అందరూ దూరం పెట్టడం సబబు కాదు’’ అని పేర్కొంది.

‘‘నాకు నచ్చేలా నేను డ్రెస్‌‌లు వేసుకుంటాను. ఎవరి కోసమో కాదు. ఈ సమస్యకు నేను కాదు వారే కారణం. వారు ఓ ప్రాణ స్నేహితురాల్ని కోల్పోయారు. నా కంటే మంచి స్నేహితురాలు ఎక్కడా ఉండరు’’ అని చెప్పుకొచ్చింది.

Viral: సోషల్ మీడియాలో జనాల సానుభూతితో డబ్బులు దండుకున్న వ్యక్తి జైలుపాలు


కాగా, గతంలో కూడా ఆమెకు ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయి. ఓ సందర్భంలో ఆమె స్నేహితురాళ్లు ఓ పెళ్లి వేడుకకు రావద్దని నిర్మొహమాటంగా చెప్పేశారు. ‘‘నేనొస్తే అందరూ నన్నే చూస్తారని వధువు తెలిపింది. అందంగా ఉన్న వారితో కొంత భిన్నంగా ప్రవర్తిస్తారు. నీ ప్రతిభ ఎలా ఉందనేది చూడకుండా అందచందాల ఆధారంగానే అంచనాకు వస్తారు’’ అని చెప్పుకొచ్చింది.

ఈ మద్య తనను అందరూ దూరం పెడుతున్నారని వాపోయింది. స్నేహితులతో కలిసి ఎటువంటి పార్టీలకు పబ్బాలకు వెళ్లట్లేదని చెప్పుకొచ్చింది. తనకు భాగస్వామి కూడా ఎవరూ లేకపోవడంతో ఒంటరి తనం ఇబ్బంది పెడుతోందని చెప్పుకొచ్చింది. ‘‘నాకు బాయ్‌ఫ్రెండ్ లేకపోవడం, అందంగా ఉండటం నా స్నేహితురాళ్లను అభద్రతా భావానికి గురి చేస్తున్నాయి’’ అని తెలిపింది. దీంతో, ఆమె ఇంటర్వ్యూ ప్రస్తుతం వైరల్‌గా మారింది.

Viral: వామ్మో.. ఈ అడల్ట్ డైపర్స్ ధర రూ.6 వేలు! ఎందుకో తెలిస్తే..

Viral: వామ్మో! టెస్లా రూపొందించిన ఈ మనిషి లాంటి రోబోను చూశారా..

Read Latest and Viral News

Updated Date - Dec 15 , 2024 | 09:05 PM