Kelloggs Chocos: మీ పిల్లలకు చాకోస్ పెడుతున్నారా? కెలాగ్స్ చాకోస్‌లో కనిపించిన పురుగులు..
ABN , Publish Date - Feb 13 , 2024 | 03:23 PM
చాకోస్ తృణధ్యానాల నుంచి తయారవుతాయి కాబట్టి చాలా ఆరోగ్యకర స్నాక్ అని చాలా మంది భావిస్తున్నారు. పిల్లలకు అవసరమైన పోషకాలు అందుతాయని చాలా మంది నమ్మకం.
చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు స్నాక్స్‌గా చాకోస్ (Chocos) పెడుతుంటారు. ముఖ్యంగా కెల్లాగ్స్ కంపెనీకి చెందిన చాకోస్‌ను (Kellogg's Chocos) ఎక్కువగా వినియోగిస్తున్నారు. నేరుగా తినడం లేదా, పాలలో కలిపి తినడం వంటివి చేస్తున్నారు. చాకోస్ తృణధ్యానాల నుంచి తయారవుతాయి కాబట్టి చాలా ఆరోగ్యకర స్నాక్ అని చాలా మంది భావిస్తున్నారు. పిల్లలకు అవసరమైన పోషకాలు అందుతాయని చాలా మంది నమ్మకం. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియో (Viral Video) చూస్తే షాక్ అవక తప్పదు.
వైరల్ అవుతున్న ఆ వీడియోలో వ్యక్తి కెల్లాగ్స్ బ్రాండ్‌కు చెందిన చాకోస్ ప్యాకెట్ కొని ఓపెన్ చేశాడు. అయితే అందులో చిన్న చిన్న పురుగులు ఉన్నాయి. ఆ ప్యాకెట్‌లో ప్రతి చాకోస్‌లో పురుగులు కనిపించాయి. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి.. ``ఎక్స్‌ట్రా ప్రోటీన్ లభ్యమవుతోంది`` అని క్యాప్షన్ పెట్టాడు. ఈ ప్యాకెట్ మార్చి 7, 2024న ఎక్స్‌పైర్ అవుతోంది. ఎక్స్‌పైరీ డేట్‌కు ముందుగానే చాకోస్‌కు పరుగులు పట్టడం చాలా మందికి ఆందోళన కలిగిస్తోంది (Insects in Kellogg's Chocos).
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కెల్లాగ్స్ సంస్థ స్పందించింది. ``మీకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాం. మా సిబ్బంది మిమ్మల్ని సంప్రదిస్తారు. దయచేసి వారికి వివరాలు అందించండి`` అని పేర్కొంది. కాగా, ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. గతంలో తమకు కూడా అలాంటి అనుభవాలు ఎదురయ్యాయని తెలియజేశారు.