Share News

Viral: సక్సెస్ అంటే ఇదీ.. సిలికాన్ వ్యాలీలోని ఈ ఎన్నారై ఇల్లు చూస్తే..

ABN , Publish Date - Sep 14 , 2024 | 09:33 PM

అమెరికాలోని సిలికాన్ వ్యాలీలో ఓ భారతీయ టెకీకి చెందిన విలాసవంతమైన ఇంటి వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. చిన్న వయసులోనే ఆ దంపతులు ఇంత గొప్ప ఇంటిని సొంతం చేసుకోవడం చూసి జనాలు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Viral:  సక్సెస్ అంటే ఇదీ.. సిలికాన్ వ్యాలీలోని ఈ ఎన్నారై ఇల్లు చూస్తే..

ఇంటర్నెట్ డెస్క్: అమెరికాలోని సిలికాన్ వ్యాలీలో ఓ భారతీయ టెకీకి చెందిన విలాసవంతమైన ఇంటి వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. చిన్న వయసులోనే ఆ దంపతులు ఇంత గొప్ప ఇంటిని సొంతం చేసుకోవడం చూసి జనాలు ప్రశంసలు కురిపిస్తున్నారు. కష్టించి పనిచేస్తే ఇలాంటి విజయం దక్కుతుందని పలువురు వ్యాఖ్యానించారు (Viral).

Viral: ఈ రక్తం ధర లీటరుకు రూ.12 లక్షలు! ఇంత ఖరీదు ఎందుకో తెలిస్తే..


ఇన్‌స్టా కంటెంట్ క్రియేటర్ ప్రియమ్ సారస్వత్‌కు ఆ యువ ఎన్నారై జంట తమ ఇల్లు చూపించింది. సకల సౌకర్యాలు కలిగిన ఆ విలాసవంతమైన ఇంటి పెరట్లో అద్భుతమైన స్విమ్మింగ్ పూల్, గేమ్స్ ఆడుకునేందుకు మరో ప్రత్యేక గది, ఖరీదైన హోం థియేటర్ సిస్టమ్ ఉన్నాయి. ఆ యువ ఎన్నారై దంపతులు ఎంతో మురిసిపోతూ తమ ఇంటి ప్రత్యేకతలను ప్రీయమ్‌కు వివరించారు.

ఇన్ని సౌకర్యాలు ఉన్న ఇంట్లో ఆ ఎన్నారై తన తల్లిదండ్రులతో కలిసి ఉండటం భారతీయులను మరింతగా ఆకర్షించింది. అంతటి గొప్ప ఇంటిని వీడియోలో చూస్తూ జనాలు మైమరిచిపోయారు. కుప్పలు తెప్పలుగా కామెంట్స్ చేశారు.

Viral: విమానం ఎంట్రీ డోర్స్ ఎడమ వైపే ఎందుకుంటాయో తెలుసా?


సిలికాన్ వ్యాలీలో ఇంత గొప్ప ఇల్లు ఉందంటే తాను నమ్మలేకపోతున్నానని ఓ వ్యక్తి అన్నాడు. చిన్న వయసులోనే ఇలాంటి ఇల్లును సొంతం చేసుకోగలిగారంటే వారు లైఫ్‌లో ఎంత కష్టపడి ఉంటారో అర్థమవుతోందని మరో వ్యక్తి అన్నాడు. ఇంట్లోని విలాసవంతమైన సౌకర్యాలు కూడా అనేక మందిని ఆకర్షించాయి. వారి తల్లిదండ్రులు కూడా యువ జంటతో ఉండటం తమకు నచ్చిందని కూడా కామెంట్ చేశాడు. తామూ అమెరికాలో టెకీ అవుతామంటూ మరికొందరు సరదా వ్యాఖ్యలు చేశారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది.

Read Latest and Viral News

Updated Date - Sep 14 , 2024 | 09:40 PM