Share News

Viral: సముద్రంలో కూలనున్న ఇంటిని రూ.3 కోట్లకు కొన్న వ్యక్తి! ఎందుకంటే..

ABN , Publish Date - Sep 12 , 2024 | 10:21 PM

త్వరలో కూలిపోయే అవకాశం మెండుగా ఉన్న ఇంటిని ఓ అమెరికా వ్యక్తి దాదాపు మూడు కోట్లకు కొన్న ఉదంతం ప్రస్తుతం స్థానికంగా చర్చనీయాంశం అవుతోంది. కస్టమర్ల ధోరణిలో మార్పులకు ఈ ఉదంతం అద్దం పడుతోందని అక్కడి రియల్ ఎస్టే్ట్ వ్యాపారులు చెబుతున్నారు.

Viral: సముద్రంలో కూలనున్న ఇంటిని రూ.3 కోట్లకు కొన్న వ్యక్తి! ఎందుకంటే..

ఇంటర్నె్ట్ డెస్క్: త్వరలో కూలిపోయే అవకాశం మెండుగా ఉన్న ఇంటిని ఓ అమెరికా వ్యక్తి దాదాపు మూడు కోట్లకు కొన్న ఉదంతం ప్రస్తుతం స్థానికంగా చర్చనీయాంశం అవుతోంది. కస్టమర్ల ధోరణిలో మార్పులకు ఈ ఉదంతం అద్దం పడుతోందని అక్కడి రియల్ ఎస్టేట్ వ్యాపారులు చెబుతున్నారు (Viral) .

Viral: డైవర్స్ తీసుకున్న మహిళ రెండో పెళ్లికి పెట్టిన కండీషన్స్.. జనాలకు షాక్!

మాసాచుసెట్స్ రాష్ట్రంలోని ఈస్థమ్ సముద్ర తీరంలో ఈ మూడు పడకగదుల ఇల్లు. తీరంలో 25 అడుగుల ఎత్తున ఇసుక తిన్నెలపై ఈ ఇంటిని నిర్మించారు. 2022లో ఈ ఇంటిని అమ్మకానికి పెట్టారు. అప్పట్లో దీని ధర 1.195 మిలియన్ డాలర్లు పలికింది. అయితే, తీరం కోతకు గురవుతుండటంతో ఇది మరో పదేళ్లకు మించి నిలిచుండదని తేలడంతో డిమాండ్ పడిపోయింది. చివరకు డేవిడ్ మూట్ (59) అనే ఇంటీరియర్ డిజైనర్ దీన్ని 67 శాతం తక్కువ ధరకు కొనుగోలు చేశాడు (Interior Designer Purchases Rs 3 Crore Home on the Verge of Collapse).

Narayana Murthy: ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి మరో సూచన.. విమర్శలు మళ్లీ షురూ!


‘‘జీవితం చాలా చిన్నది. ఎప్పుడు ఏమైనా జరగొచ్చు. చూద్దాం.. మున్ముందు ఏం జరగనుందో. ఇది ఏదో రోజు సముద్రంలో కూలిపోతుంది. అయితే, నా జీవితకాలంలో అది జరగకపోవచ్చు’’ అంటూ డేవిడ్ ధీమా వ్యక్తం చేశారు. అయితే, ఇటీవల కాలంలో అనేక మంది ఇలాగే ఆలోచిస్తున్నారని అక్కడి రియల్ ఎస్టేట్ ఏజెంట్లు చెబుతున్నారు. వాతావరణ మార్పుల కారణంగా కనుమరుగయ్యే రియల్ ఎస్టేట్ ఆస్తులను తక్కువ ధరల్లో సొంతం చేసుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నట్టు తెలిపారు.

Viral: నేటి తరం చిన్నారులు ఎలా ఉన్నారో తెలుసా? వీడియో చూస్తే షాక్ పక్కా!

కాగా, అగ్రిమెంట్ కుదుర్చుకునే ముందు డేవిడ్ నిపుణులను సంప్రదించారు. ప్రమాదావకాశాలను తగ్గించుకునేందుకు పలు చర్యలు చేపట్టేందుకు సిద్ధమై ఇంటిని కొనుగోలు చేశారు. ముఖ్యంగా ఇంటి కింద మట్టి కొట్టుకుపోకుండా ఉండేందుకు అక్కడ మొక్కలను పెంచడం, ఇంటిలో కొంత భాగాన్ని సముద్రానికి మరింత దూరంగా జరపడం వంటి చర్యలు చేపడుతున్నారు. నిపుణుల ప్రకారం, అక్కడ తీరం కోతకు గురవడంతో పాటు సముద్రం మట్టం కూడా పెరిగి తీర ప్రాంతం ముంపునకు గురవుతాయట.

Viral: ఆత్మహత్యాయత్నం.. రైలు రావడం ఆలస్యమయ్యేసరికి పట్టాలపైనే కునుకు!


అయితే, ఇలాంటి ఆస్తుల కొనుగోళ్లు చేయొద్దని ఫ్లోరిడా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ స్టీఫెన్ లెదర్‌మన్ అన్నారు. తీరంలో ఉన్న ఆస్తులతో పలు ప్రమాదాలు ఉన్నాయని, ముఖ్యంగా తుఫాన్ల సందర్భంగా ప్రమాదాలకు ఛాన్స్ పెరుగుతుందని హెచ్చరించారు. అయితే, తన లాగా జీవిత చరమాంకంలో ఉన్న వారికి ఈ ఇంట్లో ఉండి ప్రకృతి అందాలను తిలకించే అవకాశం కల్పించాలన్నదే తన ఉద్దేశమని డేవిడ్ మూట్ తెలిపారు.

Read Latest and Viral News

Updated Date - Sep 12 , 2024 | 10:31 PM